కోర్టు ఆవరణలో దారుణం
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి కోర్టులో సోమవారం దారుణం చోటు చేసుకుంది. తనపై కేసు పెట్టిన భార్యపై భర్త దాడి చేసి కత్తితో గొంతు కోశాడు. ఘటనలో తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త నాగేందర్ పై సౌజన్య 498 కేసు పెట్టింది. కేసు విచారణ వాయిదా కోసం ఇరువురూ ఈ రోజున కోర్టుకు రాగా ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.