గాల్లో తేలినట్టుందే పాటలు
‘‘మా సంస్థలో ఇది మూడో చిత్రం. యువతను ఆకట్టుకునే అంశాలతో పాటు చక్కని సందేశం ఉంటుంది’’ అని సీహెచ్ వంశీకృష్ణ చెప్పారు. ఆయన చొక్కాకుల వెంకట్రావుతో కలిసి వెంకట సురేష్ గుణ్ణం దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘గాల్లో తేలినట్టుందే’. అజయ్వర్మ, కౌసల్య, మోనీషా ఇందులో హీరో హీరోయిన్లు. ఈ సినిమా ప్రచార చిత్రాలను, పాటల సీడీని దర్శకుడు తేజ ఆవిష్కరించారు. సాయికార్తీక్ మంచి సంగీతం అందిం చారని, కథ కూడా వినకుండా నిర్మాతలు తనను నమ్మి ఈ సినిమా అవకాశమిచ్చారని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయికార్తీక్, వందేమాతరం శ్రీనివాస్, కృష్ణచైతన్య, సందీప్ కిషన్, శాన్వి, మనోజ్ నందం, భాస్కర్ విల్లూరి, సీలం లక్ష్మణ్, సాయిశ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.