వోగ్ మ్యాగజైన్ పై కరీనా హల్ చల్!
వోగ్ ఇండియా మార్చి సంచికపై బాలీవుడ్ తార కరీనా కపూర్ ఖాన్ హడావిడి చేస్తోంది. వోగ్ ముఖచిత్రంపై ఎరుపు రంగు దుస్తుల్లో కరీనా పువ్వుల రాణిగా దర్శనమిచ్చింది.
తుక్రల్ అండ్ తగ్రా భాగస్వామ్యంతో వెలువడిన ప్రత్యేక సంచిక కోసం ఫోటో షూట్ నిర్వహించారు. ఈ ఫోటో షూట్ లో కరీనా హాట్ హాట్ ఫోజులతో అభిమానులను ఆలరించింది.
బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ తో పెళ్లి తర్వాత కూడా కెరీర్ గ్రాఫ్ కు ఎలాంటి ఢోకా లేదని వోగ్ ఇండియా సంచికపై కరీనా ముఖ చిత్రంగా రావడంతో ప్రూవ్ అయింది.
వోగ్ ఇండియా ముఖ చిత్రంపై ఫోటో కోసం దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, అనుష్క శర్మలు వేచి చూస్తున్నారు.
Photo Courtesy: Vogue India