బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య
ఘట్కేసర్ (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాద్రి టౌన్షిప్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నల్లకుంట శాఖ మేనేజర్ శ్రీనివాసాచారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆయన తన ఫ్లాట్లోని రూంలో ఉరివేసుకున్నాడు.
మధ్యాహ్నం అయినా ఆయన తలుపులు తీయకపోయేసరికి అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి చూశారు. అప్పటికే ఆయన ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులే ఆయన బలవ్మనరణానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు సంఘటనస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.