మాయమాటలతో పెళ్లిళ్లు చేసుకోవడం.. ఆనక మంచిది కాదంటూ వదిలించుకోవడం ఆ వృద్ధుడికి వెన్నతో పెట్టిన విద్య. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఏడు పెళ్లిళ్లు చేసుకున్నాడా ఘనుడు. స్థానికుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా బూరుగుపల్లి పంచాయతీ మట్టవానిచెరువుకు చెందిన చెల్లుబోయిన ఆంజనేయులు ఆరు ఎకరాల ఆసామి. వయస్సు 60. అతనికి తల్లి, ముగ్గురు అక్కాచెల్లెళ్లతోపాటు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారు చిన్నగా ఉన్నప్పుడే ఆంజనేయులు పెట్టే బాధలు తట్టుకోలేక మొదటి భార్య వెళ్లిపోయింది. కొడుకులూ చదువులు, ఉద్యోగాల కోసం దూరంగా వెళ్లడంతో ఆంజనేయులు రావిపాడు, పోడూరు, అమలాపురం, కాజ పడమర, సగంచెరువు గ్రామాలకు చెందిన ఐదుగురిని పెళ్లి చేసుకున్నాడు. వీరందరినీ గ్రామస్తులకు తెలయకుండా పెళ్లి చేసుకుని.. అలాగే వదిలేశాడు.
Published Mon, Feb 20 2017 10:32 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement