నోటు కావాలంటే.. కోరిక తీర్చాలట
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన కాల్‌మనీ బాగోతంలో మరో ఉదంతం వెలుగుచూసింది. విజయవాడలో ఓ మహిళ అప్పుతీర్చినా.. ప్రాంసరీ నోటు ఇవ్వకుండా వ్యాపారి వేధిస్తున్నాడు. నోటు కావాలంటే తన కోరిక తీర్చాలంటూ ఆమెను బెదిరించాడు.
బాధితురాలు పిల్లల చదువు కోసం 50 వేల రూపాయలను అప్పుగా తీసుకుంది. డబ్బు తీసుకున్న సమయంలో వ్యాపారికి ప్రాంసరీ నోటు రాసి ఇచ్చింది. ఆ తర్వాత ఆమె అప్పు మొత్తం తీర్చేసింది. అయితే ప్రాంసరీ నోటు ఆమెకు ఇవ్వకుండా వ్యాపారి వేధింపులకు దిగాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా నిందితుడి కుటుంబ సభ్యులు నుంచి బాధితురాలికి బెదిరింపులు వస్తున్నాయి.