రెండు టన్నులు కోకైన్ పట్టివేత
ఇటలీలో డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు ఉన్నతాధికారుల పటిష్టమైన చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఇటలీలోని దక్షిణాన గల కలబ్రియా ప్రాంతంలో రెండు టన్నుల కోకైన్ను ఉన్నతాధికారులు స్వాధీనం చేస్తుకుని సీజ్ చేసినట్లు స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. అందుకు సంబంధించి 12 మంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు చెప్పింది. భారీగా పట్టుబడిన కోకైన్ను దక్షిణ అమెరిక దేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారని పేర్కొంది.
ఇటలీలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా వ్యవహారిస్తుంది. ఆ నేపథ్యంలో డ్రగ్స్ మాఫియా కోరలు కత్తరించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహారించాలని నిర్ణయించారు. అందులోభాగంగా ఇటలీ పోలీసులు అంతర్జాతీయ పోలీసుల సహాయంతో దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.