షార్ట్‌సర్క్యూట్ - నాలుగు ఇళ్లు దగ్ధం
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణ శివారులోని ఈదరపల్లిలో శనివారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో నాలుగు ఇళ్లు దగ్ధమయ్యాయి. బండి సత్యనారాయణ, బండారు సుబ్బారావు, మాసగిరి కుమారి, కళింగరాజు విశ్వనాథంకు చెందిన ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. యితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మంటలు చెలరేగిన వెంటనే ఇళ్లలో నిద్రిస్తున్న వారంద రూ సురక్షితంగా బయటికి వచ్చారు. ఇళ్లలో ఉన్న వస్తువులు, తిండిగింజలు, దుస్తులు అన్నీ కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అమలాపురం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. సర్వం కోస్పోయిన తమను ప్రభుత్వం తమను ఆదికోవాలని బాధితులు కోరుతున్నారు.