vekateshwara swamy
-
వెంకటేశ్వర స్వామికి శనివారం ఎందుకంత ప్రీతి ?
ఏయే వారాల్లో ఏ దేవుడుని పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుదనే వాటి గురించి పండితులు శాస్త్రాల్లో విపులంగా వివరించారు. అందులో భాగంగానే ఆదివారం సూర్యభగవానుడికి, సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామి, సుబ్రమణ్యేశ్వర స్వామికి, బుధవారం గణపతి, అయ్యప్ప స్వామి, గురువారం సాయిబాబా, దత్తాత్రేయుడు, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామి అని ఇలా.. ఒక్కో రోజు ఒక్కోస్వామికి ప్రత్యేకం కేటాయించి మరి చెప్పారు. అయితే వెంకటేశ్వర స్వామికి మాత్రం శనివారం అంటేనే ఎందకంత ప్రత్యేకం అంటే.. శనివారమే శ్రీవారిని పూజించటానికి గల కారణం.. ఓంకారం ప్రభవించిన రోజు శనివారం శనివారం శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటి సారి దర్శించిన రోజు శనివారం ఆలయం నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది, పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారమే ఇక వేంకటేశ్వర స్వామి సుదర్శనం పుట్టినది కూడా శనివారమే అందుకే ఏడుకొండలవాడికి శనివారం అంటే అత్యంత ప్రీతికరం. వెంకటేశ్వర స్వామికి కూడా శనివారం ప్రత్యేకం కావడంతో ..భక్తులు ఆ రోజు దేవుడికి పూజలు, మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే కలౌ వేంకట నాయకః అన్న నానుడి ప్రకారం..కలియుగంలో అత్యంత శక్తిమంతమైన దైవం శ్రీనివాసుడు. అందువల్ల భక్తులు తమకు ఎదురయ్యే కష్టాలు, సమస్యల నుంచి గట్టెక్కించి బయటపడేశావాడు ఆయనే అని విశ్వసిస్తారు. ఈ శనివారం రోజు వాడవాడల ఉన్న శ్రీనివాసుని ఆలయాలన్ని కిటకిటలాడుతుంటాయి. మాములు రోజుల కంటే శనివారం ఆయన్ను పూజిస్తే శనిశ్వరుడు పెట్టే బాధల నుంచి విముక్తి లభిస్తుంది. పైగా అనుకున్న పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా శ్రీనివాసుడు తమను అనుగ్రహిస్తాడనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. (చదవండి: గాంధారి వాన ఏమిటి?..అసలు దృతరాష్ట్రుని భార్యకు.. వానకు సంబంధం ఏమిటి) -
ఢిల్లీలో వెంకన్న దర్శన భాగ్యం
* శ్రీవేంకటేశ్వర వైభవోత్సవానికి హాజరుకానున్న ప్రధాని * నేడు అంకురార్పణ.. హాజరుకానున్న బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ సాక్షి, న్యూఢిల్లీ: కలియుగదైవం శ్రీవెంకటేశ్వర వైభవోత్సవానికి శుక్రవారం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అంకురార్పణ జరుగనుంది. శుక్రవారం ఉదయం అంకురార్పణతో ప్రారంభమై నవంబర్ 8న జరిగే పుష్పయాగంతో వైభవోత్సవం ముగియనుందని నిర్వాహకులు టీటీడీ, స్వర్ణభారత్ ట్రస్ట్, జీఎంఆర్ ప్రతినిధులు వెల్లడించారు. ఢిల్లీలో గురువారం విలేకరులతో నిర్వాహకులు దీపా వెంకట్, బి.వి.ఎన్.రావు, విష్ణువర్థన్‌రెడ్డి మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్ట, అంకురార్పణ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ పాల్గొననున్నారని, సాయంత్రం చాగంటి కోటేశ్వరరావు ధార్మిక ప్రవచనాలు ఉంటాయన్నారు. శనివారం నుంచి శ్రీవారి సేవ లు ప్రారంభంకానున్నాయని చెప్పారు. వైభవోత్సవానికి ప్రధాని మోదీ హాజరుకానున్నట్టు తెలిపారు. కేంద్ర మంత్రులు మనోహర్ పారికర్, స్మృతీ ఇరానీ, సురేష్ ప్రభు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరుకానున్నారు. 7న జరగనున్న శ్రీనివాస కల్యాణంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు. ప్రతి రోజు సుప్రభాతం, తోమాల సేవ, కొలువు, అర్చన, నివేదన, శాత్తుమొర, విశేష పూజ, సర్వదర్శనం, సహస్ర దీపాలంకరణ, వీధోత్సవం, రాత్రి కైంకర్యం, ఏకాంత సేవలు ఉంటాయన్నారు. విశేష పూజగా సుదర్శన హోమం, వసంతోత్స వం, అష్టాదళ పాదపద్మారాధన, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ, అభిషేకం, శ్రీనివాస కల్యాణం, పుష్పయాగం ఉంటుందని వెల్లడించారు.