బ్రెయిలీలో యోగా పుస్తకం ఆవిష్కరణ
న్యూఢిల్లీ: బ్రెయిలీ లిపిలో ప్రచురించిన 'యోగి కా స్పర్శ్' అనే పుస్తకాన్ని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి కుమార్తె, స్వయంగా యోగా టీచరైన నివేదితా జోషి ఈ పుస్తకాన్ని రాశారు. పుస్తకావిష్కరణ అనంతరం మాట్లాడిన ప్రణబ్.. మనిషి శారీరక, మానసిక, నైతిక వికాసానికి యెగా చక్కటి పరిష్కారమని పేర్కొన్నారు. యోగా గొప్పతనాన్ని ఆధునిక వైద్యశాస్త్రం కూడా అంగీకరిస్తోందన్నారు.
కాగా అంధులకు కూడా యెగాను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతోనే పుస్తకాన్ని తీసుకొచ్చినట్టు నివేదితా జోషి తెలిపారు. దాదాపు 19 ఏళ్ల క్రితం పూర్తిగా అనారోగ్యం పాలైన తాను యోగా వల్ల పూర్తిగా కోలుకున్నానని ఆమె అన్నారు. ఇక అప్పటినుంచి తన జీవితాన్ని పూర్తిగా యోగాకు అంకిత చేశానని జోషి పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభకు నివేదిత తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు.