కొత్త జిల్లాల ఏర్పాటుతో మారేనా?
ప్రభుత్వం దసరా నుంచి కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్న తరుణంలో పోలీస్‌స్టేçÙన్లను ఒకే సర్కిల్, ఒకే సబ్ డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చే విధంగా పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. లేనిఎడల తాము పాలనా పరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటు అనంతరం ఇదేవిధంగా ఉంటే మిడ్జిల్ మండల ప్రజలు ఆయా ఠాణాల సమస్యలపై నాగర్‌కర్నూల్ జిల్లాపై ఆధారపడాల్సి వస్తుందని, అదేవిధంగా బాలానగర్ మండల ప్రజలు శంషాబాద్ జిల్లా అధికారులపై ఆధారపడాల్సి వస్తుందని వారు పేర్కొంటున్నారు. కల్వకుర్తికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిడ్జిల్ మండలం ఇప్పపహడ్, తదితర గ్రామాల ప్రజలు డీఎస్పీని కలవాలంటే దాదాపు 90కిమీల దూరంలో షాద్‌నగర్‌కు వెళ్లే పరిస్థితి ఉంది. అదేవిదంగా జడ్చర్లకు 10కిమీల దూరంలో ఉన్న మిడ్జిల్ మండలం బైరంపల్లి, తదితర గ్రామాల ప్రజలు సీఐని కలవాలంటే 40 కిమీల దూరంలోని కల్వకుర్తికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇలా అన్ని మండలాల్లోని ఆయా గ్రామాల ప్రజలకు పోలీస్ సేవలు దూరంగా ఉన్నాయి. ఆయా సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులు భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నియోజకవర్గంలోని అన్ని పోలీస్‌స్టేçÙన్లను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.