కట్నం కార్చిచ్చుకు.. తల్లీకూతురు బలి
పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన ఆ యువతికి రెండేళ్లకే కష్టాలు మొదలయ్యాయి. కట్నం కోసం భర్తపెట్టే చిత్రహింసలు తట్టుకోలేక పోయింది.. ఒంటిమీది ఆభరణాలను అమ్ముకున్నా ఓర్చుకుంది.. కడుపున పుట్టిన చిన్నారిని చూసుకుని బాధలను దిగమింగుకుంది.. ఇకనైనా మారతాడేమో అన్న చిన్న ఆశ కూడా ఆవిరైపోయింది.. ఇక తాను లేని లోకంలో కూతురు ఎన్ని కష్టాలు పడుతుందో అని.. మదనపడింది. చివరకు తనతో పాటే తీసుకెళ్లాలని నిర్ణయించుకుని.. ఆరునెలల చిన్నారిని నీటిసంపులో వేసి..తాను అగ్నికి ఆహుతైంది.
* కూతురిని నీటిసంపులో పడేసి..తాను అగ్నికి ఆహుతై..
* భువనగిరి మండలంలో విషాదం
భువనగిరి: కట్నం కార్చిచ్చుకు..తల్లీకూతురు బలయ్యారు. ఈ విషాదకర ఘటన భువనగిరి మండలం గౌస్‌నగర్‌లో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్ర కారం.. భువనగిరి మండలం గౌస్‌నగర్‌కు చెందిన నల్లమాస వెంకటయ్య, లింగమ్మల కుమారుడు నల్లమాస భాస్కర్‌కు చౌటుప్పల్ మండలం తంగెడపల్లికి చెందిన చిక్కురి యాదగిరిస్వరూపల కుమార్తె మమత(22) తో 2014 ఏప్రిల్ 20న వివాహం జరిగింది.
పెళ్లి సమయంలో ఒప్పుకున్న రూ.7.70 లక్షల వరకట్నంలో రూ.7.10 లక్షల వరకు నగదు,అభరణాలు, ఇతర వస్తువులను ము ట్టచెప్పారు. అయితే రెండున్నర సంవత్సరా లు అవుతున్నా కట్నం పూర్తిగా ఇవ్వలేదని ఆ డబ్బులు తేవాలని భాస్కర్ మమతను వే ధించసాగాడు. దీంతో పాటు భాస్కర్ కొంతకాలంగా పనిలేకుండా ఉన్నాడు. జేసీబీ ఆపరేటర్ అయిన భాస్కర్ ఏజీఐ గ్లాస్ఫ్యాక్టరీలో పనిచేస్తూ మానేశాడు.
కొన్నినెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు. దీం తోపాటు మమతకు చెందిన బంగారు అభరణాలను తాకట్టు పెట్టాడు. అలాగే మమతకు చెందిన బుట్టాలు అమ్మినట్లు తెలియడంతో దంపతుల మధ్య గొడవలు మొదల య్యాయి. ఈ నేపథ్యంలో బాకి ఉన్న మిగతా కట్నం డబ్బు తీసుకురావాలని మమతను వేధించసాగారు. బంగారం అమ్మిన విషయం మమత తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మాట్లాడడానికి వస్తామన్నారు. ఈ విషయంలోనే శనివారం రాత్రి దంపతులు గొడవ పడ్డారు.
అందరూ నిద్రిస్తుండగా..
అందరు నిద్రిస్తున్న సమయంలో మమత తన కూతురు భానును నీళ్లసంపులో వేసింది. దీంతో చిన్నారి ఊపిరాడక చనిపోయింది. వెంటనే మరుగుదొడ్డిలోకి వెళ్లి కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు లేవడంతో ఇంట్లో నిద్రిస్తున్న వారు మేలుకుని బయటకు వచ్చారు.
అప్పటికే మమత తలభాగం నుంచి మంటలు పెద్దగా లేవడంతో పందిరికూడా అంటుకుంది. చల్లార్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె మంటల్లో కాలి చనిపోయింది. అనంతరం పాప కోసం వెతకగా సంపులో శవమై కన్పించింది. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ అర్జునయ్య, ఎస్ఐ సాజిదుల్లాలు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ నిర్వహించారు. మమత తండ్రి యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
పరారీలో భర్త భాస్కర్
ఈ సంఘటన జరిగిన వెంటనే మమత భర్త భాస్కర్ కన్పించకుండాపోయాడు.పోలీస్‌లు గ్రామానికి వచ్చి గట్టి బందోబస్తూ ఏర్పాటు చేశారు.సంఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించారు. గ్రామస్తులను విచారించారు.
నా కూతురును వేధించి చంపారు
కట్నం కోసం తన కూతురుని వేధించడం వల్లే చనిపోయింది. పెళ్లి సమయంలో ఒప్పుకున్న కట్నం డబ్బులు ఇచ్చాను. కొంత ఇవ్వాల్సి ఉంటే త్వరలో ఇస్తానని చెప్పాను. అయినా వినకుండా నా కూతురిని చిత్రహింసలు పెట్టడంతో తన కూతురును చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.
- చిక్కురి యాదగిరి మమత తండ్రి
వేధింపుల వల్లే
అత్తింటి వేధింపుల వల్లే మమత ఈ ఘాతుకానికి పాల్పడింది. కట్నం డబ్బుల కోసం భర్తభాస్కర్ తరుచు వేధించే వాడని తమ విచారణలో తేలింది. ఇందుకు సంబంధించి మృతురాలి తండ్రి ఫిర్యాదు చేశాడు. వేధింపుల కేసు నమోదు చేశాం.
- అర్జునయ్య, భువనగిరి రూరల్‌సీఐ