సిటీలో బాలిక అదృశ్యం
సంతోష్‌నగర్ (హైదరాబాద్): ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిన ఓ బాలిక కనిపించకుండా పోయిన సంఘటన కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హఫీజ్‌బాబానగర్‌కు చెందిన సుల్తాన్ కుమార్తె ఉజ్మా బేగం (17) స్థానికంగానే ఉన్న తన అక్క రెహానా బేగం ఇంటి వద్ద ఉంటోంది.
కాగా, బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఉజ్మా బేగం ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి బయల్దేరి బయటకు వెళ్లింది. బాలిక ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్లో రెహానా బేగం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.