సంతోశ్ కుటుంబానికి రూ.25 లక్షల సాయం
ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ మేఘదూత్‌లో వీరమరణం పొందిన సైనికుడు వైశాఖ సంతోశ్‌కుమార్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఫైలుపై మంగళవారం ఆయన సంతకం చేశారు. గత ఏడాది డిసెంబర్ 21న సియాచిన్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన సంతోశ్‌కుమార్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన భార్య నాగమణికి రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం తరఫున అందించాలని సీఎం ఆదేశించారు. నాగమణికి గాని, ఆమె సూచించిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి గానీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పారు.