అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. భారత కాల మానం ప్రకారం గురువారం ఉదయం కొలరాడొ రాష్ట్రం థోర్న్‌టన్ నగరంలోని ఓ షాపింగ్ మాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనలో ఇప్పటిదాకా ఇద్దరు మృతి చెందగా, ఒకరు గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. సబ్‌అర్బన్ డెన్‌వర్‌లోని వాల్‌మార్ట్ మాల్‌లో తుపాకీ మోత మోగినట్లు తెలుస్తోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. మాల్ చుట్టుపక్కలకు వెళ్లొద్దని స్థానికులకు సూచించారు. పరిస్థితి తమకూ సరిగ్గా తెలీటం లేదని.. చాలా మందికి గాయాలైనట్లు ఓ అధికారి వ్యాఖ్యానించారు.
కొలరాడొ మాల్‌లో కాల్పులు
Published Thu, Nov 2 2017 9:40 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement