విజేత ప్రాంజల
డబ్ల్యూటీఏ ఫ్యూచర్ స్టార్స్ టోర్నీ
సింగపూర్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఫ్యూచర్ స్టార్స్ సీజన్ ముగింపు టోర్నమెంట్లో భారత క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల చాంపియన్‌గా అవతరించింది. సోమవారం జరిగిన అండర్-16 బాలికల సింగిల్స్ ఫైనల్లో ఈ హైదరాబాద్ అమ్మాయి 6-2, 6-0తో యున్ హై రన్ (దక్షిణ కొరియా)పై అలవోక విజయం సాధించింది. 44 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ మాజీ చాంపియన్, చైనా స్టార్ లీ నా... ప్రాంజలకు ట్రోఫీని అందజేసింది.