ఆగస్టు 17న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
శంకర్ (దర్శకుడు), వాసుకి సుంకవల్లి (మిస్ యూనివర్స్ ఇండియా)
ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రసంఖ్య కావడం వల్ల వీరు అందంగా, ఆకర్షణీయంగా, మంచి ధైర్యసాహసాలతో ఉండి అందరినీ ఆకట్టుకుంటారు. జీవితంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. విలాసంగా జీవిస్తారు. విదేశీ విద్య, ఉద్యోగాల కల నెరవేరుతుంది. పుట్టిన తేదీ 17 శనిసంఖ్య కావడం వల్ల పనులలో జాప్యం జరిగినా, ఉద్యోగ, వ్యాపారాలలో స్థిరత్వాన్ని పొందుతారు. మనోబలం పెరుగుతుంది. రాజకీయ నాయకులకు ఉత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులో కొస్తుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
మేనేజిమెంట్ రంగంలో రాణిస్తారు. అనారోగ్య సమస్యలు, తోటివారితో భేదాభిప్రాయాలు తలెత్తవచ్చు. లక్కీ డేస్: 1,3,6, 8,9; లక్కీ కలర్స్: ఎల్లో, గోల్డెన్, శాండల్, బ్లూ, బ్లాక్; లక్కీ డేస్: గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: దక్షిణామూర్తి ఆరాధన, శనికి తైలాభిషేకం, శివునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, అనాథలను, వృద్ధులను ఆదరించడం. మాటలలో సంయమనం పాటించడం వల్ల మంచి జరుగుతుంది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్