vadde shobhanadreswar rao
-
‘రైతన్న’..వారి కష్టాలు కళ్లకు కట్టినట్లు..
‘‘కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చెయ్యాలి. దేశానికి రైతే వెన్నెముఖ అంటారు. కానీ అన్నదాత ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? అనే కథాంశంతో ‘రైతన్న’ సినిమా తీశా. ఈ సినిమాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వంగపండు ప్రసాదరావుగార్లు పాటలు పాడారు.. వారికి నా నివాళులు’’ అని ఆర్. నారాయణ మూర్తి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రైతన్న’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా పలువురు రైతు నాయకుల కోసం హైదరాబాద్లో ‘రైతన్న’ సినిమాని ప్రదర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డే శోభ నాద్రీశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ఈ రోజు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, వారి బాధలు, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాల వల్ల ఎలాంటి కష్టాలు వస్తాయో ‘రైతన్న’ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు నారాయణ మూర్తి. స్వామినాథన్ కమిషన్ నివేదికను వెంటనే అమలు పరచాలి’’ అన్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్ నాయకులు కోదండ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి, మధు, శ్రీనివాసరెడ్డి, ప్రజాకవి గద్దర్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, కవి అందె శ్రీ, రైతు నాయకులు వెంకట రామయ్య, మల్లారెడ్డి, గోవర్ధన్, సాగర్, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
స్విచ్ ఒప్పందం రద్దు శుభపరిణామం
సాక్షి, విజయవాడ : ఏపీ ప్రభుత్వం, సింగపూర్ కంపెనీలు స్విచ్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం శుభపరిణామం, దీన్ని మేము మనస్పూర్తిగా స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిరావు పేర్కొన్నారు. అప్పట్లో చంద్రబాబు చెప్పినా వినిపించుకోకుండా స్విచ్ చాలెంజ్ను సింగపూర్ కంపెనీలకు అనుకూలంగా మార్చడానికి ఏకంగా రూల్స్ మార్చారు. ఈ ఒప్పందం ఒక లోపభూయిష్టమైనదని, దీనిని రద్దు చేయడంపై ప్రజలందరూ సంతోషించాలని పేర్కొన్నారు. స్విచ్ చాలెంజ్ ఒప్పందం వల్ల రూ. 306 కోట్లు సింగపూర్ కంపెనీలు పెట్టుబడితే రూ. 3604 కోట్లు లబ్ధి చేకూరనుంది. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుందని తెలిపారు. ఈ ఒప్పందం రద్దు అయితే రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదు అంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. స్విస్ చాలెంజ్ ఒప్పందం రద్దు వల్ల ఏపీలోని 13 జిల్లాల అభివృద్ది జరిగేలా అధికార వికేంద్రికరణ జరగాలి అని అభిప్రాయపడ్డారు. రాజధానిలో 45,50 అంతస్తుల నిర్మాణాలపై ప్రభుత్వం పునరాలోచించాలని తెలిపారు. -
అక్కడ మంత్రి అయితే ఇంటికే!
సాక్షి,మైలవరం : రాజకీయాల్లో ఒక్కొక్క చోట.. ఒక్కో రకం సెంటిమెంట్ రాజ్యమేలుతుంటాయి. మైలవరం నియోజకవర్గంలో ఒక సెంటిమెంట్ ప్రచారంలో ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మంత్రి పదవి చేపడితే ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి ఖాయం అనేది ఆ సెంటిమెంట్. 1983 ఎన్నికల నుంచి ఇదో సెంటిమెంట్గా మారింది. మైలవరం నుంచి చనమోలు వెంకట్రావు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆర్ ఆండ్ బీ శాఖ మంత్రిగా పనిచేశారు. తదనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 1989లో కోమటి భాస్కరరావు ఎమ్మెల్యేగా విజయం సాధించి మార్క్ఫెడ్ చైర్మన్గా పదవినలంకరించారు. తదనంతరం కనుమరుగయ్యారు. 1999లో వడ్డే శోభనాద్రీశ్వరరావు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొంది వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో పరాజయం తప్పలేదు. 2004 ఎన్నికల్లో చనమోలు వెంకట్రావు గెలుపొంది, పదవీ కాలం పూర్తి కాకుండానే మృతి చెందారు. 2009, 2014 ఎన్నికల్లో దేవినేని ఉమామహేశ్వరరావు విజయం సాధించారు. 2014 ఎన్నికల తరువాత ఆయన జలవనరుల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో మైలవరం అభ్యర్థిగా మరోసారి పోటీలో ఉన్నారు. ఈ దఫా ఎటువంటి ఫలితాలు వస్తాయో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
'రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాలు అవసరంలేదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాల భూమి అవసరం లేదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు అన్నారు. ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను వేధిస్తే సహించబోమని హెచ్చరించారు. రాజధానికి తాము వ్యతిరేకం కాదని, రైతుల ఆమోదంతోనే రాజధానిని నిర్మించాలని వడ్డే శోభనాద్రీశ్వరరావు సూచించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో రాజధానిని నిర్మించనున్న సంగతి తెలిసిందే.