'ప్రజాస్వామ్య మనుగడలో ఓటు హక్కే కీలకం'
కరీమాబాద్(వరంగల్): ఓటు హక్కు వినియోగం అనేది ప్రజాస్వామ్య మనుగడలో చాలా కీలకమని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని ఆకారపు శరత్ చంద్రిక మెమోరియల్ డిగ్రీ,అండ్ పీజీ కాలేజీలో జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సురేఖ ప్రసంగించారు. ఎవరి ప్రలోభాలకు లొంగకుండా అందరూ ఓటు హక్కును సరైన విధంగా వినియోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
నగరంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, మండల ప్రభుత్వ అధికారులు కలిసి ఓటు హక్కుపై ప్రజల్ని చైతన్యపరిచేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.రవి, కళాశాల ప్రిన్సిపాల్ స్వరూప పాల్గొన్నారు.