సల్మాన్ సోదరి వివాహ విందులో ఘుమ ఘమలు!
హైదరాబాద్: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత వివాహ ఏర్పాట్లు నగరంలోని ఫలక్ నామా హోటల్ లో ఊపందుకున్నాయి. వివాహంలో పాల్గొనే అతిధులకు ఘుమఘమలాడే వంటకాలను వడ్డించేందుకు 'హైదరాబాద్ బిర్యానీ', 'హలీమ్', 'పత్తర్ కా ఘోష్' లాంటి పత్యేక వంటకాలు వడ్డించడానికి అంతా సిద్దమైంది.
బాలీవుడ్ ఇతర చిత్రరంగ ప్రముఖులు, వ్యాపార, రాజకీయ వేత్తల కోసం నవంబర్ 18, 19 తేదిల కోసం హోటల్ మొత్తం బుక్ చేశారు. హోటల్ వద్ద ఇప్పటికే బారికేడ్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అతిధులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏర్పాట్లు ఇప్పటికే చేశారు. 18న జరిగే ప్రధాన విందు కోసం అన్ని వంటకాలను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
ఆయుష్ శర్మతో జరిగే వివాహ కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను ఏర్పాటు చేయాల్సిందిగా సౌత్ జోన్ డిప్యూటీ కమిషనర్ వి సత్యనారాయణకు ఇప్పటికే ఆదేశాలు అందాయి.