శ్రీలంక విజయం
బ్యాంకాక్:మహిళల ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నమెంట్లో శ్రీలంక మరో విజయాన్ని సాధించింది. శనివారం బంగ్లాదేశ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో లంక మహిళలు ఏడు వికెట్ల తేడాతో గెలుపొందారు.బంగ్లాదేశ్ విసిరిన 94 పరుగుల లక్ష్యాన్ని లంక ఇంకా ఓవర్ మిగిలి ఉండగా ఛేదించింది.లంక క్రీడాకారిణుల్లో యశోద మెండిస్(24), జయాంగణి (39) రాణించి గెలుపులో తమ వంతు పాత్ర పోషించారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 93 పరుగులే చేసింది. సంజిదా ఇస్లామ్(35), షైలా షర్మిన్(25) లు ఆకట్టుకున్నారు.