గోవాడ సుగర్స్‌లో ఉద్రిక్తత
=స్ప్రేపాండ్లో కాంట్రాక్టు కార్మికుని మృతదేహం
=బంధువులు, కార్మికులు ఆందోళన
చోడవరం, న్యూస్‌లైన్ : గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు కార్మికుడు అనుమానాస్పద మృతి ఉద్రిక్తతకు దారి తీసింది. అంబేరుపురానికి చెందిన మద్దిల కామరాజు (29) కొంతకాలంగా పనిచేస్తున్నాడు. గొడౌన్లో పంచదార బస్తాలను లోడ్ చేస్తుంటాడు. శనివారం మధ్యాహ్నం బి-షిఫ్ట్‌కు కామరాజు విధులకు వచ్చాడు. డ్యూటీ ముగిసినా రాత్రికి ఇంటికి చేరలేదు. ఎక్కడికో వెళ్లి ఉంటారని కుటుంబ సభ్యులు భావించారు. ఇంతలో ఆదివారం సాయంత్రం స్ప్రే పాండ్‌లో ఒక మృతదేహం ఉన్నట్టు కార్మికులు గుర్తించా రు.
కాసేపటికి విధుల్లో లేని కార్మికుల గురించి ఆరా తీయగా కామరాజుగా తేల్చారు. వెంటనే ఆయన సోదరుడు గోపాలకృష్ణను రప్పించడంతో తన తమ్ముడేనని నిర్ధారించి ఘొల్లుమన్నా రు. కాగా కామరాజు మృతి మిస్టరీగా మారింది. గొడౌన్లో పనిచేసే కార్మికుడు ఫ్యాక్టరీ చివరిలో ఉన్న స్ప్రే పాండ్ దగ్గరికి ఎందుకు వెళ్లాడన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ప్రమాదవశాత్తు పడిపోయాడా లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతునికి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య కొంత కాలంగా ఇతనికి దూరంగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తల్లి మాత్రం కామరాజు దగ్గరే ఉంటోం ది.
అందరితో కలివిడిగా ఉండే కామరాజు వేడినీటి కుండీలో శవమై తేలడంతో అందరినీ విషాదంలో ముంచెత్తింది. విషయం తెలుసుకున్న ఫ్యాక్టరీ ఎమ్డీ వి. వెంకటరమణారావు, చైర్మన్ మల్లునాయుడు, చోడవరం సీఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు వేడి నీటిలో ఉన్న మృతదేహాన్ని బయటికి తీయడానికి బాగా శ్రమించాల్సి వచ్చింది. యాజమాన్యం, కాంట్రాక్టరు నిర్లక్ష్యం వల్లే కామరాజు మృతి చెందాడని కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ నాయకులు, కుటుంబ సభ్యులు ధ్వజమెత్తారు. రాత్రి 7 30 గంటల సమయంలో తీసినప్పటికీ నష్టపరిహారం ఇచ్చే వరకు శవాన్ని తీసుకెళ్లమని బంధువులు ఆందోళనకు దిగారు.
విధుల్లోకి వెళ్లిన కార్మికులు, విధులు అనంతరం బయటికి వచ్చింది లేనిది, తర్వాత డ్యూటీలో ఎవరు వచ్చారన్నది నమోదుచేయాల్సి ఉంది. కాని ఈ తరహా పరిశీలన లేకపోవడం వల్లే రాత్రి డ్యూటీ దిగాల్సిన కార్మికుడు మరుసటి రోజైనా ఏమయ్యాడో తెలియని పరిస్థితి నెలకొందని యూనియన్ అధ్యక్షుడు బండారు శ్రీనువాసరావు, బంధువులు ఆరోపించారు.