మా నేతలపై కేసులు బనాయిస్తున్నారు: వైఎస్సార్సీపీ
ఏపీ డీజీపీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎస్ఐ దురుసు ప్రవర్తన కారణంగా తమ పార్టీకి చెందిన సహకార సంఘ అధ్యక్షుడు మరణించిన తరువాత కూడా తమ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం జరుగుతోందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడును కలసి సంఘటన వాస్తవాలను వివరించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలుచోట్ల తమ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. గిద్దలూరులో గత నెల 30వ తేదీన సహకార సంఘ అధ్యక్షుడు వై. భాస్కరరెడ్డి మృతికి కారణమైన ఎస్ఐని వెంటనే సస్సెండ్ చేసి ఆరెస్టు చేయాలని డీజీపీని కోరారు.