1. దోచుకుని పంచుకు తినే(డీపీటీ) ప్రభుత్వం కావాలా? సంక్షేమ(డీబీటీ) ప్రభుత్వం కావాలా?: సీఎం జగన్
డీబీటీ అంటే.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్. డీబీటీ ద్వారా అవినీతికి తావులేకుండా నేరుగా సంక్షేమ పథకాల నిధుల్ని.. లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. వైఎస్సార్ కాపు నేస్తం మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా కాకినాడ గొల్లప్రోలు సభ నుంచి లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2. దేశంలోనే అత్యంత పిరికి సన్నాసి.. ఎవరో చెప్పిన కొడాలి నాని
దేశంలోనే అత్యంత పిరికి సన్నాసి చంద్రబాబు అంటూ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన గుడివాడ 12వ వార్డులో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3. హైదరాబాద్‌లో కుండపోత వాన.. లోతట్టు ప్రాంతాలు మునక.. ఫోటోలు, వీడియోలు
జంటనగరాల్లో శుక్రవారం సాయంత్రం కుండపోతగా వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, మణికొండ, షేక్‌పేట, టోలీచౌకి, రాయదుర్గం, గచ్చిబౌలిలో భారీగా వానలు కురిసాయి. ఇక సికింద్రాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు, బస్తీలు నీట మునిగాయి.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4. తెలంగాణలో అవినీతి తారాస్థాయికి చేరింది.. కేంద్రమంత్రి సింధియా సంచలన ఆరోపణలు
తెలంగాణ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు కేంద్రమంద్రి జ్యోతిరాదిత్య సింధియా. రాష్ట్రం తిరోగమనంలో ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను కేసీఆర్ సర్కార్ సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శించారు. బీజేపీ హయాంలోనే తెలంగాణకు అధిక నిధులు కేటాయించినట్లు చెప్పారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5. రిషి సునాక్‌కు ఇబ్బందికర ప్రశ్నలు.. ఎందుకు వెన్నుపోటు పొడిచారని అడిగిన టోరీ సభ్యులు
బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న రిషి సునాక్, లిజ్ ట్రస్ తొలిసారి కన్జర్వేటివ్ పార్టీ సభ్యులతో నేరుగా సమావేశమయ్యారు. ఎప్పటిలాగే ఆర్థికవ్యవస్థ, జీవన వ్యయం వంటి అంశాలపైనే ఇద్దరు తమ విధానాల గురించి వివరించారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
6. ఉక్రెయిన్ వైద్య విద్యార్థులకు కేంద్రం ఊరట.. సర్టిఫికేట్లు జారీ..
ఉక్రెయిన్‍లో చదువుకున్న వైద్య విద్యార్థులకు భారత ప్రభుత్వం ఊరటనిచ్చింది. యుద్ధ కారణంగా చదువు ఆగిపోయిన విద్యార్థులకు ఉపశమనమిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30 కన్నాముందు మెడిసిన్ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్‌కు కేంద్ర ప్రభుత్వం సర్టిఫికేట్లు జారీ చేసింది.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7. ఆ ప్రేమను చాలా మిస్ అవుతున్నా: రతన్ టాటా భావోద్వేగం
ప్రముఖ వ్యాపార వేత్త, టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ రతన్ టాటా తన గురువు జేఆర్‌డీ టాటా (జహంగీర్ రతన్‌జీ దాదాభాయ్ టాటా)ను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. జేఆర్‌డీ టాటా 118వ జయంతి సందర్భంగా టాటాసన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఇన్‌స్టాలో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8. 'జింబాబ్వేపై కోహ్లి సెంచరీ చేసినా.. అతడి ఫామ్‌లో మార్పు రాదు'
టీమిండియా ప్రస్తుతం కరీబియన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. శుక్రవారం(జూలై29) నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో కూడా తమ అధిపత్యం చెలాయించాలని భావిస్తోంది.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
9. నాకేదైనా అయితే ఆ మాఫియాను వదలకండి, వెంటాడండి..
తనుశ్రీ దత్తా.. మీటూ ఉద్యమం జోరుగా నడిచిన సమయంలో బాగా వినిపించిన పేరు. ప్రముఖ నటుడు నానా పటేకర్ తనను శారీరకంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలు చేసిందీ బాలీవుడ్ హీరోయిన్. ఆమె గొంతు విప్పిన తర్వాతే పలువురు నటీమణులు కూడా బయటకు వచ్చిన తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10. ఐదేళ్లుగా నమ్మకంగా ఉంటున్నాడని ఇంటి తాళం.. రూ.10కోట్లతో చెక్కేసిన వ్యక్తి
ఐదేళ్లుగా ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నాడని తాళం అతనికే అప్పగించి అమెరికా వెళ్లాడు ఓ యజమాని. తీరా అతనే దొంగతనానికి పాల్పడి రూ.10కోట్లు దోచుకెళ్లాడని తెలిసి షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment