వేలానికి మైకేల్ జాక్సన్ గ్లోవ్
లాస్ఏంజెలెస్: ప్రపంచ ప్రఖ్యాత, దివంగత పాప్ స్టార్ మైకేల్ జాక్సన్ ఉపయోగించిన తెల్లటి గ్లోవ్ ను వేలంలో పెట్టారు. జాక్సన్ జ్క్షాపకార్థ సూచికగా నేట్ శాండర్స్ ఆధ్వర్యంలో దీన్ని వేలం వేయనున్నారు. దీనికి కనీసం రూ. 13 లక్షల వరకు రేటు పలుకుతుందని అంచనా. దాంతోపాటు జాక్సన్ 'బ్యాడ్' అల్బమ్ కవర్‌పేజీపై బ్లాక్ లెదర్ జాకెట్‌తో ధరించి ఉన్న నమూనా కూడా ఈ వేలంలో ఉంచినట్టు ది గార్డియన్ నివేదికలో వెల్లడించింది.
ఇటీవల వేలంలో అమ్మిన జాక్సన్ గ్లోవ్స్ కంటే ఇప్పుడు వేలంలో ఉంచిన తెల్లటి గ్లోవ్ ధర చాలా తక్కువని పేర్కొంది. 2009లో జాక్సన్ మరణాంతరం 'మూన్‌వాక్' గ్లోవ్స్ ను దాదాపు రూ. 22 లక్షలకు వేలం వేశారు. ఆయన మరణించిన 6 నెలల తరువాత జూన్ 2010లో మరో జత గ్లోవ్స్ కు కోటి రూపాయలకు పైగా ధర పలికింది. కానీ, జాక్సన్ తన కుడిచేతి గ్లోవ్ ను స్నేహితుడు, చిత్రకారుడు పాల్ బెడ్రాడ్కు ఇచ్చినట్టు పేర్కొంది.