ఉద్యోగ సమాచారం
వ్యాప్కోస్లో ఇంజనీర్లు
హైదరాబాద్‌లోని వ్యాప్కోస్ లిమిటెడ్.. సీనియర్ ఇంజనీర్ (ఖాళీలు-2), ఇంజనీర్(ఖాళీలు -2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 28. వివరాలకు www.wapcos.gov.inచూడొచ్చు.
ఐసీఏఆర్ అనుబంధ సంస్థలో ఇంటర్వ్యూలు
హైదరాబాద్‌లోని ఐసీఏఆర్ అనుబంధ సంస్థ అగ్రిక ల్చరల్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ ఇన్స్టిట్యూట్ (ఏటీఏఆర్ఐ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ రీసెర్చ ఫెలో (ఖాళీలు-2), డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఖాళీలు-2) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఇంటర్వ్యూ తేదీ నవంబర్ 28. వివరాలకు www.zpd5hyd.nic.inచూడొచ్చు.
ఢిల్లీ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ
ఢిల్లీ వర్సిటీకి చెందిన ఫ్యాకల్టీ ఆఫ్ లా.. అసిస్టెంట్ ప్రొఫెసర్, గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 81. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 3. వివరాలకు www.du.ac.in/duచూడొచ్చు.
పశ్చిమ బెంగాల్లో లెక్చరర్లు
పశ్చిమ బెంగాల్‌లోని సాంకేతిక విద్య, శిక్షణ విభాగం.. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో కాంట్రాక్ట్ ప్రాతిపదికనలెక్చరర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 146. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 14. వివరాలకు www.webscte.orgచూడొచ్చు.
చెన్నై పోర్ట ట్రస్ట్‌లో వివిధ పోస్టులు
చెన్నై పోర్ట ట్రస్ట్.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 14 (టగ్ మాస్టర్-7, పైలట్-4, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్-1, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్-1, చీఫ్ మెడికల్ ఆఫీసర్-1). వివరాలకు www.chennaiport.gov.inచూడొచ్చు.
సీడీఆర్ఐలో అసిస్టెంట్లు
సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ ఇన్స్టిట్యూట్ (సీడీఆర్ఐ).. వికలాంగుల కోటాలో వివిధ విభాగాల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 5. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 21. వివరాలకు www.cdriindia.orgచూడొచ్చు.
బెనారస్ వర్సిటీ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిధిలోని వసంతా కాలేజ్ ఫర్ ఉమెన్.. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మ్తొతం ఖాళీలు 6. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 13. వివరాలకు www.vasantakfi.comచూడొచ్చు.
‘వివేకానంద ఇన్స్టిట్యూట్’లో వివిధ పోస్టులు
స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ.. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 16. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 15. వివరాలకు www.svnirtar.nic.inచూడొచ్చు.
25న ‘మనూ’ క్యాంపస్‌లో జాబ్ ఫెయిర్
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలీలో ఉన్న మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం(మనూ)లో ఈనెల 25వ తేదీన ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్/ జాబ్ ఫెయిర్‌ను నిర్వహిస్తామని మనూ స్కూల్ ఆఫ్ సీఎస్ అండ్ ఐటీ స్కూల్ డీన్ ప్రొఫెసర్ అబ్దుల్ వాహెద్ శుక్రవారం తెలిపారు. మనూ ప్లేస్మెంట్ అండ్ కెరియర్ గెడైన్స్ సెల్, స్కూల్ ఆఫ్ సీఎస్ అండ్ ఐటీ, పాత్వే హ్యూమన్ రీసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ ఫెయిర్‌లో పాల్గొనదలచిన విద్యార్థులు 23వ తేదీ లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
ఈ జాబ్ ఫెయిర్‌లో ఐటీ, బీపీఓ, హెచ్ఆర్, ఫార్మసీ, కామర్స్, ఐటీఐ, డిప్లొమో కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తారన్నారు. 2015, 2016లో ఎంసీఏ, ఎంఎస్సీ, బీటెక్, సీఎస్ అండ్ ఐటీ, ఎంబీఏ, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇతర డిగ్రీలు పూర్తి చేసిన వారే అర్హులన్నారు. ఎంసీఏ, బీటెక్ పూర్తి చేసిన వారు బొంత కోటయ్య(9666995969), మహ్మద్ ఒమర్ (9160407677)ను సంప్రదించాలి, ఎంబీఏ, ఎంకామ్ విద్యార్థులు కమరుద్ధీన్( 7207973873), రసీద్ ఫారూఖీ(9700911532)ను సంప్రదించాలి. పాలిటెక్నిక్, ఇతర డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన వారు ఫసియుద్ధీన్(9703131787)ను సంప్రదించాలి. ఇతర మనూయేతర విద్యార్థులు సునీల్(8121366633/11/22)ను సంప్రదించాలి.