ఎన్పీకుంట టీడీపీ ఎంపీపీ రాజీనామా
కదిరి : తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్పీ కుంట ఎంపీపీ ఎద్దుల వేదవతి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను జెడ్పీ సీఈఓ మీసాల రామచంద్రకు అందజేశారు. అందులో ఆమె తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె రాజీనామా లేఖను జెడ్పీ సీఈఓ కూడా ధ్రువీకరించారు.
టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ రాజీనామా చేయాలని ఆమెపై ఒత్తిడి తీసుకురావడంతోనే ఆమె రాజీనామా చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఎన్పీకుంట ఎంపీపీకి పదవీ గండం’ అన్న శీర్షికన బు«ధవారం ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించిన విషయం తెలిసిందే. ఆమె చేత బలవంతంగా నేడో, రేపో రాజీనామా చేయించవచ్చనే విషయం కూడా ‘సాక్షి’ అందులో పేర్కొన్న విషయం పాఠకులకు విదితమే. తదుపరి ఎంపీపీ రేసులో మర్రికొమ్మదిన్నె ఎంపీటీసీ నాగమ్మ పేరు వినబడుతోంది.