సత్యదేవుని సన్నిధిలో ఉప లోకాయుక్త
అన్నవరం :
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉప లోకాయుక్త టి.గంగిరెడ్డి కుటుంబ సమేతంగా శనివారం రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి దర్శనానంతరం వేద పండితులు ఆశీస్సులందించి, స్వామివారి ప్రసాదాలను బహూకరించారు. ప్రత్తిపాడు సీఐ సత్యనారాయణ, ఎస్సై పార్థసారథి తదితరులు వారి వెంట ఉన్నారు.