యమహా నుంచి ఫ్యాసినో స్కూటర్
ముంబై: ‘ఫ్యాసినో’ పేరుతో కొత్త స్కూటర్‌ను యమహా మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.52,500 (ఢిల్లీ ఎక్స్ షోరూం). ఎయిర్ కూల్, 4-స్ట్రోక్ 113 సీసీ ఇంజిన్ వంటి ప్రత్యేకతలు దీని సొంతం. ఐదు రంగుల్లో లభ్యమవుతున్న ఈ స్కూటర్ లీటర్‌కు 66 కిలోమీటర్ల మైలేజ్ ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. యువత లక్ష్యంగా, వారిని ఆకర్షించడానికి ఈ సరికొత్త హంగులతో స్కూటర్‌ను మార్కెట్లోకి తెచ్చామని ఈ సందర్భంగా యమహా మోటార్ ఇండి యా మేనేజింగ్ డెరైక్టర్ మసకి అసనో అన్నారు.