తీర్పును చెత్త బుట్టలో వేయండి
దక్షిణ చైనా సముద్రం మాదే : చైనా
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంలో చైనాకు ఎలాంటి హక్కు లేదంటూ హేగ్‌లోని మధ్యవర్తిత్వ శాశ్వత కోర్టు (పీసీఏ) ఇచ్చిన తీర్పును చెత్త బుట్టలో పడేయాలని ఆ దేశం మండిపడింది. వ్యూహాత్మక దక్షిణ చైనా సముద్రాన్ని ‘ఎయిర్ డిఫెన్స్ జోన్’గా ప్రకటించే హక్కు తమకుందని తెలిపింది.
తీర్పు ప్రభావం తమ దేశంపై ఏమాత్రం ఉండదని చైనా రక్షణ మంత్రి వాంఖ్వాన్ చెప్పారు. ‘ఆ సముద్రం చైనాది. మా నేవీ, వాయుసేన అక్కడినుంచే పనిచేస్తాయి. ట్రిబ్యూనల్ తీర్పును అమలుపరచం. అది తెల్ల కాగితం వంటిదే. దాన్ని చెత్త బుట్టలో పడేయండి, లేదా చర్చలకు రండి’ అని ఫిలిప్పీన్స్‌ను ఉద్దేశించి విదేశాంగ సహాయ మంత్రి జెన్మిన్ అన్నారు.