చేపల జడివాన
దామరచర్ల (నల్లగొండ) : నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రం శివారులోని వీరభద్రాపురంలో చేపల వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి దామరచర్లలో కుండపోత వాన పడింది. దీంతో ఆకాశం నుంచి పావుకిలో నుంచి కేజీ బరువు గల చేపలు పొలాల్లో పడ్డాయి.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు వలలు, కర్రలతో చేపలను వేటాడారు. కొర్రమేను, వాలుగ రకం చేపలు దొరికినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ తరహా ఘటన ఇదే మొదటిదని గ్రామస్తులు చెబుతున్నారు.