ప్రజాభీష్టం మేరకే విభజించాలి
నేటి జిల్లా బంద్‌కు సంపూర్ణ మద్దతు
తెలంగాణ జెఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
వరంగల్ : రాష్ట్రంలో జిల్లాల విభజన ప్రజాభీ ష్టం మేరకే జరగాలని, అసలు ఏ ప్రాతిపదకన జిల్లాల విభజన చేపట్టారో అర్థం కావడం లేదని తెలంగాణ జెఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వరంగల్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హరిత కాకతీయ హోటల్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మా ట్లాడారు. అస్థిత్వం కోల్పొయేలా జిల్లాల విభజ న జరిగితే చరిత్రకు అర్థం ఉండదన్నారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలకు ఎంతో విశిష్టత ఉందని, వాటిని వీడిదీయాలనుకోవ డం చారిత్రక తప్పిదమేనని అన్నారు. ప్రజ లు తమ ఫిర్యాదులు తెలిపేందుకు టోల్ ఫ్రీ నంబ ర్తో ఫోన్ సౌకర్యం కల్పించాలని సూచిం చా రు. మంగళవారం జేఏసీ చేపట్టిన జిల్లా బం ద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపా రు. బీజేపీ రాష్ట్ర ఉపా««దl్యక్షుడు మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ రెండున్నరేళ్లుగా తుగ్లక్ పా లన అనుభవించామని అన్నారు. హైదరాబాద్ కు 400 ఏళ్ల చరిత్ర ఉంటే వరంగల్‌కు 1000 ఏళ్ల చరిత్ర ఉందని, వరంగల్–హన్మకొండను విభజించవద్దని అన్ని పార్టీలు కలసి కలెక్టర్‌కు లేఖ ఇస్తామని చెప్పారు. బంద్‌లో పాల్గొనవద్దని టీఆర్ఎస్ నేతలు విద్యా, వాణిజ్య సంస్థలకు ఫో న్లు చేస్తూ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నార ని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. ఎవరికీ భయపడకుండా బంద్ లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసమే జిల్లాల విభజన చేపట్టారని అన్నారు. తెలంగా ణ రాష్ట్రం వస్తే బంద్‌లు ఉండవన్న పెద్ద మనిషి వల్లే నేడు మళ్లీ బంద్‌లు చేసే దుస్థితి నెలకొందన్నారు. బంద్ విజయవంతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ టీఆర్ఎస్లో వర్గాలుగా ఏర్పడి హన్మకొండ వద్దని కొందరు, కావాలని కొందరు అనడం వల్లే గందరగోళంగా మారిందన్నారు. ప్రజలు కోరిన జనగామ జిల్లాను ఏర్పాటు చేసి, వద్దంటున్న హన్మకొండ జిల్లా ఏర్పాటును విరమించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బైరపాక జయకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జనగామ జిల్లా సాధన క మిటీ కన్వీనర్ ఆరుట్ల దశమంతరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు అప్పం కిషన్, అమరేందర్‌రెడ్డి, పలు సంఘాల నాయకులు సహోదర్‌రెడ్డి, ఈసంపెల్లి వేణు, గంధం శివ, వేణుగోపాల్‌గౌడ్, తిరునహరి శేషు, ప్రొఫెసర్ వెంకటనారాయణ, డా.విజయలక్ష్మి, ఆర్టీసీ కార్మిక సంఘం నేత వెంకన్న, చంద్రమౌళి పాల్గొన్నారు.
జనగామ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది : కోదండరాం
జనగామ : రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో ఆ ప్రాంత భౌగోళిక స్థితిగతులు, చరిత్ర, సంస్కృతి, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజాభీష్టం మేరకే తుది నిర్ణ యం తీసుకోవాలని పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జనగామ జిల్లా రిలే దీక్షలను సోమవారం ఆయన సందర్శించి, మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో పరిపాలన అందించేందుకు 1984లోనే చిన్న జిల్లాల ఏర్పాటుకు నియమావళి రూపొందించారన్నారు. ఆ ప్రాతిపదికన జిల్లాలను ఏర్పాటు చేయాలన్నారు. నల్లగొండ జిల్లాలో ఉన్న జనగామ, ఆ త ర్వాత వరంగల్‌లో కలిసిందని, ఆర్థిక, రాజకీ య, సాంస్కృతిక రంగాల్లో నిజాం కాలం నుం చి 60 గ్రామాలకు కేంద్ర బిందువుగా నిలిచిందని వివరించారు. జనగామ జిల్లా ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు. ఆదివాసీలు నివసించే ప్రాంతాలను ఒకే జిల్లాలో ఉంచే లా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా ఉద్యమ కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. ఆయన వెంట జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, నాయకులు కన్నా పర్శరాములు, పి.లింగయ్య, వేణుగోపాల్‌రావు, రాజు, సురేష్, మాజీద్ ఉన్నారు.