break up
-
ప్రియుడితో బిగ్‌బాస్ బ్యూటీ బ్రేకప్.. త్వరలోనే తెలుగులో ఎంట్రీ!
బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న జంట ప్రియాంక చాహర్ చౌదరి, అంకిత్ గుప్తా. బిగ్ బాస్ సీజన్- 16లో వీరిద్దరు కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. ఈ సీజన్లో ప్రియాంక సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఆ రియాలిటీ షో తర్వాత వీరిద్దరు పలు సీరియల్స్‌లోనూ నటించారు. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు చాలాసార్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా త్వరలోనే ఓ యూట్యూబ్ ఛానెల్లో ప్రసారం కాబోయే తేర్రే హో జాయేన్ హమ్ షో కోసం జతకట్టనున్నారు. అయితే తాజాగా వీరిద్దరికీ సంబంధించిన ఓ వార్త బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ బుల్లితెర జంట ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక, అంకిత్ తమ రిలేషన్‌కు గుడ్ బై చెప్పనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఈ జంట పెళ్లికి సిద్ధమయ్యారని టాక్ వినిపించింది. కానీ తాజా పరిణామాలతో ఈ జంట బ్రేకప్ చెప్పేసుకున్నట్లు బీటౌన్‌లో టాక్ నడుస్తోంది.ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ నిరాశను వ్యక్తం చేశారు. అయితే ఒకరినొకరు అన్‌ఫాలో చేసినప్పటికీ.. ఇన్స్టాగ్రామ్ ఫోటోలు తొలగించలేదు. అయితే ఇదంతా రాబోయే కొత్త షో కోసం ఇలా చేశారా? అని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా.. అంకిత్ గుప్తా, ప్రియాంకతో బాలికా వధు, సద్దా హక్ సిరీయల్స్‌లో జంటగా నటించారు. ప్రియాంక చాహర్ చౌదరి శ్రీ విష్ణు హీరోగా నటించే తెలుగు చిత్రం హీరో హీరోయిన్లో కనిపించనుంది. ఈ చిత్రంలో మరో బాలీవుడ్ బ్యూటీ దివ్య ఖోస్లా కుమార్ కూడా నటించనుంది. -
మ్యారేజ్ కి నో చెప్పిన వర్మ.. బ్రేకప్ చెప్పేసిన తమన్నా..!
-
హీరోయిన్‌తో బ్రేకప్.. పెళ్లిపై స్పందించిన స్టార్ హీరో
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ప్రస్తుతం 'మేరే హస్బెండ్ కీ బీవీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, భూమి పెడ్నేకర్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల విడుదలైన పోస్టర్లు చూస్తే ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెలలోనే థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు అర్జున్ కపూర్. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఇందులో అర్జున్ కపూర్‌కు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. దీంతో తన వివాహం ప్రణాళికల గురించి నోరు మాట్లాడారు.అర్జున్ కపూర్ మాట్లాడుతూ.."నా పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అప్పుడు మీ అందరికీ తెలియజేస్తా. ఈ రోజు, సినిమా గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది సినిమా గురించి మాట్లాడుకునే సమయం. నా వ్యక్తిగత జీవితం గురించి కబుర్లు చెప్పుకోవడానికి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. సమయం వచ్చినప్పుడు మీ అందరితో చెప్పడానికి వెనుకాడను. ఒక వ్యక్తిగా ఎలా ఉన్నానో మీ అందరికీ తెలుసు" అని అన్నారు.కాగా.. కొద్ది నెలల క్రితమే బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరాతో బ్రేకప్ చేసుకున్నారు. దాదాపు కొన్నేళ్ల పాటు రిలేషన్లో వీరిద్దరు గతేడాది విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. తాను సింగిల్‌గానే ఉన్నానని గతేడాది దీపావళి పార్టీలో అర్జున్ కపూర్ వెల్లడించాడు. ప్రస్తుతం అర్జున్ నటించిన మేరే హస్బెండ్ కీ బీవీ ఫిబ్రవరి 21న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించారు. మేరే హస్బెండ్ కి బీవీ చిత్రంలో శక్తి కపూర్, అనితా రాజ్, డినో మోరియా, ఆదిత్య సీల్ కీలక పాత్రల్లో నటించారు. -
నెరుస్తున్న బంధాలు
పెళ్లయిన కొత్త... పడలేదు..విడిపోయారు...పెళ్లయ్యి పదేళ్లు... విడిపోయారు... ఇవి అందరికీ తెలిసినవే.కాని పెళ్లయ్యి ముప్పై, నలబై ఏళ్లు అయ్యాక కూడా విడిపోవాలా?వీటిని ‘గ్రే డివోర్స్’లని ‘సిల్వర్ స్పిల్టింగ్’ అంటున్నారు.నటుడు ఆశీష్ విద్యార్థి తన 60వ ఏట విడాకులు తీసుకుంటే ఇప్పుడు రెహమాన్ జంట కేసు కూడా గ్రే డివోర్స్ను చర్చాంశం చేసింది. సైకాలజిస్ట్‌లు మాత్రం జట్టు తెల్లబడేకొద్దీ వైవాహిక జీవితం గట్టిపడేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.ఆశీష్ విద్యార్థి కుమారుడు అమెరికాలో చదువుకుంటున్నారు. అతని గ్రాడ్యుయేషన్ సెరిమనీకి ఆశీష్ తన భార్య రాజోషి బారువాతో వెళ్లాడు. కాని వారు మరోసారి అలా కలిసి వెళ్లలేని విధంగా 2022లో విడిపోయారు. ‘మా సొంత ఇష్టాలు, ఆసక్తులు నెరవేర్చుకునే సమయం ఇది అనిపించింది’ అన్నారు వారు. ‘తండ్రిగా ఆషిష్లో ఏ వంకా వెతకలేము. భార్యగా నాకుండే కంప్లయింట్లు ఉంటాయి’ అని విడిపోయాక అతని గురించి రాజోషి అంది. వారు ఒకరి మీద ఒకరు గౌరవం చూపుతూనే విడిపోయారు. కాని సైకాలజిస్టులు ఏమంటారంటే ఒకరి మీద ఒకరు గౌరవం చూపుతూ కలిసి ఉండొచ్చుగా?హృదయాలు ఎందుకు పగలాలి?ఏ.ఆర్.రెహమాన్ 57 ఏళ్ల వయసులో అతని భార్య సైరా బాను 57 సంవత్సరాల వయసులో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ‘ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ అలాగే ఉంది. కాని హృదయాలు పగిలేంతగా అగాథాలు వచ్చాయి’ అని వారిద్దరూ తెలిపారు. అయితే అగాథాలు ఒక్కరోజే వచ్చిపడవు. పగుళ్లు కనిపిస్తూనే ఉంటాయి. వాటిని గుర్తించి సరి చేసుకునేందుకు ప్రయత్నించాలి. 99 సార్లు ప్రయత్నం చేసి నూరవసారి ఈ తీవ్ర నిర్ణయానికి రావచ్చు.జాగ్రత్త పడాల్సింది ఇప్పుడేఅమెరికాలో గ్రే డివోర్సులు గత పదేళ్లలో పెరిగాయి. ఆశ్చర్యం ఏమంటే 50 ఏళ్ల వయసులో డివోర్స్ తీసుకునే వారు 13 శాతం ఉంటే 65 ఏళ్ల తర్వాత డివోర్స్ తీసుకునేవారు 29 శాతం ఉన్నారు. భారత దేశంలో విడాకుల వరకూ వెళ్లే వారి సంఖ్య తక్కువే అయినా ఏళ్ల తరబడి భర్త ఒక సంతానం దగ్గర, భార్య ఒక సంతానం దగ్గర, లేదంటే ఒకే చూరు కింద అపరిచితుల్లా ఉన్నవారు అనేకమంది ఉన్నారు. పెళ్లినాటి నుంచే మొదలయ్యే బంధాల నిర్వహణాలోపం కాలక్రమంలో ఇక్కడిదాకా తెస్తుంది. ఇక్కడ దాకా వచ్చాక విడిపోవడంలో సౌలభ్యం ఉందని చెప్పినా కొత్త జీవితంలో కూడా అంతే సౌలభ్యం పొందగలరా అనేది ప్రశ్నార్థకం. అందులో ఎదురయ్యే సవాళ్లు అల్రెడీ ఉన్న సంసారిక జీవితంలో ఎదురయ్యే సవాళ్ల కంటే గట్టివైతే ఏమిటి చేయడం?గ్రే డివోర్సులకు కారణాలు– నివారణ→ ఖాళీ ఇల్లు: పిల్లలు పెద్దవారయ్యే వెళ్లిపోయాక అంత వరకూ తల్లిదండ్రులుగా ఉన్నవారు తాము భార్యాభర్తలుగా ఉండటం మర్చిపోయామని గ్రహిస్తారు. భార్యాభర్తలుగా ఉండటం కొత్తగా మొదలెట్టాక సమస్యలు మొదలవుతున్నాయి. అంటే పిల్లలతో పాటుగా కుటుంబంగా ఉండటం సాధన చేస్తే ఈ ‘ఖాళీ’ రాదు. పిల్లలు లేని ఏకాంతం భార్యాభర్తల్లో మరింత ఇష్టాన్ని, విహారాన్ని, కబుర్లని ఇవ్వాలిగాని తగూలాటను కాదు. సమస్యను దాచి పిల్లల ముందు వ్యవహరించడం వల్ల ఇప్పుడు ఆ సమస్య విడాకులు కోరుతోంది. → మరింత అధికారం: భార్యాభర్తల మధ్య పొజెసివ్‌నెస్ ఉంటుంది. నాకే చెందాలి అని. ఉద్యోగాల్లో ఉండగా పట్టిపట్టి చూడటం కుదరుదు. ఈ రిటైర్మెంట్ తర్వాత భర్త తరచూ క్లబ్లో కూచుంటున్నా భార్య తరచూ బంధువులతో గంటల ఫోన్లలో ఉన్నా చిరాకులు తలెత్తుతాయి. ఏం చేసినా వీలైనంత వరకూ ఉమ్మడి అనుబంధాలలో గడపడం ఈ వయసులో చాలా ముఖ్యం. అంటే కామన్ ఫ్రెండ్సే, కామన్ ఆసక్తులే బంధాలను నిలుపుతాయి. ఇక అనుమానాలకు చోటిచ్చే ఇతర ఏ ఆకర్షణవైపుకు వెళ్లకపోవడమే ఉత్తమం.→ రూపాయి తగాదా: డబ్బు నీది, నాది అంటూ కాపురం సాగి ఉంటే ఆ రూపాయి భూతంలా మారే సందర్భం ఇదే. నా డబ్బు నేను ఇచ్చుకుంటాను, నా ఆస్తి నేను పంచుకుంటాను అని భార్య/భర్త ఎప్పుడైతే అనుకుంటారో అగాధాలు మొదలవుతాయి. డబ్బు ఒకరికి తెలియకుండా మరొకరు దాచకుండా ముందు నుంచి సంసారం సాగాలి. ఆర్థిక నిర్ణయాలు పరస్పర అంగీకారంతో జరగాలి. రిటైర్మెంట్ తర్వాత ఎలా ఆర్థికంగా ఉండబోతున్నారో ఆస్తులు ఎవరికి ఎలా ఇవ్వబోతున్నారో పదే పదే చర్చించుకుని సంతృప్తి పడితే సమస్య రాదు. → అనారోగ్య సమయాలు: అనారోగ్యాలు ఎదురయ్యే ఈ సమయంలో భార్య/భర్త దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉంటే ఓదార్పు కోసం కొత్త స్నేహానుబంధాల్లోకి వెళ్లడం విడాకులకు మరో కారణం. ఈ సమయంలో ఉండే అభద్రతను దృష్టిలో ఉంచుకుని జీవిత భాగస్వామి మరింత బాధ్యతగా ఉండాలి. ఇలాంటి సమయాల్లో విడిపోయే దాకా రావడం భార్యాభర్తల కంటే పిల్లలకు పెద్ద విఘాతం కాగలదు. కలిసి ఉంటే కలదు సుఖముపెళ్లయిన నాటి నుంచి తగాదాల కాపురం అయితే అందులో ఒక సమర్థింపు ఉండొచ్చుగాని హఠాత్తుగా ముప్పయి నలబై ఏళ్ల తర్వాత విడాకులంటే ఏదో నిర్లక్ష్యం భార్యాభర్తల్లో ఉన్నట్టే. జవాబుదారీతనం లేదులే అనుకోవచ్చుగాని విడిపోవడం అంత సులువు కాదు. పైగా అది ఒకరు గట్టిగా తీసుకొంటే మరొకరి పెనుఘాతం కావచ్చు. ఇష్టంతో, గౌరవంతో విడిపోయినా మళ్లీ ‘సాధారణస్థితి’కి రావడానికి చాలా కాలం పడుతుంది. కలిసి జీవించి పిల్లలకు జన్మనిచ్చి వారితో సంతోషంగా కాలం గడపాల్సిన ఈ వేళలో మరింత శ్రద్ధ. ప్రేమలను అనుబంధంలో పెంచడమే భార్యాభర్తలు చేయాల్సింది. -
పెళ్లి క్యాన్సిల్ : బ్రేకప్ ప్రకటించిన బిగ్ బాస్ ఫేం, గాయకుడు
హిందీ బిగ్ బాస్ 16తో ఫేమస్ అయిన ప్రముఖ సింగర్ అబ్ధు రోజిక్ సంచలన విషయాన్ని ప్రకటించాడు. షార్జాకు చెందిన అమీరాతో త్వరలోనే పెళ్లి అని అట్టహాసంగా ప్రకటించిన అబ్ధుల్ పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు తాజాగా వెల్లడించాడు. దీంతో ఈ వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ నిర్ణయంతో షాక్ అయ్యారు.అబ్దు అమీరా ఏప్రిల్ 24, 2024న దుబాయ్‌లోని మజ్లిస్ షార్జాలో విలాసవంతమైన వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఏడాది జూలై 7న జరగాల్సిన వీరి పెళ్లి చేసుకోబోతున్నామని కూడా ప్రకటించారు. కానీ అబ్దు బాక్సింగ్ మ్యాచ్ కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ జంట ఇప్పుడు విడిపోవడానికి నిర్ణయించు కున్నారు. తమ సాంస్కృతిక విభేదాలే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ఈ నిర్ణయం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన వ్యక్తిగత ఎదుగుదలకు ఇది అవసరమని పేర్కొన్నాడు. అందరూ అర్థం చేసుకుంటారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాదు సమయం వచ్చినప్పుడు ప్రేమ తనను వెతుక్కుంటూ వస్తుందని చెప్పాడు. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. (డ్రీమ్ వెడ్డింగ్: భారతీయ దుస్తులతో అమెరికాలో ఘనంగా, ఫోటోలు వైరల్) కాగా తజికిస్థాన్ సింగర్ అయిన అబ్దు రోజిక్ తన సాంగ్స్‌తో బాగా పాపులర్ అయ్యాడు. ఆ తరువాత బిగ్ బాస్ 16 ద్వార ఒక రేంజ్లో క్రేజ్ సంపాదించాడు. సంగీత కెరీర్ ద్వారా భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. మే 9న ఇన్‌స్టాగ్రామ్‌లో తన నిశ్చితార్థ వేడుక చిత్రాలను కూడా పంచుకుని ఫ్యాన్స్ ఆశ్చర్యపరిచాడు. అమీరా-అబ్దు పెళ్లికి సల్మాన్ ఖాన్, నే-యో, ర్యాన్ గార్సియా, జాసన్ డెరులో, మైక్ టైసన్ లాంటి టాప్ సెలబ్రిటీలు రానున్నారని అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా విడిపోతున్నట్టు ప్రకటించారు. విభేదల పరిష్కారానికి ప్రయత్నాలు ఉన్నప్పటికీ, వారు చివరికి విడిపోవడమే ఉత్తమమని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతానికి, అబ్దుతన వ్యక్తిగత, ,వృత్తిపరమైన ఎదుగుదలపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.ఇవీ చదవండి: నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖవింత ఉద్యోగం: పెళ్లిళ్లు చెడగొట్టడమే పని, భారీ ఆదాయం కూడా! -
త్వరలో పెళ్లి : ఇంతలోనే బ్రేకప్ ప్రకటించిన ముద్దుగుమ్మలు
ఒక్క ఫోటో షూట్‌తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ఇండో-పాక్‌కు లెస్బియన్ జంట అంజలి చక్ర, సూఫీ మాలిక్ షాకింగ్ న్యూస్ చెప్పారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లైన ఈ జంట తమ ఐదేళ్ల బంధానికి స్వస్తి పలికారు. ఈ విషయాన్ని ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 2019లో సంచలన ఫోటోషూట్‌తో ఇంటర్నెట్లో హల్చల్ చేశారు అంజలి, సూఫీ జంట. భారతదేశానికి చెందిన అంజలి, పాకిస్తాన్‌కు చెందిన సూఫీ సంప్రదాయ దుస్తుల్లో, వర్షంలో డ్యాన్స్ చేస్తున్న ఫోటోలు, వీడియోలతో తమ బంధాన్ని బహిర్గతం చేశారు. అంతేకాదు న్యూయార్క్‌లోని ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌లో ఎంగేజ్మెంట్ కూడా పూర్తి చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటరనుకున్న ఈ లవ్‌బర్డ్స్ తాజాగా పెళ్లిరద్దు చేసుకోవడం హాట్ టాపిక్‌గా నిలిచింది. "ఇది షాక్‌గా అనిపించవచ్చు, కానీ మా ప్రయాణం మారుతోంది. సూఫీ చేసిన మోసి కారణంగా మేము మా పెళ్లిని రద్దు చేసుకోవాలని, మా సంబంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాము" అని అంజలి ఒక పోస్ట్‌లో పేర్కొంది. మరోవైపు అంజలిని మోసం చేసినట్లు సూఫీ స్వయంగా అంగీకరించింది. ‘‘నేను గుర్తించ లేనంత తప్పిదం, ద్రోహం చేశాను. మోసం చేసా. నాకు తెలియకుండానే ఆమెను విపరీతంగా బాధపెట్టాను. నా తప్పిదానికి కట్టుబడి ఉన్నా. ఆమెను క్షమాపణలు కోరుతున్నా’’ అంటూ సూఫీ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించింది. 2019లొ అంజలి, సూఫీ జంట్ తమ బంధాన్ని ఒకఫోటోషూట్ ద్వారా ప్రకటించారు. టర్నెట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. -
గతేడాదే బ్రేకప్.. మాజీ లవర్‌తో మళ్లీ కనిపించిన హీరోయిన్!
బాలీవుడ్ బ్యూటీ, దిశా పటానీ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆమె తమిళంలో సూర్య సరసన కంగువా చిత్రంలో నటిస్తోంది. శివ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దిశా పటానీ తెలుగులో వరుణ్ తేజ్ సరసన లోఫర్ చిత్రంలో నటించింది. అయితే గతంలో టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే గతేడాది ఈ బాలీవుడ్ బ్రేకప్ చెప్పేసుకుంది. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న టైగర్ ష్రాఫ్ తాను సింగిల్‌గానే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. (ఇది చదవండి: దీపికా పదుకొణె స్థానంలో దిశా పటానీ? లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ) అయితే తాజాగా ఓ ఈవెంట్లో బాలీవుడ్ భామ దిశా పటానీ, ఆమె మాజీ ప్రియుడు టైగర్ ష్రాఫ్ జంటగా కనిపించారు. శనివారం దిల్లీలో జరిగిన ఓ ఈవెంట్‌కు ఈ మాజీ లవర్స్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు దిశా, టైగర్ మళ్లీ కలిసిపోయారంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. ఈ ఏడాది మార్చిలో టైగర్ ష్రాఫ్ పుట్టినరోజు సందర్భంగా దిశా పటానీ విష్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మాజీ లవర్‌కు విషెస్ చెప్పింది. కాగా.. దిశా పటాని ప్రస్తుతం యోధా, కంగువా, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నారు. టైగర్ ష్రాఫ్ గణపత్, బడే మియాన్ చోటే మియాన్లో కనిపించనున్నారు. (ఇది చదవండి: హీరోతో కీర్తి నిశ్చితార్థం.. వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేనంటూ ఎమోషనల్) Tiger and Disha together again 😍#TigerShroff #DishaPatani pic.twitter.com/LrThURuSgO — $@M (@SAMTHEBESTEST_) July 2, 2023 Disha Patani with Tiger Shroff @DishPatani @iTIGERSHROFF #DishaPatani #TigerShroff pic.twitter.com/gChdDXIVS7 — Disha Patani Fan Club ❤️ (@satyam20157) July 1, 2023 View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s) -
తనకంటే చిన్నవాడితో లవ్.. రెండేళ్లకే బ్రేకప్ చెప్పిన నటి
బుల్లితెర జంట జీషన్ ఖాన్, రేహ్న పండిత్(రేహ్న మల్హోత్రా) విడిపోయారంటూ గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా అదే నిజమైంది. తమ మధ్య ప్రేమబంధం ముగిసిందని నటి రేహ్న వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. 'జీషన్‌తో నా ప్రయాణం ముగిసింది. మేమిద్దరం కలిసి ఉండట్లేదు. మళ్లీ కలవాలన్న ఆలోచన కూడా లేదు. గతకొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరదించాలనుకున్నాను. అందుకే ఈ విషయం చెప్తున్నా. ఇక మీదట జీషన్ గురించి నన్ను ఎటువంటి ప్రశ్న అడగకండి. ఎందుకంటే అంతా అయిపోయింది. ఇక్కడితో దీన్ని వదిలేయండి' అని చెప్పుకొచ్చింది. అటు జీషన్ కూడా 'అవును, బ్రేకప్ చెప్పుకున్నాం. ఇక మీదట దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. నా వైపు నుంచి చివరిసారిగా రేహ్నకు వీడ్కోలు చెబుతున్నా' అని తెలిపాడు. కాగా జీషన్, రేహ్న కుంకుమ్ భాగ్య సీరియల్ సెట్లో కలిశారు. అప్పటినుంచే ప్రేమలో ఉన్నారు. 2021 అక్టోబర్‌లో తమ ప్రేమను అధికారికంగా వెల్లడించారు. జీషన్ కన్నా రేహ్న వయసులో పెద్దదైనప్పటికీ ఎప్పుడూ తమ మధ్య పొరపచ్చాలు రాలేదని వీరు గతంలో చెప్పుకొచ్చారు. ఏమైందో ఏమో కానీ సడన్‌గా గత నెలలో రేహ్నాతో బ్రేకప్ అయిందని పోస్ట్ పెట్టాడు జీషన్. మళ్లీ ఆ వెంటనే.. అలాంటిదేమీ లేదని కలిసిపోయామని క్లారిటీ ఇచ్చారు. కాకపోతే కొన్ని గొడవలు జరిగాయని, ఇద్దరం వాటి నుంచి బయటపడి ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసిపోవడానికి సమయం పట్టిందన్నారు. ఒక్కసారి ప్రేమించాక జీవితాంతం తన చేయి వదలనని చెప్పాడు జీషన్. గొడవలకు ముగింపు పలికి మళ్లీ కలిసిపోయారనుకుంటున్న సమయంలో శాశ్వతంగా విడిపోతున్నట్లు వెల్లడించి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది జంట. చదవండి: రష్మికను నేనేమీ అనలేదు: ఐశ్వర్య రాజేశ్ -
బ్రేకప్ అయింది..అమ్మాయిలంటేనే భయమేస్తుంది: సాయితేజ్
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో టాలీవుడ్ యంగ్ హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఆయన పెళ్లి గురించి గతంలో అనేకసార్లు రూమర్స్ వచ్చాయి. అయితే సాయి తేజ్ మాత్రం వాటన్నింటిని కొట్టేస్తూ.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పుకొచ్చాడు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఆయన నటించిన తాజా చిత్రం విరూపాక్ష ఈ నెల 21న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్స్‌లో పాల్గొంటున్నాడు. సినిమా ప్రచారం కోసం పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎవరో అంటున్నారు కదా అని తాను పెళ్లి చేసుకోనని, తనకు నచ్చినప్పుడే చేసుకుంటానని చెప్పాడు. అలాగే తన లవ్‌స్టోరీ గురించి కూడా చెప్పాడు. గతంలో ఓ అమ్మాయిని ప్రేమించానని.. కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయిందని చెప్పుకొచ్చాడు. బ్రేకప్ తర్వాత చాలా సైలెంట్ అయిపోయానని, అమ్మాయిలంటేనే భయమేస్తుందని తేజ్ అన్నారు. ఇక విరూపాక్ష విషయానికొస్తే.. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్. బాపినీడు సమర్పణలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించటం గమనార్హం. -
పెళ్లికి ముందే విడిపోయిన హీరో.. ఎంగేజ్మెంట్ రద్దు
ఇండస్ట్రీలో ఈమధ్య ప్రేమ-విడాకులు కామన్ అయిపోయాయి. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. మరికొందరేమో నిశ్చితార్థం చేసుకొని పెళ్లి కాకుండానే బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్ తన ప్రేయసికి బ్రేకప్ చెప్పేశారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఊసరవెల్లి, శక్తి, తుపాకీ సినిమాల్లో నటించిన విద్యుత్ బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కమాండో సీక్వెల్, ఖుదా హాఫీజ్, జంగ్లీ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన విద్యుత్ కొంతకాలంగా నందితా మహ్తానీ అనే ఫ్యాషన్ డిజైనర్‌తో ప్రేమలో ఉన్నాడు. 2021 సెప్టెంబరులో వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుతారనుకుంటే ఇలా బ్రేకప్ చెప్పేసి షాక్ ఇచ్చారు. రీసెంట్గా అనన్య కజిన్ పెళ్లికి విడివిడిగా హాజరైన విద్యుత్-నందితా పెడమొహంగా కనిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా బ్రేకప్‌కు సంబంధించిన కొటేషన్స్‌ని షేర్ చేశారు. బీటౌన్ క్యూట్ కపుల్‌గా కనిపించిన ఈ జంట బ్రేకప్ ఫ్యాన్స్‌కు షాకిచ్చినట్లయ్యింది. -
తొలిసారి నెగటివ్ రోల్లో ఒకరు.. ఎమోషనల్ కేరెక్టర్లో మరొకరు.. ఇంకా
ఒకరు నెగటివ్‌గా కనిపించనున్నారు. ప్రేక్షకులు ఎప్పుడూ ఆమెను అలాంటి పాత్రలో చూడలేదు. ఇంకొకరు కన్నీళ్లు తెప్పించే పాత్రతో వచ్చారు.. అలాంటి పాత్రతో వచ్చినందుకు ఆనందభాష్పాలను ఆపుకోలేకపోయారామె. మరొకరు కథానాయికగా కనుమరుగై.. చెల్లెలిగా రిటర్న్ అవుతున్నారు. నటనకు ఒక్కసారి బ్రేక్ ఇచ్చాక మళ్లీ నటించాలంటే ఆ క్యారెక్టర్ ఎంతో బలమైనది అయ్యుంటేనే ఆ ఆర్టిస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. జయా బచ్చన్, షర్మిలా ఠాగూర్, జీవితలకు అలాంటి పాత్రలే దొరికాయి. అందుకే బ్రేక్‌లు తీశారు.. నటిగా మేకప్ వేసుకున్నారు. ఒక్కప్పటి ఈ స్టార్స్ రిటర్న్ కావడం అభిమానులకు ఆనందమే కదా. ఇక ఈ ముగ్గురి చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. తొలిసారి నెగటివ్‌గా... జయా బచ్చన్ కెరీర్ దాదాపు 60 ఏళ్లు. ఇన్నేళ్ల సుదీర్ఘ కెరీర్లో నటిగా ఎన్నో అద్భుత పాత్రలు చేశారామె. కెరీర్ ఆరంభంలో ‘గుడ్డి’ (1971)లో చేసిన పాత్రతో ‘గర్ల్ నెక్ట్స్ డోర్’ ఇమేజ్ తెచ్చుకున్న జయ ఆ తర్వాత ‘జవానీ దివానీ’లో గ్లామరస్ రోల్లో మెప్పించారు. అలాగే అనామిక (1973)లో కాస్త నెగటివ్ టచ్ ఉన్న పాత్ర చేసి, భేష్ అనిపించుకున్నారు. అయితే ఇన్నేళ్ల కెరీర్లో జయ పూర్తి స్థాయి నెగటివ్ క్యారెక్టర్ చేయలేదు. ఇప్పుడు చేస్తున్నారు. ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’లో లేడీ విలన్‌గా కనిపించనున్నారామె. దాదాపు ఏడేళ్ల తర్వాత జయా బచ్చన్ ఒప్పుకున్న చిత్రం ఇది. కరణ్ జోహార్ స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జయా బచ్చన్‌తో కరణ్ నెగటివ్ క్యారెక్టర్ గురించి చెప్పగానే ‘‘నేనా? నన్నే తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు?’ అని ఆమె అడిగారు... ‘మీరే చేయాలి’ అంటూ జయాని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు కరణ్. ఫైనల్‌గా ‘ఓకే’ అన్నారామె. అయితే ఈ పాత్రని అర్థం చేసుకుని, ఒక క్రూరమైన మనస్తత్వం ఉన్న వ్యక్తిలా నటించడానికి జయ కొన్నాళ్లు ఇబ్బందిపడ్డారట. ఆ తర్వాత పూర్తిగా ఆ పాత్రలోకి లీనం కాగలిగారని, నెగటివ్ క్యారెక్టర్ని ఆమె ఎంజాయ్ చేస్తున్నారని చిత్ర యూనిట్ పేర్కొంది. రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా రూపొందిన ఈ చిత్రం జులై 28న విడుదల కానుంది. పుష్కర కాలం తర్వాత... పుష్కర కాలం తర్వాత షర్మిలా ఠాగూర్ ఓ సినిమా చేశారు. ఈ నెల 3న విడుదలైన ‘గుల్మోహార్’లో ఆమె ఇంటి పెద్దగా లీడ్ రోల్ చేశారు. గుల్ మోహార్ అనే తమ ఇంటిని అమ్మేసి, తాను వేరే రాష్ట్రానికి వెళతానని ఇంటి పెద్ద కుసుమ్ బాత్రా (షర్మిలా ఠాగూర్ పాత్ర) చెబుతారు. అప్పుడు ఆ కుటుంబ సభ్యుల భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ‘బ్రేక్ కే బాద్’ (2010) సినిమా తర్వాత మళ్లీ మంచి పాత్రలు వచ్చేంతవరకూ బ్రేక్ తీసుకోవాలనుకున్నారు షర్మిలా. ‘గుల్మోహార్’లో తన పాత్ర కీలకం కావడంతో పాటు మంచి ఎమోషన్స్ కనబరిచే చాన్స్ ఉన్నందున ఆమె అంగీకరించారు. ఈ సినిమా ప్రివ్యూ చూసి, షర్మిలా ఏడుపు ఆపుకోలేకపోయారు. ‘‘పన్నెండేళ్ల తర్వాత ఒక మంచి పాత్రలో తెరపై కనిపించడంతో నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. ఈ సినిమాని మూడుసార్లు చూశాను. చూసిన ప్రతిసారీ ఏడ్చాను. అంతగా ఈ పాత్రతో కనెక్ట్ అయ్యాను’’ అని షర్మిలా పేర్కొన్నారు. చెల్లెలిగా... కథానాయికగా గర్ల్ నెక్ట్స్ డోర్ అనదగ్గ పాత్రల్లో కనిపించారు జీవిత. ‘తలంబ్రాలు’, ‘ఆహుతి’, ‘అంకుశం’ వంటి చిత్రాల్లో చేసిన పాత్రలతో మంచి నటి అనిపించుకున్నారామె. ‘మగాడు’ (1990) తర్వాత నటిగా వేరే సినిమాలు ఒప్పుకోలేదు. ఇప్పుడు రజనీకాంత్ అతిథి పాత్రలో ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ‘లాల్ సలామ్’లో నటించడానికి జీవిత ఒప్పుకున్నారు. ఇందులో ఆమెది రజనీ చెల్లెలి పాత్ర. ‘‘నా కెరీర్లో రజనీ సార్‌తో సినిమా చేయలేదు. ఇప్పుడు కుదిరినందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఒప్పుకోవడానికి కొంత టైమ్ తీసుకున్నాను. ‘మీరు స్క్రీన్‌పై కనిపించి చాలా రోజులైంది కాబట్టి.. చేస్తే బాగుంటుంది’ అని ఐశ్వర్య అనడం, నా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఓకే చెప్పాను’’ అని పేర్కొన్నారు జీవిత. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆమె కనిపించనున్న చిత్రం ఇది. కాగా నటిగా ఇన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ నిర్మాతగా ‘గడ్డం గ్యాంగ్, దెయ్యం’ వంటి చిత్రాలను నిర్మించారు. గత ఏడాది ‘శేఖర్’ చిత్రానికి దర్శకత్వం వహించారు జీవిత. -
రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ బ్రేకప్ సాంగ్ విన్నారా?
ఆర్యన్ గౌర, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ సాథియా’. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా స్టార్ డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా ఈ సినిమా లోని 'వెళ్లిపోయే..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. వెళ్లిపోయే.. పాపా వెళ్లిపోయే.. అంటూ సాగిపోయే ఈ బ్రేకప్ సాంగ్ లో యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. భాస్కరభట్ల రాసిన పదాల కూర్పులో నిజమైన ప్రేమికుడి భావాలు మనసుకు హత్తుకుంటున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన తీరు.. సాంగ్ కి తగ్గట్టుగా బాబా భాస్కర్ కొరియోగ్రఫీ ఈ పాటలో హైలైట్ అయ్యాయి. వినోద్ కుమార్ (విన్ను) అందించిన మ్యూజిక్ ఈ సాంగ్‌కి మేజర్ అట్రాక్షన్ గా మారింది. త్వరలోనే సినిమా విడుదల తేదిని ప్రకటిస్తామని చిత్రం బృందం పేర్కొంది. -
బ్రేకప్ జరిగింది.. నాకు రిలేషన్షిప్స్ సెట్ కావు : సందీప్ కిషన్
హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం మైఖేల్. తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో నటించిన ఈ చిత్రం ఇటీవలె విడుదలైంది. ఈ సందర్భంగా రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతానికి తాను రిలేషన్షిప్లో లేనని, అయితే గతంలో ప్రేమలో పడి ఎదురుదెబ్బలు తగిలాయని పేర్కొన్నాడు. 'నేను చాలా ఎమోషనల్ పర్సన్. నాకు సంబంధించిన విషయాలన్నీ షేర్ చేసుకోవాలనుకుంటాను. నాలాంటి వ్యక్తికి రిలేషన్షిప్స్ చాలా డేంజరస్. అవి నాకు సెట్ కావని అర్థమైంది. గతేడాది బ్రేకప్ జరిగింది. ఇప్పుడిప్పుడే దాన్నుంచి బయటకు వస్తున్నా' అంటూ పేర్కొన్నాడు. కానీ గతంలో ఎవరితో లవ్‌లో ఉన్నాడన్న విషయం మాత్రం చెప్పలేదు. కాగా హీరోయిన్ రెజీనా కసాండ్రాతో సందీప్ డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన ఆయన అందులో ఏమాత్రం నిజం లేదని తేల్చేశాడు. -
శాంతనుకు శ్రుతి బ్రేకప్ చెప్పిందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
హీరోయిన్ శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాలతోనే కాదు వ్యక్తిగత విషయాల ద్వారా కూడా శ్రుతి తరచూ వార్తల్లో నిలుస్తోంది. తన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటు ఉంటుంది. ఇక పర్సనల్ లైఫ్, రిలేషన్ షిప్ విషయానికి వస్తే శ్రుతి కొంతకాలంగా శాంతను హజారిక అనే చిత్రకళాకారుడితో ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్గా శ్రుతి షేర్ చేసిన పోస్ట్ ఆమె బ్రేకప్ రూమర్లకు తెరలేపాయి. ‘నాతో నేను ఉంటేనే సంతోషం.. నా విలువైన సమయాన్ని, ఒంటరితనాన్ని ప్రేమిస్తున్నాను’ అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో శ్రుతి మరోసారి ప్రేమలో విఫలం అయ్యిందని, శాంతనుతో తెగదెంపుల చేసుకుంది? అంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో తన బ్రేకప్ రూమర్లకు తాజాగా శ్రుతి క్లారిటీ ఇచ్చింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో శాంతనుతో దిగిన ఫొటోను షేర్ చేసింది. దీనికి ‘ఎప్పుడు నేను కోరుకునేది ఇదే’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఒక్క ఫొటోతో శ్రుతి వీరి బ్రేకప్ వార్తలకు చెక్ పెట్టింది. చదవండి: చాలా గ్యాప్ తర్వాత మూవీ ప్రమోషన్లో నయన్, హాలీవుడ్ నటిలా లేడీ సూపర్ స్టార్ అయినప్పటికీ ఇద్దరి మధ్య ఏమైన మనస్పర్థలు వచ్చి ఉంటాయని, అవి సద్దుమనగడంతో కలిసిపోయారంటూ ఆమె ఫాలోవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా శ్రుతి శాంతనుకు ముందు లండన్ బేస్డ్ మైకేల్ కోర్సల్‌తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. అతడి కొంతకాలం డేటింగ్ అనంతరం సడన్‌గా బ్రేకప్ అంటూ ట్విస్ట్ ఇచ్చింది. అయితే తన బ్రేకప్ కారణం చెప్పలేదు. ఆ తర్వాత కొంతకాలనికి శాంతనుతో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్? ఆమెతోనే ఏడడుగులు! View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
‘సృజనా.. తిన్నావారా?’ అవుతుందనుకుంటే..
బాధలను, భావోద్వేగాలను కూడా సోషల్‌మీడియాలో సరదాగా పంచుకుంటున్న రోజులివి. నాలుగేళ్ల కిందట అనుకుంటా.. సృజనా తిన్నావా రా? అంటూ ఓ భగ్న ప్రేమికుడి వాయిస్.. అదీ 27 నిమిషాల నిడివితో ఉన్న ఆడియో క్లిప్ తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది. నేషనల్ మీడియా సైతం ఆ క్లిప్ గురించి విపరీతంగా చర్చించింది. తాను ఎంతగా ప్రేమించానో ఆ యువతికి వివరిస్తూనే.. తన ఆవేదనను, ఆగ్రహాన్ని వెల్లగక్కాడు ఆమెపై వెల్లగక్కాడు ఆ ప్రేమికుడు. అయితే అలాంటి ఎమోషన్స్ పంచుతుందనుకుంటే.. వన్షికా-ఆకాశ్ బ్రేకప్ స్టోరీ బెడిసి కొట్టింది. ఈ-కామర్స్ దిగ్గజాలు సైతం తమ ప్రచారం కోసం ఆ క్లిప్ వాడేసుకోవడంతో.. ఇదంతా డ్రామా వ్యవహారంగా కొట్టిపారేస్తున్నారు నెటిజన్స్. ప్రేమ పుట్టడానికి ఎంతో టైం పట్టదు. అలాగే గిట్టడానికి కూడా!. వన్షికా-ఆకాశ్ బ్రేకప్ కహానీ.. ఇంటర్నెట్లో ఈ మధ్య విపరీతంగా వైరల్ అవుతున్న ఆడియో క్లిపులు. గత వారం రోజులుగా.. వీటి మీద వరుసబెట్టి సోషల్ మీడియా పోస్టులు కనిపిస్తూనే ఉన్నాయి. తన బ్రేకప్ బాధను ఓ స్నేహితురాలితో పంచుకునే క్రమంలో.. వన్షికా అనే యువతి కన్నీటి గాథ ఫోన్ కాల్ వీడియో ద్వారా ట్విటర్ నుంచి విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. అంతేకాదు.. ఆమె అమాయకత్వం కొందరికి నవ్వులు సైతం పంచుతోంది. తమ ప్రేమ వార్షికోత్సవం(రెండు నెలల ప్రేమ!) వేడుకల జరిపేందుకు తాను ఏమేం కొనుక్కుంది.. ఎలా ప్రిపేర్ అయ్యింది వివరించింది ఆమె. అలాగే.. ఆ ప్రేమ బంధాన్ని ఎలా తెంచుకోవచ్చనేది ఆకాశ్ తనకు ఎలా చెప్పాడనే విషయాన్ని.. వన్షికా తన ఫ్రెండ్‌తో పంచుకుని కన్నీరు మున్నీరుగా విలపించింది. వన్షికా ఆడియో క్లిప్ వైరల్ అయిన వెంటనే ఆమెకు మద్ధతుగా చాలామంది రీట్వీట్లు చేశారు. అదే సమయంలో ట్రోలింగ్ కూడా ఒక రేంజ్‌లోనే నడిచింది. ఇక ఇదే అదనుగా ఈ కామర్స్ సంస్థలు రెచ్చిపోయాయి. నెటిఫ్లిక్స్, మింత్రా,దుంజోలు తమ ప్రచారం కోసం ఆ క్లిప్‌ను వాడేసుకున్నాయి. అయితే ఆపై ఆకాశ్ వాయిస్ ఓవర్‌తో మరో ఆడియో క్లిప్ వైరల్ కావడం గమనార్హం. వన్షికా అతిగా స్పందించిందని, కేవలం రెండు నెలల ప్రేమకు పెళ్లిదాకా వెళ్లిందని, పైగా తన కోసం వేరే వాళ్లను రిజెక్ట్ చేయడం.. కరీనా కపూర్ తరహా ఓవర్ యాక్టింగ్‌లా ఉందంటూ ఎద్దేవా చేశాడు ఆకాశ్. ఈ రెండు నెలలు తనకు నరకం కనిపించిందంటూ వైరాగ్యంగా మాట్లాడాడు కూడా. ఆపై వాటిని ఆ కంపెనీలు వాడుకున్నాయి. Dear Akaash, we think boldest discounts can fix broken hearts 💁🏻♂️❤️🩹#TeamAakash go use ‘MOVINGON’ on AJIO and avail 25% additional discount* on your next date outfits 👀 #RetailTherapy for the win 🌟#AjioBigBoldSale *T&Cs apply https://t.co/ke0AqyCyXH — AJIO (@AJIOLife) December 11, 2022 Not just groceries, we aim to deliver the love of your life too. Help Vanshika find a better partner in the comments! And follow us to know what happens in her life next 😌#vanshika #lovestory #Trending #ViralVideo pic.twitter.com/itriDwWdxQ — Dunzo (@DunzoIt) December 10, 2022 Some of the most beautiful love stories begin with the main character being heartbroken. You got this, Vanshika ❤️ https://t.co/e0rHq1xkp2 — Netflix India (@NetflixIndia) December 9, 2022 Vanshika, if you’re listening, your entire wardrobe is on us. Our sale has started. Help us find you! https://t.co/R9obLnkAU7 — Myntra (@myntra) December 10, 2022 ఏది ఏమైనా.. ఈ జంట బ్రేకప్ స్టోరీ సోషల్ మీడియాకు.. ప్రత్యేకించి నార్త్ పేజీలకు విపరీతమైన స్టఫ్ పంచుతోంది. కానీ, మన వరకే సృజనా తిన్నావారా మాదిరి మాత్రం నెటిజన్లను భావోద్వేగం మాత్రం పంచలేకపోతోంది. ఎందుకనో.. డెప్త్ మిస్సయ్యింది. -
నాకు రెండు, మూడు సీరియస్ రిలేషన్స్ ఉన్నాయి: అల్లు శిరీష్
అల్లు హీరో శిరీష్ నటించి లేటెస్ట్ మూవీ ఊర్వశీవో రాక్షసివో. అను ఇమ్మానుయేల్ హీరోయిన్. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా శిరీష్ ఓ చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. ఈ క్రమంలో ప్రేమ, బ్రేకప్‌పై స్పందించాడు. మూవీలో హీరోయిన్‌తో లవ్ ట్రాక్ గురించి చెబుతుండగా యాంకర్ నిజ జీవితంలో కూడా రిలేషన్స్‌లో ఉన్నారా? అని ప్రశ్నించారు. చదవండి: ‘ఆదిపురుష్’ డైరెక్టర్‌కు లగ్జరీ ఫెరారీ కారు బహుమతి, ఎవరిచ్చారంటే.. దీనికి శిరీష్ స్పందిస్తూ.. ఈ కాలంలో రిలేషన్స్ లేకుండా ఎవరుంటారని, తనకు రెండు మూడు సీరియస్ రిలేషన్స్ ఉండేవంటూ ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. దీంతో యాంకర్ మీరు ఓ పెద్దింటి అమ్మాయితో సీరియస్ రిలేషన్లో ఉన్నారని, చివరికి మీరే బ్రేకప్ చెప్పారని విన్నాను నిజమెంత అని అడగ్గా.. అవును అని సమాధానం ఇచ్చాడు. ‘నాకు గతంలో రెండు మూడు సీరియస్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అయితే వారందరితో నాకు బ్రేకప్ అయ్యింది. చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆ రోజు నుంచి స్ట్రీమింగ్.. ఆ బ్రేకప్స్ వల్ల నేను కూడా బాధపడ్డాను. బ్రేకప్ చెప్పడం వల్ల ఎదుటి వాళ్లకు మాత్రమే పెయిన్ ఉండదు. చెప్పిన వాళ్లకి కూడా ఉంటుంది. అది ఆ నిమిషం మనకు తెలియదు. కానీ, ఏడాది తర్వాత దాని రిజల్ట్ తెలుస్తుంది. బ్రేకప్ చెప్పినప్పుడు నేను కూడా బాధపడ్డాను. అనవసరంగా బ్రేకప్ చెప్పి టైం వేస్ట్ చేస్తున్నానేమోనని ఇప్పటికీ అనిపిస్తుంది. లేదంటే ఇపాటికి నాకు పెళ్లి జరిగి ఉండేది కదా’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
బ్రేకప్ తర్వాత మళ్లీ కలిసిన దీప్తి సునయన- షణ్నూ
యూట్యూబ్ స్టార్స్ షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయనల క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డ్యాన్స్ వీడియోలతో పాపులర్ అయిన ఈ ఇద్దరూ ఆ తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్లుగా మరింత పాపులర్ అయ్యారు. కానీ అనూహ్యంగా షణ్నూ బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక వీరు బ్రేకప్ చెప్పేసుకోవడం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ వీరిద్దరూ కలిస్తే బాగుండు అని ఫ్యాన్స్ తెగ కోరుకుంటున్నారు. తాజాగా షణ్నూ-దీప్తిలు ఒకే వేదికపై కనిపించడం ఆసక్తిగా మారింది. వైజాగ్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్లో వీరిద్దరూ సందడి చేశారు. పక్కనే కూర్చున్న దీప్తిని చూస్తూ షణ్నూ సిగ్గుపడిపోయిన క్లిప్పింగ్స్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా స్టేజ్‌పైన షణ్నూ దీప్తి గురించి మాట్లాడుతూ.. ''మొదట్లో నేను, దీప్తి సునయన కవర్ సాంగ్స్ చేసేటప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆమెకు వచ్చినన్ని ట్రోల్స్ ఎవరికీ రాలేదేమో. కానీ అవి చూసి దీప్తి ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.నేను దీప్తీని చూసి చాలా నేర్చుకున్నాను. అలాగే అమ్మాయిలు దీప్తీని చూసి నేర్చుకోవాలి. మీరు కూడా ఒక ఇన్స్పిరేషన్ కావాలి” అంటూ షణ్నూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో వీరిద్దరూ మళ్లీ కలిసిపోయారా? త్వరలోనే ఆ గుడ్‌న్యూస్ షేర్ చేసుకుంటారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
బ్రేకప్ తర్వాత మళ్లీ కలిసిన దీప్తి సునయన- షణ్నూ
-
ప్రియుడితో శ్రీసత్య ఎంగేజ్మెంట్ బ్రేక్.. అసలు కారణమిదే!
బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి శ్రీ సత్య గురించి ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ సీజన్లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన ఆమె తనదైన తీరుతో రాణిస్తోంది. టాస్క్‌లో చురుగ్గా ఉండకపోయిన.. ముక్కుసూటి తనంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే హౌజ్‌లో అందరితో కలవకపోవడం, తనకంటూ ఓ పరిధిని పెట్టుకున్న శ్రీసత్య దీని వెనక ఉన్న అసలు కారణమేంటో ఇటీవల సిసింద్రీ టాస్క్‌లో బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా వ్యవహరించడానికి కారణం తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలని చెప్పింది. చదవండి: విషాదం.. స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాత్సవ మృతి తనకు బ్రేకప్ స్టోరీ ఉందని, ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడంటూ ఆమె వాపోయింది. దీంతో తాను ఆత్మహత్యాయత్నం చేశానంటూ షాకింగ్ విషయం చెప్పింది. ఈ ఘటనతో మనోవేదనకు గురైన వాళ్ల అమ్మ ప్రస్తుతం ఆస్వస్థతకు గురైందని, తను ఇప్పుడు లేవలేని స్థితిలో ఉందటూ కన్నీరు పెట్టుకుంది. ఇదిలా ఉంటే శ్రీసత్య తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని అంటున్నాడు ఆమె మాజీ ప్రియుడు పవన్ రెడ్డి. శ్రీసత్యను తాను మోసం చేయలేదని, అలాంటి ఉద్దేశమే ఉంటే తనతో నిశ్చితార్థం, పెళ్లి వరకు ఎందుకు వస్తానంటూ పవన్ రెడ్డి తన స్నేహితులతో చెప్పుకుని మండిపడ్డాడని సన్నిహితవర్గాల నుంచి సమాచారం. చదవండి: సాఫ్ట్వేర్ జాబ్ వదులుకుని వచ్చా: ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ హీరోయిన్ అయితే బిగ్‌బాస్ వంటి పెద్ద షోలో శ్రీసత్య తనని బ్యాడ్ ప్రోజెక్ట్ చేయడం పవన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. మరోవైపు బిగ్‌బాస్ హౌజ్ అడుగుపెట్టడానికి ముందు ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన శ్రీసత్య బ్రేకప్‌పై స్పందించింది. టీనేజ్‌లో ఉన్నపుడు పవన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించానని, అయితే ఆ రిలేషన్ ఇప్పుడు బ్రేక్ అయ్యిందని తెలిపింది. ‘ప్రేమించిన వ్యక్తితోనే నిశ్చితార్థం జరిగింది. అయితే మొదటి నుంచే మా కుటుంబాలకు పెళ్లి ఇష్టం లేదు. మా ప్రేమను వారు అంగీకరించలేదు. ఈ క్రమంలో రెండు కుటుంబాల మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయి. అందుకే మా నిశ్చితార్థం రద్దయింది’ అని ఆమె పేర్కొంది. -
లలిత్ మోదీకి కూడా సుస్మితా బ్రేకప్ చెప్పిందా? అసలేం జరిగింది!
ఐపీలఎల్ సృష్టికర్త లలిత్ మోదీ, మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ డేటింగ్ ఇటీవల హాట్‌టాపిక్‌గా నిలిచింది. సుష్మితతో తను ప్రేమలో ఉన్నట్లు లలిత్ మోదీ గత జూలైలో ప్రకటించిన సంగతి తెలిసిందే. సుష్మితను తన జీవిత భాగస్వామిగా పేర్కొంటూ వారద్దరు వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలు షేర్ చేశాడు లలిత్ మోదీ. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకోబుతున్నారని అంతా అనుకున్నారు. దీంతో లేటు వయసులో ప్రేమ ఏంటని నెటిజన్లు వీరిని దారుణంగా ట్రోల్ చేయడంతో వీరి ప్రేమయాణంలో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. చదవండి: సినీ ప్రియులకు ‘ఐబొమ్మ’ బిగ్ షాక్.. ఆ రోజు నుంచి శాశ్వతంగా సేవలు బంద్ అయితా తాజాగా వీరి ప్రేమ మూన్నాళ్ల ముచ్చట అయినట్లు తెలుస్తోంది. సుస్మితా, లలిత్ మోదీలు బ్రేకప్ చెప్పుకున్నారంటూ బాలీవుడ్ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణంగా లలిత్ మోదీ తన ఇన్‌స్టా బయోలో సుస్మితా పేరు తొలగించడమే. ఇది చూసి వీరిద్దరి విడిపోయారని అంతా అభిప్రాయపడుతున్నారు. కాగా గత జూలై 14న సుస్మితాతో తాను ప్రేమ ఉన్నట్లు ప్రకటించిన లలిత్ మోదీ.. తన ఇన్స్టాబయోలో సుస్మితని తన లైఫ్ పార్ట్నర్ పేర్కొన్నాడు. ఇన్‌స్టా బయోలో ‘ఇండియన్ ప్రిమీయర్ లీగ్ ఫౌండర్ చివరికి తన లైఫ్ పార్ట్నర్ని కనుగొన్నాడు. చదవండి: తిరుమల కొండపై నటి అర్చన రచ్చ.. స్పందించిన టీటీడీ మై లవ్ సుష్మితా’(Founder @iplt20 INDIAN PREMIER LEAGUE - finally starting a new life with my partner in crime. My love @sushmitasen47) అని రాశాడు. ఇర ఈ సోమవారం తన బయోలో సుస్మితా పేరు తొలగించి ‘ఫౌండర్ @iplt20 ఇండియన్ ప్రీమియర్ లీగ్. మూన్’ (Founder @iplt20 INDIAN PREMIER LEAGUE - Moon) అని మాత్రమే పెట్టాడు. అంతేకాదు సుష్మితాతో ఉన్న ఫొటోను ఇన్‌స్టా ప్రోఫైల్గా పెట్టుకున్న లలిత్ మోదీ ఆ ఫొటోని కూడా మర్చేయడం చర్చనీయాంశమైంది. ఇదంతా చూసి వారిద్దరు విడిపోయారా? అసలేం ఏం జరింగింది? అంటూ అంతా సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ బ్రేకప్ రూమర్స్‌పై లలిత్ మోదీ, సస్మితాలు ఎలా స్పందిస్తారో చూడాలి. -
ప్రియుడితో బ్రేకప్!.. హీరోయిన్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్
బాలీవుడ్ క్రేజీ కపుల్ టైగర్ ష్రాఫ్, హీరోయిన్ దిశా పటానీ బ్రేకప్ ఇప్పుడు బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.ఆరేళ్ల నుంచి ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఇప్పుడు విడిపోయారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు ఆఫ్‌స్క్రీన్‌లోనూ ఈ జోడీ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. కలిసి పార్టీలు, వెకేషన్లతో బీటౌన్‌లో మోస్ట్ పాపులర్ జోడీగా పేరు తెచ్చుకున్న టైగర్-దిశా పటానీ మధ్య ఏమైందో తెలియదు గానీ కొంతకాలంగా వీరిమధ్య మనస్పర్థలు తలెత్తాయట. దీంతో రీసెంట్గా ఎవరి దారులు వాళ్లు చూసుకోవాలని నిర్ణయించుకున్నారట. అంతేకాకుండా వారిద్దరు విడిపోవడానికి వివాహమే కారణమని ఓ ఇంగ్లీష్ వెబ్సైట్ పేర్కొంది. వివాహం చేసుకునేందుకు దిశా పటానీ సిద్ధంగా ఉన్న.. టైగర్ ష్రాఫ్ మాత్రం రెడీగా లేడట. కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు ట్రై చేస్తున్న టైగర్.. ఈ సమయంలో పెళ్లికి నో అంటున్నాడని టాక్. దీంతో అతడితో దిశా బ్రేకప్ చేసుకుందట. ఇక టైగర్‌తో బ్రేకప్ రూమర్స్ మధ్య తాజాగా దిశా పటానీ షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో ఏముందంటే.. "మీకు తెలిసిన ప్రతిదానిపై మీరు నమ్మకాన్ని కోల్పోతున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది అని ఎవరూ చెప్పకపోయినా సరే మీపై మీరు విశ్వాసాన్ని కోల్పోకండి'' అంటూ దిశా ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ప్రియుడు టైగర్‌తో బ్రేకప్ నడుమ దిశా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
‘బిగ్‌బాస్’లో ప్రేమ..ఏడాదికే బ్రేకప్
బిగ్‌బాస్ రియాలిటీ షోతో ఒక్కటైన వారిలో షిమితా శెట్టి, రాకేశ్ బాపత్ జంట ఒకటి. హిందీ బిగ్‌బాస్ ఓటీటీకి కంటెస్టెంట్ వెళ్లిన వీరిద్దరు జంటగా బయటకు వచ్చారు. హౌజ్‌లో ప్రేమలో పడ్డ షమితా-రాకేశ్ మధ్య కెమిస్ట్రి చూసి వారి ప్యాన్స్ తెగ ముచ్చటపడ్డారు. హౌజ్‌ను నుంచి బయటకు వచ్చిన అనంతరం కూడా వీరు వారి రిలేషన్ కొనసాగించారు. జంటగ పార్టీలకు, డిన్నర్లకు వెళ్లెవారు. అయితే ఏమైందో ఏమో కానీ కొద్ది రోజులుగా వీరిద్దరు విడిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. కలిసిన ఏడాదికే ఈ జంట బ్రేకప్ చెప్పుకుందంటూ బాలీవుడ్ మీడియాల్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై వారెప్పుడు స్పందించలేదు. చదవండి: మరి మహిళల నగ్న చిత్రాల సంగతేంటి?: ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ దీంతో ఇవి వట్టి పుకార్లనేనని ఈ జంట ఫ్యాన్స్ అభిప్రాయం పడ్డారు. తాజాగా ఇదే వార్తలను నిజం చేస్తూ ఫ్యాన్స్‌కి షాకిచ్చారు ఈ లవ్‌బర్డ్స్. ఇకపై తమ దారులు వేరంటూ బ్రేకప్‌పై అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ మేరకు షమితా-రాకేశ్ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ‘ఇది మీతో క్లియర్ చేసుకోవడగం ముఖ్యం అనుకుంటున్నాను. నేను రాకేశ్ కొంతకాలంగా కలిసి ఉండటం లేదు. ఇకపై కూడా ఉండబోం. మా దారులు వేరు. మాపై చూపించిన మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞురాలిని. ఇకపై కూడా ఇలాగే వేరువేరుగా మాపై ప్రేమ చూపిస్తారని ఆశిస్తున్నా’ అంటూ షమితా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నోట్ షేర్ చేసింది. అలాగే రాకేశ్ బాపత్ సైతం పోస్ట్ చేస్తూ ఇకపై తమ దారులు వేరంటూ బ్రేకప్‌పై ప్రకటన ఇచ్చాడు. కాగా నటి శిల్పాశెట్టి సోదరి అయిన షమితా శెట్టి ‘పిలిస్తే పలుకుతా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. చదవండి: ధనుష్‌తో గొడవలు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ -
సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకి పెళ్లిళ్లు అచ్చిరాలేదా?
సినీ ఇండస్ట్రీలో ప్రేమ- విడాకులు చాలా కామన్ అయిపోయింది. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో ఈ బ్రేకప్ కహానీలు ఎక్కువ. తాజాగా సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ విడాకుల విషయం ఇప్పుడు బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఎంతో అన్యోన్యంగా కలిసున్న సోహైల్- సీమా ఖాన్లు 24ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ కోర్టు మెట్లు ఎక్కారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ పెద్ద తమ్ముడు అర్భాజ్ ఖాన్ హీరోయిన్ మలైకా అరోరాతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో తమ్ముడు సోహైల్ ఖాన్ సైతం విడాకుల లిస్ట్‌లో చేరిపోయాడు. మరోవైపు ఎంతో మంది హీరోయిన్స్‌తో ప్రేమాయణం సాగించిన సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోకుండానే మిగిలిపోయాడు. అటు చాన్నాళ్ల కిందటే పెళిళ్లు చేసుకున్న ఆయన తమ్ముళ్లు విడాకులు తీసుకున్నారు. దీంతో సల్మాన్ ఫ్యామిలీకి పెళ్లి అచ్చి రాలేదేమో అంటూ నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. చదవండి: విడాకులు తీసుకోనున్న స్టార్ కపుల్ -
నాకు లవ్‌స్టొరీ ఉంది, కానీ బ్రేకప్ అయ్యింది: హీరో ఎమోషనల్
Vishwak Sen Love Breakup Story: 'పాగల్' సినిమా తర్వాత యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. డైరెక్టర్ విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్సార్ దిల్లాన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రారంభం నుంచి ప్రమోషన్స్‌ను కాస్తా డిఫరెంట్‌గా చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా ఇన్స్టాగ్రామ్ సెలబ్రెటీలతో విశ్వక్ సేన్ ముచ్చటించాడు. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. చదవండి: ఓటీటీకి ఆచార్య మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే! ఈ క్రమంలో ప్రతి సినిమాలో తనకు ఒక బ్రేకప్ స్టోరీ ఉన్నట్లు నిజ జీవితంలో ఏదైనా ఉందా? అని ఓ నెటిజన్ నుంచి ప్రశ్న ఎదురైంది. దీనికి విశ్వక్ స్పందిస్తూ.. ప్రతి ఒక్క మగాడి జీవితం ఖచ్చితంగా ప్రేమ, బ్రేకప్ ఉంటుందన్నాడు. అలాగే తన జీవితంలో కూడా ఓ బ్రేకప్ స్టోరీ ఉందన్నాడు. ‘నా జీవితంలో ఒకేసారి లవ్‌లో పడ్డాను. అది కూడా బ్రేకప్ అయ్యింది. నా కాలేజీలో రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించాను. అయితే కాలేజీ మూడేళ్లలో తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కాలేజీ అయిపోయాక తనని ఓ ఫ్రెండ్ పార్టీలో కలిశాను. ఓ సంఘటనతో ఇద్దరం దగ్గరయ్యాం’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: 'ఆచార్య'పై ప్రేక్షకుల రివ్యూ.. ఆడియెన్స్ ఏం అంటున్నారంటే.. ‘ఇక అంతా ఓకే అనుకున్నాను. కానీ ఎందుకో తెలియదు ఆ అమ్మాయి నన్ను ఎప్పుడో వదిలేసింది. అయితే ఈ విషయం 30 రోజుల తర్వాత నాకు తెలిసింది. తను మొదటి రోజు లేదా 7వ రోజు చెబితే బాగుండేది. కానీ నాకు నెల రోజుల తర్వాత తెలిసింది. అది చాలా బాధాకరం’ అంటూ విశ్వక్ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటికీ తనని మరిపోలేదని, బ్రేకప్ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా చాలా బాధగా ఉంటుందని విశ్వక్ ఎమోషనల్ అయ్యాడు. అందుకే తన సినిమాల్లో ఎక్కువగా బ్రేకప్ సీన్స్ ఉంటాయని, బ్రేకప్ అయినప్పుడు ఏడుపు పాటలు కాకుండ కాస్తా జోష్ ఉన్న సాంగ్స్ పెట్టమని తనే దర్శకులకు చెబుతానన్నాడు. అందుకే తన సినిమాల్లో బ్రేకప్ పాటలు కూడా ఫుల్ జోష్‌గా ఉంటాయని తెలిపాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1611343008.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సిద్దార్థ్‌తో బ్రేకప్ రూమర్స్, తొలిసారి స్పందించిన కియారా
Kiara Advani Respond On Break Up With Siddharth Malhotra: బాలీవుడ్ లవ్‌బర్డ్స్ కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాల బ్రేకప్ బి-టౌన్లో హాట్‌టాపిక్ నిలిచింది. కొంతకాలంగా సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్న ఈ జంట క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వీరు విడిపోయారంటూ వార్తలు రావడంతో ఈ జంట ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. వీరి బ్రేకప్‌పై బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్న తమకేం పట్టనట్టు వ్యవహరిస్తోంది ఈ జంట. అయితే వీరిద్దరి మధ్య దూరం పెరిగింది.. కానీ, గొడవల వల్ల కాదని, షూటింగ్లో బిజీ ఉండటం వల్ల అంటూ అందరిని ఆలోచనలో పడేశారు ఈ జంట మ్యూచువల్ ఫ్రెండ్స్. చదవండి: హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు, అజయ్, సుదీప్ మధ్య ట్వీట్ల వార్ ఇదిలా ఉంటే తాజాగా వీరి బ్రేకప్ వార్తలపై స్పందించి కియారా అద్వాని. కియారా తాజాగా నటించిన ‘భూల్ భులయ్యా-2’ ట్రైలర్ ఈవెంట్లో ఆమెకు దీనిపై ప్రశ్న ఎదురైంది. ‘మీరు ఎవరినైనా మరిచిపోవాలని అనుకుంటున్నారా?’ అని ఓ విలేఖరి కియారాను ప్రశ్నించాడు. దీనికి స్పందించిన ఆమె ‘నా జీవితంలో నేను ఇప్పటి వరకు కలిసిన ప్రతి ఒక్కరు నాకు ఇంపార్టెంటే. ఎవరిని మరిచిపోవాల్సిన అవసరం నాకు రాలేదు’ అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది. ఇది విని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ జంట మధ్య ఏం జరగలేదని, వీరి బ్రేకప్ వార్తల్లో నిజం లేదంటూ అభిప్రాయ పడుతున్నారు. చదవండి: పునీత్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న నమ్రత ఇదిలా ఉంటే సిద్ధార్థ్, కియారాలు వారి రిలేషన్‌పై ఇంతవరకు స్పందించలేదు. కానీ ముంబై రోడ్లలో జంటగా చక్కర్లు కొడుతూ విందులు, వినోదాలకు కలిసి వెళుతుంటారు. అంతేకాదు కియారా పలుమార్లు సిద్ధార్థ్ ఇంటికి వెళుతూ మీడియాకు చిక్కిన సంగతి తెలిసిందే. దీంతో విరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారంటూ పుకార్లు గుప్పుమన్నాయి. 2021లో వీరిద్దరు జంటగా నటించిన ‘షేర్షా’ చిత్రంలో కియారా, సిద్ధార్థ్‌ల మధ్య కెమిస్ట్రీ బాగా పండటంతో ఈ పుకార్లు మరింతగా వ్యాపించాయి. కాగా భూల్ భూలయ్యా 2 చిత్రంలో కియారా, కార్తీక్ ఆర్యన్‌కు జోడిగా నటిస్తోంది. ఇందులో సీనియర్ నటి టబు కీ రోల్ పోషిస్తోంది. చదవండి: నేరుగా ఓటీటీలో విడుదల కానున్న నాని సినిమా!, ఎక్కడంటే.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఈ లవ్ బర్డ్స్ బ్రేకప్ చెప్పుకున్నారా? అసలేం జరిగిందంటే..
Is Sidharth Malhotra, Kiara Advani Broken Up: బాలీవుడ్ లవ్‌బర్డ్స్ కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాల బ్రేకప్ బి-టౌన్లో హాట్‌టాపిక్ నిలిచింది. కొంతకాలంగా సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్న ఈ జంట క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వీరు విడిపోయారంటూ వార్తలు రావడంతో ఈ జంట ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారనుకుంటే ఇలా ఎవరి దారి వారదే అని విడిపోవటం ఏంటని చర్చించుకుంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది స్పష్టత లేదు. చదవండి: అందుకే ‘జెర్సీ’లో నటించనని చెప్పా: రష్మిక వివరణ కానీ, బ్రేకప్ రూమర్స్‌పై ఈ జంట ఇంతవరకు స్పందించకపోవడంతో అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వారందరికి ఊరటనిస్తూ ఈ జంట విడిపోలేదని వారి సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం కియారా, సిద్ధార్థ్‌లు కలిసి లేరనేది వాస్తవమే కానీ, అది గొడవల వల్ల కాదని చెబుతున్నారు. షూటింగ్‌లతో బిజీగా ఉండటం కారణంగా కొద్ది రోజులు ఈ జంట విడిగా ఉంటున్నారని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం సిద్ధార్థ్ షూటింగ్లో భాగంగా టర్కిలో ఉండగా.. కియారా తన తాజా చిత్రం ‘భూల్ భులయ్యా-2’ మూవీ ప్రమోషన్‌తో బిజీగా ఉందట. చదవండి: పిల్లలతో వెకేషన్లో శ్రీజ కొణిదెల.. ఫోటోలు వైరల్ అందువల్లే వీరిద్దరు కలుసుకోవడం లేదని, సిద్ధార్థ్ టర్కి నుంచి రాగానే మీకే క్లారిటీ వస్తుందని కియారా, సిద్ధార్థ్‌ల మ్యూచువల్ ఫ్రెండ్స్ నుంచి సమాచారం. కాగా వీరిద్దరు తొలిసారి జంటగా నటించిన షేర్షా మూవీ షూటింగ్ సమయంలో కియారా, సిద్ధార్థ్‌లు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి పార్టీలు, వెకేషన్స్ అంటూ తెగ చక్కర్లు కొట్టారు. ఆలియా-రణ్‌బీర్‌ల తర్వాత పెళ్లి చేసుకునే కపుల్ వీళ్లేనంటూ బీటౌన్‌లో ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. కానీ అందరికి షాక్ ఇస్తూ కియారా- సిద్దార్థ్‌లు విడిపోయినట్లు ఒక్కసారిగా బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. -
బాలీవుడ్లో మరో బ్రేకప్.. పెళ్లిదాకా వచ్చి విడిపోయిన స్టార్ కపుల్
బాలీవుడ్లో మరో జంట బ్రేకప్ చెప్పేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే లైగర్ బ్యూటీ అనన్య ప్రియుడు ఇషాన్ ఖట్టర్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో బ్యూటీఫుల్ కపుల్ తమ రిలేషన్‌కి ఎండ్ కార్డ్ వేసేశారు. బాలీవుడ్ మోస్ట్ క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న కియారా అద్వానీ- సిద్దార్థ్ మల్హ్రోత్రా బ్రేకప్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ సడెన్‌గా ఏం జరిగిందో తెలియదు.. వీరు తమ బంధానికి ఫుల్స్టాప్ పెట్టేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు కియారా బ్రేకప్ వార్తలు నిజమే అంటూ ఆమె సన్నిహితులు క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. కాగా షేర్షా మూవీతో కలిసి తొలిసారి కలిసి నటించిన కియారా- సిద్దార్థ్‌లు ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి పార్టీలు, వెకేషన్స్ అంటూ తెగ చక్కర్లు కొట్టారు. ఆలియా-రణ్‌బీర్‌ల తర్వాత పెళ్లి చేసుకునే కపుల్ వీళ్లేనంటూ బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ అందరికి షాక్ ఇస్తూ కియారా- సిద్దార్థ్‌లు విడిపోయినట్లు బాలీవుడ్ మీడియా వెల్లడించింది. -
బిగ్‌బాస్ షో తర్వాత మాకు బ్రేకప్ జరిగింది : నటి
టెలివిజన్ రంగంలో బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సహా అన్ని భాషల్లోనూ బిగ్‌బాస్ షోకు విపరీతమైన ప్రజాదరణ ఉంది. అయితే ఈ షోలో లవ్‌ట్రాక్‌లు ఉండటం చాలా కామన్. కానీ షో అయిపోయాక బ్రేకప్ చెప్పేసుకున్న జంటలు కూడా కామనే. తాజాగా మరో బిగ్‌బాస్ జంట విడిపోయింది. షో అనంతరం కూడా తమ బంధాన్ని కంటిన్యూ చేసిన ఓ కపుల్ ఆ తర్వాత మాత్రం తమ దారులు వేరంటూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తమిళ బిగ్‌బాస్ షోతో పాపులర్ అయిన జంటల్లో లోస్లియా- కవిన్ కూడా ఒకటి. తెరపై ఎంతో అన్యోనంగా కనిపించిన ఈ కపుల్ బ్రేకప్ చెప్పేసుకున్నారు. తాజాగా ఇదే అంశంపై లోస్లియా స్పందించింది. 'బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు నాకు, కవిన్‌కు మధ్య ఏదో తెలియని ఆకర్షణ(ప్రేమ)ఉన్న మాట నిజమే. షో తర్వాత కూడా కొంతకాలం మేం ప్రేమికులుగా కొనసాగాము. అయితే మా ఆలోచనలు, లక్ష్యాలు వేరువేరు అని తెలుసుకున్నాం. అందుకే వేర్వేరు మార్గాల్లో ప్రయాణం చేస్తున్నాయి. కవిన్‌తో నాకు ఎప్పుడే బ్రేకప్ జరిగిపోయింది'.. అంటూ లోస్లియా వెల్లడించింది. కాగా న్యూస్ రీడర్‌గా పాపులర్ అయిన లోస్లియా తమిళ బిగ్‌బాస్ సీజన్-3లో పాల్గొని మరింత గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుస అవకాశాలతో ఇప్పుడు సినిమాలు చేస్తోంది. -
ఏమిటేమిటి? ఈ మాత్రం దానికే విడిపోయారా?
హాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆండ్య్రూ గార్ఫీల్డ్, అలైసా మిల్లర్ బ్రేకప్ చెప్పుకున్నారు. క్షణం తీరికలేని పనిలో పడిపోయి కనీసం చూసుకోవడానికి కూడా కుదరకపోవడం వల్లే విడిపోతున్నట్లు తెలుస్తోంది.. కాగా గార్ ఫీల్డ్, మిల్లర్ గతేడాది నవంబర్‌లో ప్రేమలో పడగా ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరు తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టినట్లు సమాచారం. మొదట్లో ఎంతో అన్యోన్యంగా కలిసుకున్న వీరిద్దరి మధ్య కొంతకాలంగా బేధాభిప్రాయాలు తలెత్తాయట. అందులోనూ వరుస షెడ్యూల్స్‌తో ఒకరినొకరు కలుసుకునే అవకాశం కూడా రాకపోవడంతో ఇదే మంచి సమయం అని విడిపోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా 'స్పైడర్ మ్యాన్' నటుడు గార్ఫీల్డ్కు ఈ బ్రేకప్ కొత్తేమీ కాదు. హాలీవుడ్లో చాలామంది అమ్మాయిలతో డేటింగ్ చేసి ఆ తర్వాత సైడ్ అయిపోయేవాడు. అందులో స్పైడర్ మ్యాన్ కోస్టార్ ఎమ్మా స్టోన్, సింగర్ రీటా ఒరా వంటి సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మరోవైపు అమెరికన్ మోడల్ మిల్లర్ కూడా గతంలో జేక్ గిలెన్హాల్తో ప్రేమాయణం నడిపింది. ఆ తర్వాత సింగర్ క్యామ్ అవెరీని పెళ్లి చేసుకుని, కొంతకాలం పాటు కలిసున్నారని వదంతులు కూడా పుట్టుకొచ్చాయి. చదవండి: 2 పెళ్లిళ్లు.. 8వ సారి సంతానం.. 63 ఏళ్ల వయసు.. -
ప్రియుడితో బ్రేకప్ తర్వాత తొలిసారి పోస్ట్ చేసిన శ్రద్దా కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ బ్రేకప్ ఇప్పుడు బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నాలుగేళ్లుగా ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో ప్రేమలో మునిగి తేలుతున్న శ్రద్దా ఊహించని విధంగా బ్రేకప్ చెప్పేయడం ఆమె అభిమానులకు షాకింగ్‌గా అనిపింస్తుంది. బాలీవుడ్లో క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం ఏంటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీనిపై ఇంతవరకు వీరిద్దరు స్పందించకపోయినా వీరి బ్రేకప్ నిజమేనని బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది.చదవండి: ప్రియుడితో స్టార్ హీరోయిన్ బ్రేకప్!.. నాలుగేళ్ల బంధానికి ముగింపు గత నాలుగేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ ఊహించని విధంగా బ్రేకప్‌తో తమ లవ్‌స్టోరికి ఎండ్‌కార్డ్ వేసేశారు. గోవాలో జరిగిన శ్రద్దా కపూర్ బర్త్‌డే పార్టీ ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూర్చింది. కాగా సోషల్ మీడియాలో శ్రద్దా బ్రేకప్‌పై జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె తొలిసారిగా స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేస్తూ.. ఔర్ సునావో( ఇంకా వినిపించండి)అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సాహో చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరైన శ్రద్దా రణబీర్ కపూర్ సరసన ఓ సినిమా చేస్తుంది. వీటితో పాటు`చాల్ బాజ్`..`నాగిన్` లాంటి సినిమాలు చేతిలో ఉన్నాయి. చదవండి: 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్ వాడిన బైక్ కోసం అంత ఖర్చయిందా? -
ప్రియుడితో స్టార్ హీరోయిన్ బ్రేకప్!.. నాలుగేళ్ల బంధానికి ముగింపు
Shraddha Kapoor Rohan Shrestha Break Up: చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోవడం చూస్తుంటాం. ఇటీవలి కాలంలో బ్రేకప్ కహానీలు మరీ ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ప్రియుడికి బ్రేకప్ చెప్పేసింది. బాయ్‌ఫ్రెండ్ రోహన్ శ్రేష్టతో నాలుగేళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలుకుతూ అతడి నుంచి విడిపోయింది. దీనిపై ఇంతవరకు ఇద్దరూ స్పందించలేదు. గత కొన్నాళ్లుగా సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోషన్ శ్రేష్ట- శ్రద్దా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. పార్టీలు, పబ్‌లు, టూర్స్ అంటూ పలుమార్లు మీడియాకు చిక్కిన వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. అయితే అనూహ్యంగా నాలుగేళ్ల లవ్‌స్టోరీకి ఫుల్స్టాప్ పెట్టేశారు. అయితే విడిపోవడానికి గల కారణాలు ఏంటి అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఇటీవలె గోవాలో శ్రద్దాకపూర్ బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. స్నేహితుల,సన్నిహితులు అంతా హజరయ్యారు. కానీ ప్రియుడు రోహన్ మాత్రం హాజరు కాలేదు. సోషల్ మీడియాలో కూడా రోహాన్ బర్త్‌డే విషెస్ చెప్పలేదు. దీంతో వీరిద్దరి బ్రేకప్ నిజమేనని బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. -
మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో రెస్టారెంట్‌కు వెళ్లిన హీరోయిన్
బాలీవుడ్ మాజీ లవ్ బర్డ్స్ సుష్మితా సేన్- రోహ్మన్షా బ్రేకప్ తర్వాత తొలిసారిగా కలుసుకున్నారు. ముంబైలోని ఓ రెస్టారెంట్‌కి వెళ్లొస్తూ ఈ జంట మీడియా కంట పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇక సుష్మితా సేన్ కనపడగానే సెల్ఫీల కోసం అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో అక్కడే ఉన్న మాజీ ప్రియుడు రోహ్మన్ వారిన అడ్డుకొని సుష్మితకు బాడీగార్డ్‌లా నిలిచాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చాలా జాగ్రత్తగా ఆమెను కారు ఎక్కించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో వీరిద్దరూ మళ్లీ కలిసిపోయారా అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్లు ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా సుష్మిత తనకంటే 15 సంవత్సరాలు చిన్నవాడైన రోహ్మన్తో మూడేళ్లపాటు డేటింగ్ చేసింది. అయితే ఏమైందో తెలియదు కానీ తమ బంధం ముగిసిందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. -
మ్యూజిక్ డైరెక్టర్‌తో బ్రేకప్.. బయటపెట్టిన బిగ్‌బాస్ బ్యూటీ
Shree Rapaka Revealed About Her Break Up: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. 24గంటల ఎంటర్టైన్మెంట్తో కంటెస్టెంట్లు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఇటీవలె బిగ్‌బాస్ ఓటీటీలో రెండోవారం ఎలిమినేట్ అయి బయటికొచ్చిన శ్రీ రాపాక తాజాగా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె గతంలో ఓ మ్యూజిక్ డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. 'బిగ్‌బాస్‌లో నా లవ్‌స్టోరీ గురించి చెప్పాను. దాన్ని లవ్ ఫెయిల్యూర్ అని అనను. ఎందుకంటే, ఇద్దరం ఒకే ఫీల్డ్‌లో ఉండే సెట్ అవుతుందనుకున్నా కానీ అదే దెబ్బ కొట్టింది. మేం పెద్దగా గొడవ పడింది లేదు. విడిపోవాలని అనుకోలేదు. కానీ తెలియకుండానే మా మధ్య గ్యాప్ వచ్చింది. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. దాదాపు రెండేళ్లు అవుతుంది. తను కాల్ చేయడు, నేనూ చేయను. అతను ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికీ 4 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అతని తర్వాత నేను కూడా ఎవరిని లవ్ చేయలేదు. ఇక పెళ్లి విషయానికి వస్తే.. నన్ను కమాండ్ చేసే అబ్బాయే నాకు భర్తగా కావాలి. అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా. కమాండ్ చేసే మగాడు ఉంటేనే లైఫ్ కొత్తగా అనిపిస్తుంది.. ఆ కొత్తలో లైఫ్ బోర్ కొట్టదు. నేను ప్రేమను ఇస్తా.. ఆ ప్రేమను తిరిగి ఇస్తే చాలు' అంటూ తన మనసులో మాటను బయటపెట్టేసింది. -
'ఆ హీరోయిన్‌తో బ్రేకప్ తర్వాత కనుమరుగైపోయాను'
Amy Jackson: 'ఏక్ దీవానా తా' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు ప్రతీక్ బాబర్. ఇందులో 'రోబో'[ బ్యూటీ అమీ జాక్సన్ హీరోయిన్గా నటించింది. ఆన్‌స్క్రీన్ మీద ఈ జంటను చూసి ముచ్చటపడిపోయారు అభిమానులు. ఆఫ్‌స్క్రీన్‌లోనూ వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు, 2012లో డేటింగ్ మొదలుపెట్టారు. కానీ వీరి ప్రేమ ఎక్కువకాలం నిలవలేదు. కొంతకాలానికే ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుని ఎవరిదారి వారు చూసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రతీక్ బాబర్ మాట్లాడుతూ.. అమీ జాక్సన్‌తో బ్రేకప్ తర్వాత తన జీవితంలో బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని పేర్కొన్నాడు. 25 ఏళ్ల వయసులో లవ్ ఫెయిల్యూర్ కావడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయానన్నాడు. ఆ తర్వాత కనుమరుగైపోయానని తెలిపాడు. కాగా అతడు ఓ ముఖ్యపాత్రలో నటించిన తాజా చిత్రం 'బచ్చన్ పాండే' మార్చి 18న విడుదలవుతోంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా గురించి ప్రతీక్ మాట్లాడుతూ.. టీనేజీలో ఉన్నప్పుడు అక్షయ్, అర్షద్ వార్సి తన ఫేవరెట్ హీరోలని చెప్పుకొచ్చాడు. చదవండి: జనం పిచ్చోళ్లు కాదు నిన్ను నమ్మడానికి.. హీరోయిన్‌పై ట్రోలింగ్ -
బిగ్‌బాస్ కంటెస్టెంట్‌తో బ్రేకప్ వార్తలపై స్పందించిన షమితా శెట్టి
బిగ్‌బాస్ రియాలిటీ షోతో ఎంతోమంది కపుల్స్‌గా ఫేమస్ అయిన వాళ్లు ఉన్నారు. బిగ్‌బాస్ షోలో లవ్ ట్రాక్‌లు కామనే. ఆ తర్వాత ఎవరిదారులు ఎవరు చూసుకునే జంటల్ని కూడా చూస్తుంటాం. అయితే చాలా కొద్ది మంది మాత్రమే బిగ్‌బాస్ తర్వాత కూడా తమ బంధాన్ని కొనసాగిస్తారు. అలాంటి జోడీనే షమితా శెట్టి- రాకేశ్ బాపత్. బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి చెల్లెలిగానే పరిచయం ఉన్న షమితా బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక బిగ్బాస్లోషమితా-రాకేశ్‌ల ప్రేమాయణం షో మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. బిగ్‌బాస్ అనంతరం కూడా వీరు రిలేషన్లో ఉన్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు బీటౌన్‌లో ప్రచారం కూడా జరుగుతుంది. ఇలాంటి తరుణంగా అనూహ్యంగా షమితా-రాకేశ్‌లు విడిపోయారంటూ బీటౌన్‌లో వార్తలు గుప్పుమన్నాయి. మనస్పర్థల కారణంగా బ్రేకప్ చెప్పేసుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై స్పందించిన షమితా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఇందులో ఎటువంటి నిజం లేలు. పుకార్లను నమ్మవద్దని కోరుకుంటున్నాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేసింది. అనంతరం రాకేశ్ కూడా ఇదే పోస్ట్‌ను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. దీంతో షమితా-రాకేశ్‌ల బ్రేకప్ న్యూస్‌కి తెరపడినట్లయ్యింది. -
నడిరోడ్డు మీద కొట్టుకున్న దీపికా ఎక్స్ బాయ్‌ఫ్రెండ్స్!
దీపికా పదుకొణె రణ్‌బీర్ కంటే ముందు నిహార్ పాండ్యేను ప్రేమించింది. అయితే కొన్ని కారణాలతో వీరి విడిపోయారు. ఆ తర్వాత దీపిక రణ్‌బీర్ ప్రేమలో పడిపోయింది. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగేవారు. అయితే రణ్‌బీర్‌తో డేటింగ్ చేసే సమయంలోనే ఆమె తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ నిహార్ పాండేతోనూ చనువుగా ఉన్నట్లు రణ్‌బీర్‌కు తెలిసిందట. ఓ సినిమా షూటింగ్ కోసం రణ్‌బీర్ ఊటీకి వెళ్లినప్పుడు దీపికా నిహార్‌తో లంచ్డేట్కి వెళ్లిందని, దాదాపు రెండు గంటల పాటు వీరి డేట్ జరిగిందని సమాచారం. మరోసారి దీపికా, నిహార్‌లు కలిసి వెళ్తున్నప్పుడు రణ్‌బీర్ వాళ్లను చూసి నిహార్‌తో గొడవకు దిగాడట. ఈ క్రమంలో ఇద్దరూ నడిరోడ్డుమీదే కొట్టుకున్నారట. నిహార్ విషయంలో రణ్‌బీర్ ఎప్పుడూ అభద్రతా భావంలోనే ఉండేవాడని సన్నిహిత వర్గాల సమాచారం. మరోవైపు రణ్‌బీర్ కూడా దీపికాతో లవ్‌లో ఉన్నప్పుడే కత్రినాతో కూడా డేటింగ్ చేశాడని, ఓసారి వీరిద్దరి దీపికా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందని బీటౌన్ టాక్. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇద్దరి మధ్యా దూరం పెరిగి తమ ప్రేమకు గుడ్‌బై చెప్పేసుకున్నారు. దీపికాతో విడిపోయాక కత్రినా కైఫ్‌తో రణ్‌బీర్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. కానీ ఆ తర్వాత కత్రినాకు కూడా బ్రేకప్ చెప్పి ప్రస్తుతం ఆలియాతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. అటు దీపికా రణ్వీర్ సింగ్‌ను వివాహమాడితే, ఆమె ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ నిహార్ కూడా సింగర్ నీతి మోహన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. -
మా నవ్వు వెనుక ఉన్న కన్నీళ్లు..
-
రాకీ జోర్దాన్‌తో ఉన్న రిలేషన్‌పై సుప్రీత ఓపెన్ అప్
Supritha And Rocky Jordan Exclusive Interview: క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి కూతురు సుప్రితకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తల్లితో కలిసి సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు. గ్లామరస్ ఫోటోలతో తల్లీ కూతుళ్లు తెగ హంగామా చేస్తుంటారు. ఇక రీసెంట్‌గానే సుప్రిత మరో అడుగు ముందుకేసి తల్లి బాటలోనే యాక్టింగ్ వైపు మొగ్గు చూపింది. అయితే సినిమాల్లో కాకుండా ముందు ఆమె ఓ మ్యూజిక్ వీడియోలో నటించిన సంగతి తెలిసిందే. ఇద్దరు ప్రేమికుల మధ్య ఎమోషన్స్‌ను తెలియజేసే ‘వెళ్ళి పో’అనే మ్యూజిక్ వీడియో చేసిన సుప్రిత ఈ సందర్భంగా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ సాంగ్‌లో ఎమోషన్ పండించడానికి తన జీవితంలో జరిగిన చేదు సంఘటల్ని గుర్తు చేసుకున్నానని తెలిపింది. ఇక తన లైఫ్‌లో హగ్గులు, కిస్సులు ఎప్పుడూ అవ్వలేదని, మ్యూజిక్ వీడియోకి ముందు తానే షేర్ చేసిన పోస్ట్‌తో తన తల్లి సురేఖవాణికి వాళ్ల దగ్గరి నుంచి కాల్స్ వచ్చాయని పేర్కొంది.మరి వాళ్లు ఎవరెవరు? మ్యూజిక్ వీడియోకి, రాకీ జోర్దాన్‌తో ఉన్న రిలేషన్‌కి సంబంధం ఏంటి అన్నది తెలియాలంటే ఫుల్ వీడియో చూడాల్సిందే. View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) -
మా బ్రేకప్‌కు చాలా కారణాలున్నాయి, సిరి వల్ల కాదు: షణ్ముక్
బిగ్‌బాస్ 5 సీజన్ తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ జీవితమే మారిపోయింది. హౌజ్ నుంచి బయటకు వచ్చిన ఆనంతరం మిగతా కంటెస్టెంట్స్ కంటే షణ్ముఖ్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. దానికి కారణంగా తన ప్రియురాలు దీప్తి సునయనతో విడిపోవడమే. ఎన్నో ఆశలతో, ఉత్సహంతో మూడు నెలల అనంతరం బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు షణ్ముఖ్‌కు దీప్తి బ్రేకప్ చెప్పి షాకిచ్చింది. ఇక అప్పటి నుంచి వీరి గరించిన రకారకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు షణ్ముక్ మై లవ్ ఈజ్ గాన్ అంటూ ఇన్‌స్టాలో బ్రేకప్ పోస్టులు, ఎమోజీలు పెడుతూ ఒంటరిగా గడిపేస్తున్నాడు. ఇక వీరి బ్రేకప్‌కు అందరూ సిరి కారణమని, ఆమెతో అతి సన్నిహితమే అతడి కొంప ముంచిందని ఫిక్స్ అయ్యారు. అయితే తమ బ్రేకప్‌కు కారణం సిరి కాదని, దానికి మరో రీజన్ ఉందంటూ ఆసక్తి కామెంట్స్ చేశాడు షణ్నూ. వాలంటైన్స్ డే సందర్భంగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా షణ్ను మాట్లాడుతూ.. ‘మా ఇద్దరి బ్రేకప్ సిరి కారణం కాదు. చెప్పాలంటే సిరి, దీప్తి ఎప్పటికి మంచి స్నేహితులే. మేం విడిపోవడానికి చాలా కారణాలున్నాయి. నా వల్ల దీప్తి ఎంతో నెగిటివిటీని ఎదుర్కొంది. నెటిజన్లు నన్ను ట్రోల్ చేస్తున్నప్పుడు తను నాకు సపోర్ట్ చేసింది. అయితే సిరితో చనువుగా ఉండడం నెటిజన్లతో పాటు దీప్తి కుటుంబానికి కూడా నచ్చలేదు. దీంతో తన కుటుంబం నుంచి ఆమెకు ఒత్తిడి పెరిగింది. ఇకనైన తను సంతోషంగా ఉండాలనే ఉద్ధేశంతోనే బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మేము మా కెరీర్ పై దృష్టి పెట్టాం… మేము మళ్లీ కలుస్తామా ? లేదా ? అనేది దేవుడి చేతుల్లో ఉంది. విధి మా జీవితాల్లో ఏది రాస్తే అదే జరుగుతుందని నమ్ముతున్నాను.. మా బ్రేకప్ గురించి సిరిని నిందించడం సరైనది కాదు..తప్పు నాదే అందుకు నన్ను నిందించాలి’ అంటూ షణ్నూ చెప్పుకొచ్చాడు. అంతేగాక ‘ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికే బిగ్‌బాస్ హౌజ్‌కు వచ్చాను. నిజం చెప్పాలంటే నా మూడీ పర్సన్‌కు బిగ్‌బాస్ కరెక్ట్ కాదు. నేను ఇతరులతో తక్కువగా మాట్లాడతాను. నా గురించి పాజిటివ్ ఆలోచిస్తారు అనుకున్నా.. కానీ షో నుంచి బయటకు వచ్చాక నాపై ఎంత నెగిటివిటీ వచ్చిందో అర్థమైంది. నేను 27 సంవత్సరాల వయసులోనే ఎన్నో ఎదురుదెబ్బలు చూశాను. వీటివలన ఇంకా జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి అనేది నేర్చుకుంటున్నాను’ అన్నాడు. ఇక ‘హౌజ్‌లో సిరికి నేను అండగా ఉన్నాను. ఇంటి సభ్యులు సిరిని ఎమైనా అంటే తనకు సపోర్ట్ ఇచ్చాను. కానీ అవన్నీ వదిలేసి సిరి వాళ్లమ్మ నన్ను తనను తప్పుగా అర్థం చేసుకోవడం బాధించింది’ అని పేర్కొన్నాడు. -
బ్రేకప్‌కు ఎండ్ కార్డ్.. మళ్లీ కలిసిపోయిన సిరి-శ్రీహాన్
Siri Hanmanth And Shrihan Patchup After Bigg Boss: బిగ్‌బాస్ సీజన్-5 ఎఫెక్ట్ రెండు జంటల మధ్య చిచ్చు రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీప్తి సునయన షణ్ముక్‌కి బ్రేకప్ చెప్పేసింది. తమ దారులు వేరంటూ 5ఏళ్ల బంధానికి ముగింపు పలికింది. అటు శ్రీహాన్ కూడా సిరి ఫోటోలు డిలీట్ చేయడంతో అతను కూడా దీప్తి సునయనను ఫాలో అయినట్లు అందరూ అనుకున్నారు. దీంతో అతడు కూడా త్వరలోనే సిరికి బ్రేకప్ చెప్తాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనంతటిని పటాపంచలు చేస్తూ సిరి-శ్రీహాన్‌లు కలిసిపోయారు. రీసెంట్గా హైదరాబాద్ వచ్చిన వీరిద్దరు యాంకర్ రవి ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు. అనంతరం వాళ్ల ఫ్యామిలీతో కలిసి ఫోటోలు దిగి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను యాంకర్ రవి భార్య నిత్య సక్సేనా తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది. మీ ఇద్దరినీ కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది అంటూ పోస్ట్ చేసింది. దీంతో సిరి-శ్రీహాన్‌ల బ్రేకప్‌కు ఎండ్ కార్డ్ పడినట్లయ్యింది. ఏది ఏమైనా ఎన్ని కలతలు వచ్చినా బిగ్‌బాస్ తర్వాత మీరిద్దరు కలవడం సంతోషంగా ఉందంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీప్తి సునయన- షణ్నూలు కూడా కలిసిపోతే బావుండు అని కోరుకుంటున్నారు. -
విడాకులకు సిద్ధమైన బిగ్‌బాస్ నటి హిమజ అంటూ పుకార్లు
Breakup Rumors On Bigg Boss Fame Himaja Reddy: గ్లామర్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. ఇటీవలి కాలంలో బాలీవుడ్, కోలీవుడ్ సహా టాలీవుడ్‌లోనూ ఈ ధోరణి పెరిగిపోయింది. ఇప్పటివరకు నాగ చైతన్య-సమంత, అమీర్ ఖాన్-కిరణ్ రావు, ధనుష్-ఐశ్వర్యల విడాకులు ఇండస్ట్రీని ఊపేసాయి. తాజాగా మరో నటి కూడా భర్తకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. బిగ్‌బాస్ రియాలిటీ షోతో పాపులర్ అయిన నటి హిమజ భర్త నుంచి త్వరలోనే విడిపోనుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి అసలు హిమజకు పెళ్లి అయ్యిందా లేదా అన్న విషయంపై ఇంతవరకు క్లారిటీ లేదు. ఎందుకంటే తన వివాహం, భర్త గురించి హిమజ బయట ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. కానీ ఆమెకు 2012లోనే రాజేష్ ఆనంద్ అనే వ్యాపారవేత్తతో పెళ్లయిందని గూగుల్‌లో సమాచారం ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల అతనితో విడిపోయిందని ఆ తర్వాత చల్లా విజయ్ రెడ్డి అనే వ్యక్తిని హిమజ పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పుడు అతనితో కూడా హిమజ తెగదెంపులు చేసుకుంటున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందన్నదానిపై హిమజ స్పందించాల్సి ఉంది. అంతేకాకుండా తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై ఫుల్స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
బ్రేకప్ చెప్పుకున్న లవ్‌బర్డ్స్!, క్లారిటీ ఇచ్చిన హీరో
Arjun Kapoor Clarity Over His Break Up With Malaika Arora!: బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ ప్రముఖ నటి మలైకా అరోరాతో కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మలైకాకు 48 ఏళ్లు కాగా.. అర్జున్ కపూర్‌కు 36 ఏళ్లు. అంటే వీరిద్దరి మధ్య 12 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. అర్జున్ సినిమాల పరంగా కంటే తనకన్నా వయసులో పెద్దదైన మలైకతో ప్రేమ వ్యవహరంతో కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అంతేకాదు ఆంటీతో డేటింగ్ ఏంటని కూడా తరచూ అతడు ట్రోల్స్ బారిన పడుతున్నాడు. చదవండి: Arjun Kapoor: ఆంటీతో డేటింగ్ అంటూ ట్రోల్స్, తొలిసారి ఘాటుగా స్పందించిన యంగ్ హీరో అయితే అవన్నీ చూసి చూడనంటూ వదిలేస్తన్నారు ఈ లవ్ బర్డ్స్. అంతేకాదు తమను ట్రోల్స్ చేస్తున్న వారికి.. ప్రేమతో వయసుకు సంబంధం లేదని, తమకు ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉందంటూ కౌంటర్‌గా కొటెషన్స్ చెప్పుకుంటు వస్తున్నారు ఈ జంట. ఇదిలా ఉంటే వీరిద్దరూ విడిపోయారంటూ, తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారంటూ బి-టౌన్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. చదవండి: సల్మాన్ ఖాన్‌తో సీక్రెట్ డేటింగ్, క్లారిటీ ఇచ్చిన నటి సమంత.. ఇంతకాలం ప్రేమ గురించి కవితలు, కొటెషన్స్ చెప్పుకొచ్చిన ఈ జంట కూడా అందరిలాగే విడిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో తమపై వచ్చిన తాజా రూమార్లకు చెక్ పెడుతూ అర్జున్ ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చాడు. మలైకాతో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసిన అర్జున్ కపూర్.. చెత్త పుకార్లకు చోటు లేదంటూ తేల్చి చెప్పాడు. ‘నీచమైన పుకార్లకు ఇక్కడ చోటు లేదు. సురక్షితంగా, సంతోషంగా ఉండండి. లవ్ యూ ఆల్’ అనే క్యాప్షన్‌తో రూమర్లకు స్పష్టత ఇచ్చాడు అర్జున్ కపూర్. View this post on Instagram A post shared by Arjun Kapoor (@arjunkapoor) -
నాకు తండ్రి ప్రేమ ఉంది.. దీప్తి సునయన ఎమోషనల్ వీడియో
Deepthi Sunaina Shares Emotional Video With Her Father After Breakup With Shannu : దీప్తి సునయన-షణ్ముఖ్‌ల బ్రేకప్ స్టోరి ఇప్పటికీ నెట్టింట హాట్ టాపిక్‌గానే ఉంది. చూడచక్కనైన ఈ జంట విడిపోతారని ఎవరూ ఊహించలేదు. బిగ్‌బాస్ షోలో ఎన్ని ట్రోల్స్ వచ్చినా షణ్నూకు చివరిదాకా అండగా నిలబడ్డ దీప్తి.. అతని జీవితంలో మాత్రం చివరివరకు ఉండలేకపోయింది. బిగ్‌బాస్ షో అయిన వెంటనే షణ్నూకి బ్రేకప్ చెప్పేసి సైడయిపోయింది. తమ దారులు వేరంటూ 5ఏళ్ల రిలేషన్ షిప్‌కు గుడ్‌బై చెప్పేసింది. అయితే షణ్నూతో బ్రేకప్ తర్వాత ఆ బాధలోంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న దీప్తి సునయన ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సైతం తెగ యాక్టివ్‌గా కనిపిస్తుంది. తాజాగా తన తండ్రితో కలిసి ఓ వీడియోను షేర్ చేస్తూ... 'ఆమె ఒంటరి కాదు. ఆమె వెనుక అత్యంత శక్తివంతమైన శక్తి ఉంది. అతడే తండ్రి ప్రేమ అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం అత్యంత కష్టవంతమైన పరిస్థితులు ఎదురైనా తన తండ్రి ప్రేమతో దాన్ని జయిస్తానంటూ పరోక్షంగా చెప్పుకొచ్చింది. చదవండి: సిరి ఫోటోలు డిలీట్ చేసిన ప్రియుడు.. బ్రేకప్‌కు సంకేతమా? View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) -
హృదయం ముక్కలైపోయింది: షణ్నూ ఇన్‌స్టా పోస్ట్..
Shanmukh Posts Heart Broken Emoji After Deepthi Sunaina Live Chat: దీప్తి సునయన- షణ్ముఖ్ బ్రేకప్ విషయం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. 5ఏళ్లు రిలేషన్ షిప్లో ఉన్న ఈ జంట బిగ్‌బాస్ ఎఫెక్ట్‌తో విడిపోతారని ఎవరూ ఊహించలేదు. కానీ తమ దారులు వేరంటూ షణ్ముఖ్‌తో దీప్తి సునయన తెగదెంపులు చేసుకుంది. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానంటూ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది. తాజాగా బ్రేకప్ అనంతరం తొలిసారి అభిమానులతో ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన దీప్తి సునయన ఎంతో ఎమోషనల్ అయ్యింది. ఇన్నేళ్లలో తన లైఫ్ గురించి, కెరీర్ గురించి ఏనాడూ ఆలోచించలేదని, ఇకపై వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను అంటూ లైవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం అకస్మాత్తుగా లైవ్ నుంచి వెళ్లిపోయింది. అయితే దీప్తి లైవ్ చాట్ తర్వాత కాసేపటికే షణ్ముఖ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేస్తూ.. హృదయం ముక్కలైపోయిన ఎమోజీలను జత చేశాడు. ప్రస్తుతం షణ్నూ షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. మరోవైపు ఇలాంటి కష్ట సమయంలో మేం అండగా ఉంటాం అంటూ షణ్ముఖ్ ఫ్యాన్స్ అతనికి సపోర్ట్‌గా పోస్టులు పెడుతున్నారు. చదవండి: Shrihan: బిగ్‌బాస్ రేపిన చిచ్చు.. సిరి-శ్రీహాన్ కూడా విడిపోతారా? రౌడీ హీరో విజయ్‌తో రష్మిక డేటింగ్? లీకైన ఫోటోలు View this post on Instagram A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7) -
వైరల్‌గా మారిన సిరి బాయ్‌ఫ్రెండ్ ఇన్‌స్టా పోస్ట్..
Shrihan Emotional Intsgram Post Amids Break Up Rumours With Siri: బిగ్‌బాస్ షోతో కొందరు ఓవర్ నైట్ స్టార్స్ అయితే, మరికొందరు మాత్రం ఇమేజ్ డ్యామేజ్ చేసుకొని బయటకు వస్తారు. తాజాగా బిగ్‌బాస్ సీజన్-5లో సిరి-షణ్ముఖ్‌లు కూడా ఈ విధంగానే నెగిటివిటీ మూటగట్టుకున్నారు. ఫలితంగా తమ ఐదేళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలుకుతూ దీప్తి సునయన షణ్ముఖ్‌తో విడిపోయింది. ఇక కలిసుండలేనంటూ తెగదెంపులు చేసుకుంది. ఇక అప్పటినుంచి శ్రీహాన్ కూడా త్వరలోనే సిరికి బ్రేకప్ చెప్పేస్తాడంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరి ఇన్‌స్టా అకౌంట్లపై ఫోకస్ పెరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం(జనవరి3)న సిరి బర్త్‌డే సందర్భంగా శ్రీహాన్ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసుకున్నాడు. హ్యాపీ బర్త్‌డే సిరి.. ఈ సంవత్సరం పాజిటివ్ వైబ్స్‌తో నీ జీవితం సాగాలని ఆశిస్తున్నా. నీ లక్ష్యాలను త్వరలోనే సాధిస్తావ్. గాడ్ బ్లస్ యూ అంటూ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. కాగా బిగ్‌బాస్‌లో సిరిని ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా ఆమె గెలుపు కోసం చివరి వరకు సపోర్ట్ చేస్తూ వచ్చిన శ్రీహాన్.. బిగ్‌బాస్ తర్వాత మాత్రం సిరితో కలిసి ఎక్కడా కనిపించలేదు. దీంతో దీప్తి- షణ్ముక్‌ల మాదిరిగానే వీళ్లు కూడా విడిపోతారా అనే ఊహాగానాల నేపథ్యంలో శ్రీహాన్ ఇన్‌స్టా పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. -
షణ్నూతో బ్రేకప్.. లైవ్‌లో ఏడ్చేసిన దీప్తి సునయన
Bigg Boss 5 Telugu, Deepthi Sunania: బిగ్‌బాస్ షో అనంతరం షణ్ముఖ్ జశ్వంత్ ఎక్కడికి వెళ్లినా అతడి ప్రియురాలు దీప్తి సునయన గురించే ఆరా తీశారు అభిమానులు. ఎప్పుడు కలుస్తారు? పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? ఇద్దరూ కలిసి ఏవైనా సాంగ్స్ తీస్తున్నారా? అని వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి షణ్నూ త్వరలోనే దీపూను కలుస్తానని అప్పటిదాకా వెయిట్ చేయండని చెప్పాడు. కానీ న్యూ ఇయర్ రోజు ఈ జంట తమ ఐదేళ్ల రిలేషన్‌కు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు పెద్ద షాకిచ్చారు. బ్రేకప్ తర్వాత దీప్తి సునయన తొలిసారిగా ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చింది. 'నా లైఫ్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. ఇన్నేళ్లలో నా లైఫ్ గురించి, కెరీర్ గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఇప్పుడు వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. ఇకపై నా గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నాను' అని చెప్తూ దీప్తి తన కన్నీళ్లను ఆపుకునే ప్రయత్నం చేసింది. -
'బ్రేకప్‌కి కారణం నేను కాదు..ఇలా జరుగుతుందనుకోలేదు' సిరి ఎమోషనల్!..
Bigg Boss 5 Siri First Reaction After Shannu Deepthi Sunaina Break Up: సోషల్ మీడియా స్టార్స్ షణ్ముఖ్- దీప్తి సునయనల బ్రేకప్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. 5ఏళ్లుగా కలిసున్న వీళ్లు ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడం ఏంటని వారి ఫ్యాన్స్ షాకవుతున్నారు. బిగ్‌బాస్ ఫినాలే వరకు షణ్నూకు సపోర్ట్ అందిస్తూ వచ్చిన దీప్తి సునయన బిగ్‌బాస్ షో ముగిశాక ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ కొన్ని రోజులుగా మాత్రం తన సోషల్ మీడియా అకౌంట్లలో మార్పు తప్పదు అంటూ బ్రేకప్‌కి సంబంధించిన హింట్స్ ఇస్తూ వచ్చింది. తాజాగా న్యూఇయర్‌కి ఒకరోజు ముందుగా షణ్ముఖ్‌తో విడిపోతున్నట్లు ఇన్‌స్టా వేదికగా ప్రకటించింది. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. అయితే సిరి కారణంగానే షణ్నూ-దీప్తి సునయన విడిపోయారంటూ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి సిరిని టార్గెట్ చేస్తూ నెట్టింట ట్రోలింగ్‌కు దిగారు. తాజాగా షణ్నూ- దీప్తి సునయన బ్రేకప్ అనంతరం సిరి తొలిసారిగా స్పందించింది. 'ఎవరైనా మీ దగ్గరికి వచ్చి.. మీ జీవితం చాలా కఠినంగా ఉందే అని కామెంట్స్ చేస్తే.. వాటికంటే నేను మరింత స్ట్రాంగ్ అని చిరునవ్వుతో సమాధానం చెప్పండి' అంటూప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మునిబా మజారి చెప్పిన కోట్స్‌ని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీన్ని బట్టి.. పరోక్షంగా షణ్నూని స్ట్రాంగ్‌గా ఉండమని సలహా ఇస్తుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వీరి బ్రేకప్‌కి కారణం 'నేను కాదు..ఇలా జరుగుతుందనుకోలేదంటూ' సిరి తన సన్నిహితులతో చెబుతూ ఎమోషనల్ అయినట్లు సమాచారం. -
బ్రేకప్‌పై తొలిసారి స్పందించిన షణ్ముఖ్.. పోస్ట్ వైరల్
Shanmukh First Reaction On Breakup With Deepthi Sunaina: కొత్త సంవత్సరంలో అభిమానులకు షాక్ ఇస్తూ దీప్తి సునయన షణ్ముఖ్‌తో బ్రేకప్ చెప్పేసుకుంది. 5ఏళ్ల తమ బంధాన్ని తెంచేసుకుంటూ సోషల్ మీడియాలో సుధీర్ఘ పోస్ట్ పెట్టింది. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ దీప్తి సునయన మా దారులు వేరంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. కానీ షణ్ముక్ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా తమ బ్రేకప్‌పై తొలిసారిగా షణ్ముక్ స్పందించాడు. 'ఆమెకు నిర్ణయం తీసుకునే హక్కుంది. తను ఇప్పటివరకు చాలా ఫేస్ చేసింది. ఇప్పటికైనా ఆమె సంతోషంగా, పీస్‌ఫుల్‌గా ఉండాలని నేను కోరుకుంటున్నా. మా దారులు వేరైనా స్నేహితులుగా కలిసుంటాం. నేను బెటర్ పర్సన్ అయ్యేందుకు ఈ 5 సంవత్సరాలు నువ్వు అందించిన సహాయానికి ధన్యవాదాలు. నువ్వు సంతోషంగా ఉండాలి. ఆల్ ది బెస్ట్ దీపూ'.. అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం షణ్నూ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ బ్రేకప్‌కి ప్రధానంగా బిగ్‌బాస్ కారణమని తెలుస్తుంది. షణ్నూ సిరితో క్లోజ్‌గా ఉండటం, ఫ్రెండిప్ అంటూనే వీరిద్దరు చేసిన అతి చాలామందికి నచ్చలేదు. స్వయంగా సిరి వాళ్ల మథర్ హౌస్‌లోకి వచ్చి హగ్గులు నచ్చలేదని, తీరు మార్చుకోలేదని చెప్పినా వీరు మాత్రం తమకు నచ్చినట్లే ఉన్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌కి నుంచి యూత్‌కి సైతం వీరి ప్రవర్తన నచ్చలేదు. సిరి-షణ్నూల తీరుతో అటు దీప్తి సునయన, శ్రీహాన్ సైతం ట్రోలింగ్‌ని ఎదుర్కున్నారు. -
దీప్తి సునయన బ్లాక్ చేసింది.. అప్పటివరకు వదలను: షణ్నూ
Shanmukh Comments On Deepthi Sunaina And Siri In Live Chat: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్.(షణ్నూ). అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ సీజన్-5లో ఎంట్రీ ఇచ్చి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. అయితే సిరితో రిలేషన్, పదేపదే హగ్గులతో విపరీతమైన నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. ఫలితంగా కప్పు చేజార్చుకొని రన్నరప్‌గా నిలిచాడు. హౌస్‌లోకి వచ్చే ముందే సిరికి శ్రీహాన్‌తో ఎంగేజ్మెంట్ జరగడం, షణ్నూ, దీప్తి సునయనతో రిలేషన్ షిప్లో ఉండటంతో వీరి రిలేషన్ ఆడియెన్స్‌కు అంతగా రుచించలేదు. దీంతో సోషల్ మీడియాలో సిరి-షణ్నూలు విపరీతమైన ట్రోలింగ్ బారిన పడ్డారు. ఇటీవలె బిగ్‌బాస్ ముగియడంతో హౌస్ నుంచి బయటకు వచ్చిన షణ్నూ.. తాజాగా ఇన్‌స్టాలో లైవ్ సెషన్ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. దీప్తి సునయన గురించి ఎక్కువగా అడుగుండటంతో షణ్నూ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం తనని బ్లాక్ చేసిందని, దీంతో త్వరలోనే హైదరాబాద్ వెళ్లి తనని కలుస్తానని చెప్పుకొచ్చాడు. దీపు నా వల్ల చాలా నెగిటివిటిని ఫేస్ చేసింది. అయనప్పటికీ నాకోసం నిలబడింది. తప్పకుండా వెళ్లి మాట్లాడతాను. ఇక తనతో బ్రేకప్ అయితే జరగదు. నా చేతి మీద ఉన్న పచ్చబొట్టు పోయేంత వరకు దీపును వదలను' అంటూ చెప్పుకొచ్చాడు. మరోవైపు సిరితో తన ఫ్రెండ్షిప్ సైతం కంటిన్యూ అవుతుందని, జెస్సీ, సిరిలు తన బెస్ట్‌ఫ్రెండ్స్ అని తెలిపాడు. -
ప్రియుడితో సుస్మితా సేన్ బ్రేకప్.. ఇంట్లోంచి వెళ్లిపోయిన ప్రియుడు!
మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్, బాయ్‌ఫ్రెండ్ కశ్మీరి మోడల్, బాలీవుడ్ నటుడు రోహ్మాన్ షాల్‌తో బ్రేకప్ చెప్పుకున్నట్లు బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. వయసులో తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన రోహ్మన్తో గత కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తూ, లివింగ్ రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్న సుస్మిత తాజాగా ఆ బంధానికి ముగింపు పలికినట్లు ఆంగ్ర పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఇద్దరూ తమ రిలేషన్‌ను బ్రేక్ చేసుకోవడంతో రోహ్మాన్ సుస్మితా ఇంటి నుంచి కూడా వెళ్లిపోయాడని సమాచారం. ప్రస్తుతం అతడు సన్నిహితుల ఇంట్లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సుస్మిత-రోహ్మాన్‌ల మధ్య ఈ ఏడాది నుంచే విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ తమ బంధానికి శాశ్వతంగా ముగింపు పలికినట్లు తెలుస్తుంది. దీనికి తోడు సుస్మితా వరుస ఇన్‌స్టా పోస్టులు కూడా ఇది నిజమే అన్నట్లు కనిపిస్తున్నాయి. బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అనంతరం తీవ్ర మనోవేదనతో కుంగిపోతున్న సుస్మితా..బాధ నుంచి బయటపడేందుకు ఇదే సరైన వైద్యం అంటూ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసుకుంది. దీంతో రోహ్మాన్తో బ్రేకప్ నిజమేనని బాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
చివరి బ్రేకప్ నా హృదయాన్ని కదిలించింది: దంగల్ నటి
Sanya Malhotra About Her Last Break 4 Years Love: ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దంగల్’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సన్యా మల్హోత్రా. ఈ క్రమంలో సన్యాకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో ఆమె సినిమాలు, షోలు చేస్తూ కెరీర్లో ముందుకు సాగుతోంది. సినిమాలే కాకుండా అప్పుడప్పుడ సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్యా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ మేరకు సన్యా మాట్లాడుతూ తన చివరి బ్రేకప్‌కు సంబంధించిన చేదు అనుభవాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యింది. నాలుగేళ్ల రిలేషన్ బ్రేకప్ అనంతరం తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని, డిప్రెషన్ నుంచి బయట పడేందుకు మెంటల్ హెల్త్‌పై ఫోకస్ పెట్టడం నేర్చుకున్నానని చెప్పింది. 2020 అందరికి చేదు అనుభవం ఇస్తే నాకు మాత్రం మంచి ఏడాదిగా మిగిలిపోయిందంటూ సన్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఢిల్లీలో ఉన్నప్పుడు ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డాను. నాలుగేళ్ల లాంగ్ రిలేషన్, చివరికి బ్రేకప్, ఈ ప్రేమ తాలుకు జ్ఞాపకాలు నా హృదయాన్ని కదిలించాయి. విడిపోవడం అనేది అన్నింటికంటే ఎక్కువగా బాధించే విషయం అది. కానీ మనల్ని వద్దనుకునే వారి కోసం ఎంత బాధపడిన అది వృధానే. అందుకే నా మీద నేను ఫోకస్ పెట్టడం మొదలు పెట్టాను. ఈ 4 సంవత్సరాల సుదీర్ఘమైన, సుదూర బంధం ముగిసిన వెంటనే లాక్డౌన్ విధించారు. ఆ తర్వాత నేను ముంబైలో ఒంటరిగా ఉన్నా. కానీ కొన్ని విషయాలు ఎందుకు వర్కవుట్ కావో తెలుసుకోవడానికి సమయం తీసుకున్నా. నా మీద నేను ఫోకస్ పెట్టాలనుకున్నా.. 2020 నాకు మంచి సంవత్సరం, రిలాక్సేషన్ దొరికింది. ప్రేమ అనేది సెల్ఫ్ లవ్ కంటే ముఖ్యమైనది కాదనే సత్యాన్ని గ్రహించాను’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే తను ప్రేమించిన వ్యక్తి ఎవరనేది మాత్ర సన్యా వెల్లడించలేదు. -
సల్మాన్‌తో డేటింగ్..అజహరుద్దీన్‌తో పెళ్లి.. చివరకు బ్రేకప్
అజహరుద్దీన్.. క్రికెట్లో ఓ కొత్త చరిత్ర! సంగీతా బిజ్లానీ.. బాలీవుడ్ తెర మీద మెరిసిన ఒక కొత్త మోడల్! ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటికే అజహర్ వివాహితుడు.. ఇద్దరు పిల్లల తండ్రి కూడా. సంగీతా బిజ్లానీది శుభలేఖల దగ్గరే ఆగిపోయిన పెళ్లి. ఆ విరిగిన మనసుకు మళ్లీ ప్రేమతో సాంత్వననిచ్చాడు అజహర్. అదీ శుభం కార్డ్ వేసుకోలేకపోయింది. క్రికెటర్ అజహర్ కంటే ముందు సంగీతా జీవితంలో నటుడు సల్మాన్ ఖాన్ ఉన్నాడు తన ప్రేమ వర్తమానాన్ని అందించి. కెరీర్లో సల్మాన్ కంటే సంగీతానే సీనియర్. ఆమె అందమో.. అభినయమో.. సల్మాన్‌ను ఆకట్టుకుంది. సంగీతా అంటే ఇష్టం ఏర్పడింది. అదే విషయం ఆమెతో చెప్పాడు. ఆశ్చర్యపోయింది. ‘నువ్వంటే నాకిష్టం.. ఒట్టు.. నన్ను నమ్ము’ అన్నాడు అతను. ఆ అభ్యర్థనలో నిజాయితీ కనిపించింది.. వినిపించింది. ‘సరే’ అంది మది నిండా నమ్మకాన్ని నింపుకుంటూ.. కళ్లతో ప్రేమను కురిపిస్తూ! అలా ఆరంభమైన ఆ డేట్ దాదాపు పదేళ్లు కొనసాగింది. ఆ విషయం బాలీవుడ్లో వార్తవడమూ.. దాన్ని సినిమా పత్రికలు మోయడమూ సాధారణమే కదా! నిశ్చితార్థం జరిగింది.. కానీ సల్మాన్ మరో అమ్మాయితో.. వాళ్ల ప్రేమ... పెళ్లి ప్రస్తావననూ తెచ్చింది. దానికి నిశ్చితార్థమూ జరిగింది. శుభలేఖలూ అచ్చయ్యాయట. మరి పెళ్లి సందడి మొదలవలేదు ఎందుకు?సంగీతాను కాదని సల్మాన్ ఇంకో అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఆ నిజం సంగీతాకు చెప్పే ధైర్యం చేయలేదు. ఆమెకు తెలియకుండా జాగ్రత్తపడే ప్రయత్నం చేశాడు. కానీ అనుకోకుండా ఆ అమ్మాయితో సంగీతా కంటపడ్డాడు. ‘నా పట్ల నీ ప్రేమ నిజమని నమ్మమన్నావ్?’ కళ్లతోనే నిలదీసింది సంగీతా. సమాధానం లేక తలవంచుకున్నాడు సల్మాన్. అందుకే ఆ పెళ్లి పీటలెక్కలేదు. సల్మాన్ నమ్మకద్రోహాన్ని తట్టుకోలేకపోయింది సంగీతా. ఇద్దరు పిల్లల తండ్రితో సంగీత.. ప్రేమను వెతుక్కుంది ఆ సమయంలోనే అజహరుద్దీన్‌తో ఓ యాడ్ షూట్ చేస్తోంది సంగీతా. తొలిచూపులోనే ఆమెకు ఫిదా అయిపోయాడు అజహర్. ప్రణయంతోనే మొదలైంది ఆ పరిచయం. దాంతో ఆ యాడ్ షూటింగ్ అయిపోయాకా కలుసుకోవడం మొదలుపెట్టారు ఇద్దరూ. ఏ సినిమా ఈవెంట్‌కైనా అజహర్తోనే హాజరవ సాగింది సంగీతా. అజహర్ కూడా సంగీతా తోడు లేనిదే.. రానిదే పేజ్ త్రీ పార్టీకి అటెండ్ అయ్యేవాడు కాదు. లైఫ్ స్టయిల్ కాలమ్స్ అన్నీ వాళ్ల కబుర్లతోనే కడుపునింపుకొనేవని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా! అయితే.. అప్పటికే అజహరుద్దీన్‌కు పెళ్లయి, ఇద్దరు పిల్లల కూడా ఉండడంతో ఆ ప్రేమ వివాదాస్పదంగా మారింది. భార్యకు తలాక్ చెప్పి..సంగీత చేయి అందుకున్నాడు అజహర్ భార్య నౌరీన్‌కు మనస్తాపాన్ని కలిగించింది. కానీ సంగీతా పట్ల తన ప్రేమ విషయంలో అజహర్ మాత్రం ఒక స్పష్టతతోనే ఉన్నాడు. తతిమా జీవితాన్ని ఆమెతోనే పంచుకోవాలనుకున్నాడు. ఆ నిజాన్నే నౌరీన్‌కు చెప్పాడు. బాధపడింది. ఏడ్చి, ఏడిపించి ప్రేమను లాక్కోలేమని గ్రహించింది నౌరీన్. అజహర్ తలాక్ ప్రపోజల్‌ను మన్నించింది. అతని వైవాహిక జీవితంలోంచి పక్కకు తప్పుకుంది. సంగీతా చేయి అందుకున్నాడు అజహర్.అప్పటి నుంచి అతని అడుగులో అడుగైంది సంగీతా. అతని కెరీర్ ఒడిదుడుకుల్లో కొండంత ధైర్యంగా నిలబడింది. అతని వ్యక్తిగత దుఃఖాలకు ఓదార్పుగా మారింది. అజహర్ చుట్టే ప్రపంచాన్ని అల్లుకుంది. అతని ఆనందానికి నిమిత్తమైంది. తన నిమిత్తంలేని అతని బాధను పంచుకుంది. అలా పద్నాలుగేళ్లు సాగింది వాళ్ల కాపురం. అదీ బ్రేక్ అయింది దానికీ కారణం నమ్మకద్రోహమే! నౌరీన్‌ను కాదని తనతో ప్రేమలో పడ్డట్టే తనను మరచి మరో అమ్మాయితో అజహర్ ప్రేమలో పడ్డాడని సంగీతా మనసులో బాధ. అది అపోహ మాత్రమే అంటాడు అజహర్. ఎవరిది నిజమో.. ఎవరిది అపోహో ఆ ఆలుమగలకే తెలియాలి. ప్రేమ పంచాయతీకొచ్చిందనేది మాత్రం బయటవాళ్లెరిగిన సత్యం. ఎట్టకేలకు ఆ ప్రేమ విడాకులతో చిత్తగించింది. సంగీతా ఒంటరిగా మిగిలింది. తన బ్లాగ్ రచనలో తలమునకలైంది. ‘ప్రేమలో పడిన మాటను బయటకెవరూ చెప్పుకోరు కానీ నేను చెప్తున్నాను.. తొలిచూపులోనే సంగీతాతో ప్రేమలో పడ్డా. ఇది నిజం’ అని చెప్పాడు అజహరుద్దీన్ ఒక ఇంటర్వ్యూలో. ‘మగవాళ్లెప్పుడూ పలాయనవాదులే. తమ అసంతృప్తులు, ఇబ్బందులకు వైవాహిక బంధానికి ఆవల పరిష్కారాన్ని వెదుక్కోవాలనుకుంటారు’ అని తన బ్లాగ్‌లోని ఓ వ్యాసంలో రాసుకుంది సంగీతా. ఎస్సార్ -
గర్ల్‌ఫ్రెండ్ బ్రేకప్ చెప్పిందని యువకుడి వీరంగం
బెంగళూరు: ప్రేమలో పడ్డ ప్రతి జంట పెళ్లి చేసుకుంటారన్న గ్యారంటీ లేదు. ప్రేమను పెళ్లితో మూడిపెట్టేవారు చాలా తక్కువ ఉంటారు. ఎంత గాఢంగా ప్రేమించుకున్న కొన్ని కొన్ని కారణాలతో మధ్యలోనే బ్రేకప్ చెప్పేసి ప్యాకప్ అయ్యేవారే ఎక్కువ ఉన్నారు. బ్రేకప్ తర్వాత గతానికి స్వస్తి పలికి వెంటనే కొత్త జీవితాన్ని ప్రారంభించేవారు కొందరైతే గతాన్నే తలుచుకొని కుమిలికుమిలి బాధపడేవారు మరికొందరు. అయితే ఈ రెండు కోవలకు చెందిన వారికంటే విరుద్ధంగా విడిపోయాక లవర్‌పై కోపంతో రీవెంజ్ తీసుకునేవారు కూడా ఉంటారు. తాజాగా లవర్ బ్రేకప్ చెప్పిందని ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. కర్ణాటకకు చెందిన సతీష్(26) అనే యువకుడు, ఓ యువతిని గత కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే ఏమయ్యిందో తెలీదు కానీ ఇటీవల ఆమె సతీష్‌కు బ్రేకప్ చెప్పింది. లవర్ బ్రేకప్ చెప్పడాన్ని తట్టుకోలేకపోయిన అతడు ఆవేశంతో రగిలిపోయాడు. బెంగళూరులోని రోడ్లపై కనిపించిన ఏడు కార్లను ధ్వంసం చేశాడు. గురువారం అర్ధరాత్రి 1.30 -.45 మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. కార్లను ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సుమారు ఇలాంటి ఘటనే గత ఫిబ్రవరిలోనూ చోటుచేసుకుంది. లవర్ బ్రేకప్ చెప్పిందని ఆమె టూవీలర్‌ను మంటల్లో తగలబెట్టాడు. అంతేగాక ఆమెను చంపేస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు. -
రోహ్మాన్తో, సుస్మిత బ్రేకప్!.. తొలిసారిగా స్పందించిన ప్రియుడు..
మాజీ విశ్వసుందరి సుస్మిత సేన్, ఆమె బాయ్ ఫ్రెండ్ కశ్మీరి మోడల్ రోహ్మాన్ షాల్లు బ్రేకప్ చెప్పుకున్నారంటు జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేగాక సుస్మిత వరుస పోస్టులు కూడా ఇది నిజమే అన్నట్లుగా కనిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా ఆసక్తికరంగా రోహ్మాన్ ఇన్‌స్టా స్టోరీలు తాజాగా సోషల్ మీడియాలో దర్శనమించాయి. ఇవి చూస్తుంటే నిజంగానే వారి మధ్య ఎదో జరిగినట్లుగా అనిపిస్తుంది. దీంతో వీరి ప్రేమాయణం, బ్రేకప్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా కొన్నేళ్లుగా సుస్మిత, రోహ్మాన్ లివింగ్ రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం రోహ్మాన్ ఇన్‌స్టాలో ఆస్క్ మీ ఎనిథింగ్ సెషన్‌ను నిర్వహించాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. అంతేగాక సుస్మిత సేన్ గురించి కూడా అడగ్గా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యాడు. ఈ క్రమంలో సెలబ్రెటీ హోదాను ఎంజాయ్ చేస్తున్నారాని, దీని వల్ల స్వేచ్చగా రోడ్డుపైకి రాలేకపోతున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారని ఓ అభిమాని అడగ్గా.. ‘నిజం చెప్పాలంటే నేను ఇంకా స్వయంగా సెలబ్రేటీ హోదా రాలేదు. అది వేరేవాళ్ల కృషి వల్ల వచ్చింది(సుస్మితను ఉద్దేశించు చెప్పినట్లుగా ఉంది). కానీ ఒకరోజు నేను ఆ స్థాయికి తప్పకుండా చేరుకుంటాను. ఆ రోజున మీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను మై ఫ్రెండ్’ అంటు సమాధానం ఇచ్చాడు. అలాగే సుస్మిత సేన్ గురించి ఏదైన చెప్పమని కోరగా.. ఆమె చాలా ఉత్తమైనది అని తెలిపాడు. అంతేగాక తనలో ఆయనను ఆకర్షించేందని అడగ్గా.. తన అవగాహన అంటు సమాధానాలు ఇచ్చాడు. కాగా రోహ్మాన్ తదుపరిగా ఆర్య వెబ్ సిరీస్ సెకండ్ సీజన్లో నటిస్తున్నాడు. మొదటి సీజన్లో సుస్మిత లీడ్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. అయితే సుస్మిత ఇవాళ తాను 45 ఏళ్ల వయసులో కూడా తన ఎంపికలో పొరపాట్లు చేశానంటు ఇన్‌స్టాలో ఓ పోస్టు షేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రోహ్మాన్ తన లైవ్ సెషన్ స్టోరీనీ పంచుకోవడం గమనార్హం. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) చదవండి: సహజీవనం : బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పేసిన నటి 45 ఏళ్ల వయసులో కూడా ఎంపికలో పొరపాటు చేశాను: సుస్మిత సేన్ -
45 ఏళ్ల వయసులో కూడా ఎంపికలో పొరపాటు చేశాను: సుస్మిత సేన్
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మిత సేన్ ప్రస్తుతం కుంగుబాటులో ఉన్నట్లు కనిపిస్తున్నారు. తన ప్రియుడు రోహ్మాన్ షాల్‌తో సుస్మిత విడిపోయినట్లు ఇటీవల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అతడితో డేటింగ్ చేస్తూ, లివింగ్ రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్న ఈ జంట విడిపోవడం అందరికి షాక్ ఇచ్చింది. ఇక ఆమె తాజా పోస్టు చూస్తుంటే సుస్మిత ప్రియుడికి దూరమై మనోవేదనతో కుంగిపోతున్నట్లు కనిపిస్తున్నారు. తన పోస్టులో ఆమె ఇలా రాసుకొచ్చారు. ‘అన్ని పరిస్థితిల్లో నేను సానుకూలంగా ఉంటానని అందరు భావిస్తారు. కానీ అది నిజం కాదు. నా జీవితంలో కూడా నేను తప్పులు చేశాను, వాటి ఫలితాలను అనుభవిస్తున్నాను. ఇప్పటికి 45 ఏళ్ల వయసులో కూడా నేను ఎంపికలో పెద్ద పొరపాటు చేశాను. దాని వల్ల ఇప్పుడు తీవ్ర వేదనకు గురవుతున్న. అయితే దీనికి కారణమైన వాటిని గుర్తుపెట్టుకుని తిరిగి లెక్కలు వేసుకుంటు, అబద్దాలతో, నిరాశలో ఉండిపోవాలనుకోవడం లేదు. తప్పు చేసినవారేవరైన దీని నుంచి తప్పించుకోలేరు’ అంటు ఆమె రాసుకొచ్చారు. అలాగే ‘ఇక దీని నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే.. ఎంత కష్టాన్నైనా దానిని కర్మ రుణంగా చూడాలని, అదే విధంగా పూర్తి ఆశభావంతో తిరిగి దానిని చెల్లించాలి!. ఇక దానికి కారణమైన వారి విషయానికి వస్తే వారి కర్మ ఇప్పుడే ప్రారంభమైంది’ అంటు సుష్మిత తన పోస్టులో పేర్కొన్నారు. ఇది ఉండగా కొద్ది రోజుల కిందట సుష్మిత ఓ పోస్ట్ షేర్ చేస్తూ. ‘సమస్య ఏంటంటే..అతడు మారుతాడని మహిళ భావిస్తుంది. కానీ అతడు మారడు. పురుషులు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తుంది. కానీ అతడిని వదిలి వెళ్లదు అనుకుంటాడు. కానీ ఈ కథలో నీతి ఏంటంటే అతడు ఎప్పటికీ మారడు. ఆమె వెళ్లిపోతుంది’ అంటు రోహ్మాన్తో విడిపోయిన విషయాన్ని చెప్పకనే చెప్పారు. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) చదవండి: సహజీవనం : బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పేసిన నటి -
నా కొడుకు లవ్ బ్రేకప్‌కు ఆ హీరోయిన్లే కారణం
ముంబై : బాలీవుడ్లో రణ్‌బీర్ కపూర్‌కు లవర్‌బాయ్ ఇమేజ్ ఉంది. గతంలో స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనె, కత్రినా కైఫ్‌లతో లవ్‌ట్రాక్ నడిపిన రణ్‌బీర్ ఇప్పుడు ఆలియాభట్‌తో రిలేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. కరోనా కారణంగా వీరి పెళ్లికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కొడుకు ఫెయిల్యూర్ లవ్స్టోరీలపై స్పందించారు. రణ్‌బీర్‌తో డేటింగ్ చేసిన హీరోయిన్లు ఎవరూ తనకు సూట్ కారని, రిలేషన్ బ్రేకప్ కావడంలో తన కొడుకు తప్పేమీ లేదని పేర్కొంది. 'రణ్‌బీర్ చాలా సాఫ్ట్. ఎవరినీ హర్ట్ చేయడు. తను బంధానికి ఎంతో విలువిచ్చే మనిషి. నో చెప్పడం కూడా తెలియని అమాయకుడు. ఫస్ట్ టైమ్ రణ్‌బీర్ డేటింగ్లో ఉన్నప్పుడు.. ఆ అమ్మాయితో రిలేషన్ వద్దని వారించినా రణ్‌బీర్ వ్యతిరేకించాడు. దీంతో ఈ మ్యాటర్‌ను మరో రకంగా డీల్ చేస్తే మంచిదని భావించా. అందుకే అమ్మాయిల విషయంలో అంత త్వరగా నిర్ణయం తీసుకోవద్దని సలహా ఇచ్చా' అని నీతూకపూర్ వెల్లడించింది. కాగా రణ్‌బీర్‌తో గతంలో దీపికా పదుకొణె పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన సంగతి తెలిసిందే. అతని పేరుతో 'ఆర్కే' అనే టాటూని వీపుపై వేయించుకుంది. వీరిద్దరి పెళ్లి కూడా జరగనుందనే వార్తలు కూడా బీటౌన్‌లో చక్కర్లు కొట్టాయి. అయితే అనూహ్యంగా వీరి రిలేషన్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ కారణంగానే దీపికా డిప్రెషన్‌కు గురైనట్లు బీటౌన్ టాక్. ఆ తర్వాత నటుడు రణవీర్ సింగ్‌తో దీపిక పెళ్లి జరిగింది. ఆ తర్వాత కత్రినా కైఫ్‌తో ఆరేళ్ల పాటు రణ్‌బీర్ డేటింగ్ చేశాడు. అంతేకాకుండా ఫ్యామిలీ ఫంక్షనకు సైతం కత్రినా అటెండ్ అయ్యేది. వీరి పెళ్లకి ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించారనే ప్రచారం కూడా సాగింది. కానీ సడెన్‌గా వీరిద్దరు ఉంటున్న ఇళ్లు ఖాళీ చేసి ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇక దీపికా- కత్రినాలతో రణ్‌బీర్ బ్రేకప్ జరగడానికి తల్లి నీతూ కపూర్ కూడా ఒక కారణమని అప్పట్లో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి : తనే నా గర్ల్ ఫ్రెండ్, త్వరలోనే పెళ్లి : రణ్‌బీర్ ‘రణబీర్ ఓ రేపిస్ట్, దీపిక ఒక సైకో’ -
సహజీవనం : బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పేసిన నటి
మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి సుస్మిత సేన్ బాయ్‌ఫ్రెండ్ రోహ్మాన్ షాల్‌తో డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా లివింగ్ రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్న ఈ జంట అనూహ్యంగా బ్రేకప్ చెప్పుకున్నట్లు బీ-టౌన్లో టాక్ వినిపిస్తుంది. ఇందుకు సుస్మిత పెట్టిన ఓ పోస్ట్ ఫ్యాన్స్‌ను కలవరపాటుకు గురిచేస్తుంది. సమస్య ఏంటంటే..అతడు మారుతాడని మహిళ భావిస్తుంది. కానీ అతడు మారడు. పురుషులు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తుంది. కానీ అతడిని వదిలి వెళ్లదు అనుకుంటాడు. కానీ ఈ కథలో నీతి ఏంటంటే అతడు ఎప్పటికీ మారడు. ఆమె వెళ్లిపోతుంది' అని సుస్మితా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. (సుస్మితతో పెళ్లి.. ప్రియుడి కామెంట్) అంతేకాకుండా తన ఇద్దరు కూతుళ్లతో దిగిన ఫోటోను కూడా సుస్మిత షేర్ చేస్తూ..ఒకరికొకరం ఎప్పటికీ వెన్నంటే ఉంటామంటూ ఓ క్యాప్షన్‌ను జోడించింది. ఇందులో రోహ్మన్ లేకపోవడంతో వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారని, ఇక కన్మఫర్మేషన్ ఒకటే మిగిలిందంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. కాగా తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన కశ్మీర్ మోడల్‌తో సుస్మిత ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఇదే ఇదే విషయాన్ని ప్రేమకు చిహ్నమైన తాజ్ మహాల్ దగ్గర దిగిన పిక్ ఇన్‌స్టాలో షేర్ చేసి అధికారికంగా ప్రకటించారు కూడా. అంతేకాకుండా ఎప్పటికప్పుడు తమ బంధాన్ని తెలియజేస్తూ వారు దిగిన ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటారీ జంట. ఇటీవలె సుస్మిత పేరును ప్రియుడు రోహ్మాన్ పచ్చబొట్టు వేయించుకున్నాడు. (విడాకులపై స్పందించిన సుష్మితా సేన్ సోదరుడు) View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
భర్తతో విడాకులు..అది బ్రేకప్‌లా ఉంది : నటి
బాల నటిగా కెరియర్ ప్రారంభించిన శ్వేతా బసు ప్రసాద్.. కొత్తబంగారు లోకం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించినా శ్వేతాకు పెద్దగా సినిమా అవకాశాలు లభించలేదు. అదే సమయంలో ఆమెను పలు వివాదాలు కూడా చుట్టూ ముట్టాయి. దీంతో ఆమె అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2018 డిసెంబర్ 13న ఆమె బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైయినా ఏడాదిలోపే వారిద్దరు విడాకులు తీసుకున్నారు. తాజాగా దీనిపై స్పందించిన శ్వేతా పరస్పర అంగీకారంతో విడిపోయామని, అది ఒక బ్రేకప్‌లా జరిగిందన్నారు. (డిప్రెషన్లో నటి శ్వేతా బసు..! ) 'పెళ్లయిన పదేళ్లు అంతకంటే ఎక్కువ సంవత్సరాలైన తర్వాత కూడా చాలా మంది దంపతులు విడిపోవడం చేస్తుంటాం. కానీ తామిద్దరం మాత్రం ఏడాదిలోనే మా బంధానికి ముగింపు పలకాలనుకున్నాం. కాబట్టి దీన్ని విడాకులు అని పెద్ద పదంతో పోల్చడం కంటే, బ్రేకప్ అనడం కరెక్ట్ అనిపిస్తుంది. ఆ సమయంలో నాకు నా కుటుంబం, స్నేహితులు అండగా నిలిచారు. ఇప్పడు నాకు నేనే ఓ మంచి స్నేహితురాలిగా మరాను..ఇప్పుడు అంతా బాగానే ఉంది' అని వివరించింది. కాగా 2019లో తన భర్త రోహిత్ నుంచి విడిపోతున్నట్లు శ్వేతా ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా 2002లో మక్దే అనే ఓ హిందీ సినిమాలో బాల నటిగా జాతీయ అవార్డును అందుకుంది. అయితే 2014లో సెక్స్ రాకెట్లో శ్వేతా బసు పట్టుబడటం అప్పట్లో సంచలనం రేపింది. తర్వాత ఆమె ఆ కేసులో నిర్దోషి అని తేలింది. ఆ సంఘటన తర్వాత శ్వేతా బసు జీవితం పూర్తిగా మారిపోయింది. కొంతకాలం పాటు ఆమె సినిమాలకు దూరం అయ్యింది. (హీరోయిన్ నగ్న ఫోటో అడిగిన ఫ్యాన్.. ) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) -
పదేళ్లుగా డేటింగ్.. ఇప్పుడు బ్రేకప్
టెలివిజన్ కపుల్ పూజా గోర్-రాజ్ సింగ్ అరోరాకు బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్. దాదాపు గత పదేళ్లుగా డెటింగ్‌లో ఉన్న వీరు తాజాగా విడిపోయారు. అయినప్పటికి తామిద్దంరం మంచి స్నేహితులుగా ఉంటామని.. ఒకరినొకరం గౌరవించుకుంటామని వెల్లడించారు. ఈ మేరకు పూజాగోర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటన చేశారు. ‘2020లో ఎన్నో మార్పులు వచ్చాయి. మంచివి ఉన్నాయి.. చెడువి ఉన్నాయి. గత కొద్ది నెలలుగా రాజ్‌తో నా బంధానికి సబంధించి ఎన్నో ఊహాగానాలు వెలువడుతున్నాయి. కష్టమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొద్దిగా సమయం పడుతుంది. దీని గురించి మాట్లాడటానికి నేను కొంచెం సమయం తీసుకున్నాను. రాజ్, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇక మీదట మా జీవితాలు వేర్వేరు మార్గాల్లో నడుస్తాయి. కానీ మా మధ్య ప్రేమ, గౌరవం జీవితాంతం అలానే ఉంటాయి. తన జీవితంలో అత్యున్నతంగా ఎదగాలని కోరుకుంటాను. నా జీవితం మీద ప్రభావం చూపిన వ్యక్తుల్లో తాను ఎంతో ముఖ్యమైన వాడు. నేను తనకు ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తాను’ అన్నారు పూజా గోర్. (రష్మిక కలలు చాలా పెద్దవి : రక్షిత్) View this post on Instagram A post shared by Pooja A Gor (@poojagor) అంతేకాక ‘ఇక మీదట మేం మంచి స్నేహితులుగా ఉండబోతున్నాం. ఇది ఎన్నటికి మారదు. ఇక ఈ బ్రేకప్ గురించి బహిరంగంగా మాట్లాడటానికి నాకు కొంత సమయం, ధైర్యం అవసరం అయ్యాయి. నేను చెప్పాలనుకున్న విషయం ఇదే. మమ్మల్ని అర్థం చేసుకుని.. మా ప్రైవసీకి మర్యాద ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. అలానే రాజ్ సింగ్ అరోరాతో కలిసి ఉన్న ఫోటోలన్నింటిని డిలీట్ చేసింది. ఇక పూజ గోర్, రాజ్ ఇద్దరు 2004లో వచ్చిన టీవీ షో రిమిక్స్ ద్వారా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య పరిచయం.. ప్రేమ మొదలయ్యాయి. -
ఆమెతో విడిపోయాక సంతోషంగా ఉన్నా: హీరో
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, అధ్యాయన్ సుమన్ బ్రేకప్ విషయం మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా కంగనాతో విడిపోవడంపై మరోసారి సుమన్ స్పందిస్తూ.. ‘కంగనాతో విడిపోయాక చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో ఆ ఘట్టం దాటి చాలా మైళ్లు ముందుకు వెళ్లాను’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతేగాక ఇప్పడు మొరదాబాద్ ఘటనపై కంగనా సోదరి రంగోలీ చందేల్ చేసిన వివాదస్పద ట్వీట్ అనంతరం ఆమె ట్విటర్ ఖాతా రద్దయిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి దీనిపై బాలీవుడ్ నటులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో పలు సందర్భాల్లో కంగనా, సుమన్ బ్రేకప్ విషయం మరోసారి వార్తల్లోకెక్కింది. (రంగోలికి మద్దతు.. కంగనా రనౌత్‌పై కేసు) కంగనా, సుమన్‌ల బ్రేకప్‌పై ఇటీవలనటి కవితా కౌశిక్ స్పందించారు. కంగనా, సుమన్‌తో విడిపోయిన సమయంలో అతడిని ఆమె విమర్శించిన తీరు చాలా బాధాకరం అన్నారు. సుమన్, అతని తండ్రి శేఖర్ సుమన్‌లు కంగనా క్షమాపణలకు అర్హులని కూడా పేర్కొన్నారు. సుమన్‌తో బ్రేకప్ సమయంలో అతని కుటుంబంపై కంగనా ఆమె సోదరి రంగోలీలు తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా అతని కుటుంబాన్ని ఎన్నో రకాలుగా బాధపెట్టిన తీరు ‘హృదయ విధారకం’ అంటూ ట్వీట్ చేశారు. ఇక దీనిపై సుమన్ స్పందిస్తూ.. కవిత మద్దతుకు కృతజ్ఞతలు తెలిపాడు. అంతేగాక అప్పట్లో తనని విమర్శిస్తూ వచ్చిన వార్తలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. సుమన్ దీనిపై ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘కంగనాతో విడిపోయే సయంలో తనకు ఎవరూ మద్దతుగా లేరు. అప్పుడు నేను కఠిన పరిస్థితులను చుశాను. తను నన్ను నా కుటుంబాన్ని చాలా బాధపెట్టింది. ఆమెతో విడిపోయాక నా జీవితం చాలా ఆనందంగా ఉంది. నేను ఇప్పుడు జీవితంలో చాలా ముందుకు వెళ్లాను. అప్పుడు నేను ఎదుర్కొన్న విమర్శలకు కారణమైనవారు నాకు క్షమాపణలు చెప్పారా లేదా అన్నది నాకు అవసరం లేదు’’ అని వెల్లడించాడు. కాగా ‘రాజ్: ది మిస్టరీ కంటీన్యూస్’ సినిమా షూటింగ్లో సుమన్, కంగనాలు ప్రేమలో పడ్డారు. కంగనాతో విడిపోయే సమయంలో ఆమె తనపై తీవ్ర విమర్శలు చేశారని అంతేగాక తనకు చేతబడి కూడా చేయించిందంటూ చేసిన సుమన్ వ్యాఖ్యలు అప్పట్లో విపరితంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. -
‘గుర్తింపు కోసమే.. నా పేరు వాడుకుంటున్నారు’
ప్రముఖ బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ తన మాజీ ప్రియుడు, నటుడు హిమాన్ష్ కోహ్లిపై విరుచుకుడ్డారు. తన పేరును వాడుకుని వార్తల్లోకెక్కాలని చూస్తే.. ఊరుకునేది లేదంటూ తన మాజీ ప్రియుడికి సోషల్ మీడియాలో క్లాస్ పీకారు. అది చూసి నేహా అభిమానులంతా ఎప్పుడు కూల్‌గా ఉండే ఆమె ఎందుకీంత కోపంగా ఉందా అని ఆశ్యర్యపోతున్నారు. ప్రస్తుతం నేహా ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసిన ఘాటు వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేహా ఓ చిన్నారితో సరదాగా డ్యాన్స్ చేస్తున్న వీడియోకు ‘హ్యాపీ లైఫ్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ఈ వీడియోకు నేహా ‘నేను చేసిన మంచి, కర్మ వల్లే సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను. అయితే కొంత మంది నన్ను చూసి ఓర్వలేక నాపై చేడు ప్రచారం చేస్తున్నారు. అంతేగాక నాకున్న పలుకుబడిని ఉపయోగించుకుని వార్తల్లో నిలవాలని చూస్తున్నారు. అయితే కేవలం వారి గర్తింపు కోసమే నా పేరును వాడుకుంటున్నారు తప్ప వేరే కారణం లేదు. నా పేరును వాడుకొని ఎదగాలనుకునే వారికి నేను ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఫేమ్ అయితే అవ్వండి అయితే అది మీ సొంత పని వల్ల అయ్యిండాలి.. తప్పా నా పేరుతో కాదు’ అంటూ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. మేం విడిపోవడానికి కారణం తనే: హీరో అంతేగాక వారి గుర్తింపు కోసం మళ్ళీ తన పేరును వాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హిమాన్ష్‌ను హెచ్చారించారు. తాను నోరు తేరిస్తే.. తన తల్లిదండ్రులు, సొదరిలు కూడా ఏం చేశారో.. తనతో వారు చెప్పిన మాటలను కూడా బయటపెట్టాల్సి వస్తుందని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇకనైనా నా పేరుకు, నాకు దూరంగా ఉంటేనే మంచిది అంటూ గట్టిగా సమాధానం ఇచ్చారు. కాగా ఇటీవల హిమాన్ష్ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘మా బ్రేకప్‌కు కారణం నేహానే. తానే విడిపోదామని చెప్పి.. సోషల్‌మీడియాలో నేనే మోసం చేసినట్లు నేహా పోస్టులు పెట్టి నన్ను చెడ్డావాడిగా చిత్రీకరించింది’ అని చెప్పిన సంగతి తెలిసిందే. View this post on Instagram Love You Guddu 😍😇 . Bhagwaan Ki Daya Se, By The Grace of God, I have Everything one wishes from Life 🙏🏼 Really Really Happy that I’m living a Happiest Life and that’s because of Good Deeds, Good Karma! ❤️💪🏼😇 Log Jo Bhi Bura Bolte Hain Mere Baare Mein They’re nothing but FAKE AND JEALOUS and USING MY FAME to appear in News. Pehle bhi Use Kiya, Mere Peeche se bhi Use Kar Rahe Hain. Oye! Get Famous coz of Your Work, Not bcz of Me. Don’t Use My Name to get famous again. If I open My Mouth............. I’ll bring here your Mother, Father and Sister’s deeds too.. What all they did and said to me. Don’t You Dare Use My Name and Dont become Bechaara in front of the world, making me look like a villain, Warning You!!!!! ⚠️ Stay Away from Me and My Name!!!!!! 🙏🏼 A post shared by Neha Kakkar (@nehakakkar) on Feb 17, 2020 at 9:50pm PST -
మేం విడిపోవడానికి కారణం తనే: హీరో
బాలీవుడ్ నటుడు హిమాన్ష్ కోహ్లి ప్రముఖ సింగర్ నేహ కక్కర్తో విడిపోవడంపై వివరణ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హిమాన్ష్ మాట్లాడుతూ.. వారిద్దరూ విడిపోవడం అనేది నేహా నిర్ణయమే అని స్పష్టం చేశాడు. కానీ నేహా సోషల్ మీడియా పోస్టులు, పలు షోలలో కన్నీరు పెట్టుకోవడం చూసి అందరూ తననే నిందించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక అసలు విషయం చెబుతూ.. ‘అసలు నేను నేహాతో విడిపోవాలనుకోలేదు. అది తన నిర్ణయమే. ఒక ప్రేమికుడిగా తన నిర్ణయాన్ని గౌరవించాను. అయితే మా బ్రేకప్ విషయాన్ని సోషల్ మీడియాలో ముందుగా నేహా వెల్లడిస్తూ.. ఇక మా మధ్య ఎలాంటి బంధం లేదని, తన హృదయం ముక్కలైందని, నిరాశలో కూరుకుపోయానంటూ చేసిన పోస్టు చూసి షాక్‌కు గురయ్యాను. ఇక అది చూసి నెటిజన్లంతా నన్ను నిందించడం మొదలు పెట్టారు. మా బ్రేకప్‌కు కారణం నేనేనని వారంతా నాపై విరుచుకుపడుతూ మోసగాడిగా చూడటం నాకు చాలా బాధను కలిగించింది. నిజం చెప్పాలంటే నా జీవితంలో అవి చాలా క్లిష్టమైన రోజులు కూడా’ అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ పోస్టులకు చాలాసార్లు స్పందిద్దామనుకుని.. మెసేజ్‌లు కూడా టైప్ చేసి ఆగిపోయిన రోజులు ఉన్నాయన్నాడు. ఒకప్పుడు తనని ప్రేమించాను కాబట్టే నేహాను చేడుగా చూపించడం ఇష్టం లేక రిప్లై ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. ‘ఇప్పటికి ఆమెను గౌరవిస్తున్నాను’ అంతేగాక ‘నేహాను నా సినిమా కెరీర్ కోసం ప్రేమించానంటూ వార్తలు వచ్చాయి. నిజానికి చాలా మంది కూడా అదే అనుకున్నారు. అసలు విషయం వారికి తెలియదు. నేహాతో ప్రేమకు ముందు నా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత రెండు సినిమాలు మాత్రమే వచ్చాయి. కారణం నేహా మ్యూజిక్ షోల కోసం తనతో పాటు విదేశాలకు వెళ్లడం, తనతోనే ఎక్కువ సమయం గడుపుతూ సినిమాల్లో తక్కువగా నటించాను’ అని చెప్పాడు. ఇక నిజానికి ఏం జరిగిందన్న విషయం ప్రజలకు అవసరం లేదు. వారికి కనిపించిందే నిజమని నమ్ముతారు. దానితోనే ఇతరులను నిందిస్తారు తప్ప.. అసలు విషయం ఎవ్వరూ తెలుసుకోవాలనుకోరు అన్నాడు. ఇక ఏది ఏమైనా చివరకు నేహాను తాను మోసం చేయలేదని సోషల్ మీడియాలో స్పష్టం చేసినందుకు సంతోషంగా ఉందని హిమాన్ష్ పేర్కొన్నాడు. -
రష్మిక కలలు చాలా పెద్దవి : రక్షిత్
ప్రముఖ నటి రష్మికా మందన్నాతో బ్రేకప్ గురించి కన్నడ నటుడు రక్షిత్ శెట్టి స్పందించారు. తన తాజా చిత్రం అతడే శ్రీమన్నారాయణ ప్రమోషన్లో పాల్గొన్న రక్షిత్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సందర్భంగా రక్షిత్‌కు తన మాజీ ప్రేయసి రష్మిక గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ ‘ఆమె చాలా పెద్ద కలలు కనింది. ఆమె గతం నాకు తెలుసు కాబట్టి.. ఆ కలలు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తెలుసు. ఆమె కలలు నిజం కావాలని దేవున్ని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. కాగా, కిరిక్ పార్టీ చిత్రంలో నటిస్తున్న సమయంలో రష్మిక, రక్షిత్‌ల మధ్య ప్రేమ చిగురించింది. 2017లో రష్మిక, రక్షిత్‌ల నిశ్చితార్థం జరగగా.. ఆ మరసుటి ఏడాదే వారిద్దరు విడిపోయారు. ఆ సమయంలో ఆయన అభిమానులు రష్మికను లక్ష్యంగా చేసుకుని కామెంట్లు చేయడంతో రక్షిత్ స్పందించారు. ‘రష్మికా గురించి మీరు ఓ అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నారు. ఎవర్ని నేను తప్పుపట్టను. మనం ఏం చూస్తున్నామో అదే అందరం నమ్ముతుంటాం. కానీ అవి నిజం కాకపోవచ్చు. చాలా సార్లు మనం మరో వైపు ఉన్న కోణాన్ని చూడకుండానే, నిర్ధారణకు వచ్చేస్తుంటాం. నాకు రష్మిక రెండున్నరేళ్లకు పైగా తెలుసు. మీ కంటే ఎక్కువ రష్మిక గురించి నాకే తెలుసు. దయచేసి ఆమెను జడ్జి చేయడం ఆపండి’ అని కోరారు. మరోవైపు హీరో విజయ దేవరకొండతో రష్మిక ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చినప్పటికీ.. ఆమె వాటిని ఖండించారు. కాగా, రక్షిత్ అతడే శ్రీమన్నారాయణ చిత్రం కన్నడలో డిసెంబర్ 27న, తెలుగులో జనవరి 1న, తమిళ్, మాలయాళంలో జనవరి 3న, హిందీలో జనవరి 16న విడుదల కానుంది. -
మరో ప్రేమ కోసం..
చెన్నై,టీ.నగర్: మరో ప్రేమ కోసం అన్వేషిస్తున్నట్లు నటి శ్రుతిహాసన్ వెల్లడించారు. నటి శ్రుతిహాసన్ లండన్ బాయ్‌ఫ్రెండ్ మైకెల్ కోర్సెల్‌తో డేటింగ్ చేశారు. ఇరువురూ ప్రేమజంటగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కొన్నేళ్ల పాటు సాగిన ఈ సంబంధాన్ని శ్రుతిహాసన్ హఠాత్తుగా బ్రేక్ అప్ చేశారు. డేటింగ్, ప్రేమంటూ ఏడాదికి పైగా కొత్త చిత్రాల్లో నటించని శ్రుతి ప్రస్తుతం నటించేందుకు అంగీకారం తెలుపుతోంది. ప్రస్తుతం విజయసేతుపతితో లాభం చిత్రంలో జంటగా నటిస్తున్నారు. హిందీ చిత్రంలో నటించేందుకు సమ్మతించారు. ప్రియుడు మైకెల్‌తో బ్రేక్ అప్ అయిన విషయం గురించి మౌనం పాటిస్తూ వచ్చిన శ్రుతి బహిరంగంగా నోరు విప్పారు. ఆమె మాట్లాడుతూ మంచివారు కొన్ని సమయాల్లో మంచివారేనని, అదే వ్యక్తులు కొన్ని సమయాల్లో చెడ్డవారుగా మారుతారని తెలిపారు. ప్రేమ విఫలం కావడం గురించి తనకు ఎటువంటి బాధ లేదని, ఇది మొత్తానికి తనకు ఒక అనుభవంగా మిగిలిందన్నారు. ప్రేమకు ఇదే కండిషన్ అంటూ ఏమీ లేదని, ఈ ప్రేమ ద్వారా తాను ఎంతో నేర్చుకున్నట్లు తెలిపారు. ఇది నేర్చుకోవడం ద్వారా తెలిసిందని, తదుపరి ప్రేమ కోసం వేచివున్నట్లు తెలిపారు. అది చక్కని ప్రేమగా మిగులుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. అటువంటి ప్రేమ లభిస్తే దాని గురించి సంతోషంగా అందరితో పంచుకుంటానని తెలిపారు. -
బ్రేకప్‌పై స్పందించిన నటి
విశ్వ నటుడు కమల్ హాసన్ గారాల తనయ శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొవాల్సిన పని లేదు. ప్రతిభ, అందం శ్రుతి సొంతం. 2009లో హిందీ సినిమా లక్‌తో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన శ్రుతి ఆ తర్వాత తెలుగు, తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ.. టాప్ హీరోయిన్గా నిలిచారు. 2017లో వచ్చిన కాటమరాయుడు తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు శ్రుతి. ఆ సమయంలో ఇటాలియన్ బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. లాస్ ఏంజెల్స్, చెన్నై, ముంబై వంటి చోట్ల పర్యటించారు. తమకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేశారు. కొద్ది సంవత్సరాల పాటు సాగిన వీరి బంధం ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగిసిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మంచు లక్ష్మి వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ఓ రియాలిటీ షోకు హాజరయ్యారు శ్రుతి. ఈ సందర్భంగా మైఖేల్‌తో బ్రేక్ అప్, జీవితం గురించి తన అంచనాలు వంటి తదితర అంశాల గురించి చెప్పుకొచ్చారు శ్రుతి హాసన్. మైఖేల్‌తో బంధం తనకో మంచి అనుభవాన్ని మిగిల్చిందన్నారు శ్రుతి. ‘నేను చాలా అమాయకంగా ఉంటాను. దాంతో నా చుట్టు ఉన్న వారు నాపై ఆధిపత్యం చెలాయిస్తూ.. బాస్‌లా ప్రవర్తిస్తారు. నాలో భావోద్వేగాలు అధికం. అందుకే నా చుట్టు ఉండే వారు నన్ను తమ అధీనంలో ఉంచుకోవాలని భావిస్తారు. అయితే ఇవన్ని కూడా నాకు మంచి అనుభవాలనే మిగిల్చాయి’ అని తెలిపారు. అంతేకాక జీవితంలో సరైన వ్యక్తి కోసం తాను ఎదురు చూస్తున్నాను అన్నారు శ్రుతి. తను కోరుకున్న లక్షణాలు కల వ్యక్తి తారసపడితే.. వెంటనే అతడితో ప్రేమలో పడతానని.. ప్రపంచానికి అతడిని పరిచయం చేస్తానని తెలిపారు శ్రుతి. అంతేకాక ప్రేమలో పడటానికి ప్రత్యేకంగా ఎలాంటి ఫార్ములాలు ఉండవన్నారు శ్రుతి. ఒకానొక సమయంలో మంచిగా అనిపించిన ఓ వ్యక్తి అదే సమయంలో చెడ్డగా కనిపిస్తాడని తెలిపారు. ఇలాంటి విషయాల గురించి తాను బాధపడన్నారు. ఇవన్ని తనకు నేర్చుకునే అవకాశం కల్గించాయని.. తనకు మంచి అనుభవాలుగా మిగిలిపోతాయన్నారు. కొన్ని సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్న వీరు ఈ ఏడాది ఏప్రిల్‌లో విడిపోయిన సంగతి తెలిసిందే. తమ బ్రేకప్ విషయాన్ని మైఖల్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. -
మీ పార్టనర్‌తో బ్రేకప్ అయ్యారా ?
రిలేషన్షిప్లో అన్నీ అనుకున్నట్టే జరగవు. పరిస్థితులు సరిగా లేనవుడు సంయమనం కోల్పోవడం వల్ల రిలేషన్షిప్ కొన్ని సార్లు బ్రేకప్ అవుతుంది. అతడు/ఆమె మీకు సరైన జోడీనే అయినప్పటికీ చిన్న కారణాలకే మీరు బ్రేకప్ అయి ఉంటే కింది విషయాలు మీరు లోతుగా ఆలోచించుకొని బంధాన్ని తిరిగి నిర్మించుకోవడానికి ఉపయోగపడతాయి. మీ సమస్యకు పరిష్కారం లేదా ? మీరు విడిపోవడానికి అసలు బలమైన కారణం ఉందా? లేక భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేక జరిగిన గొడవ వల్ల విడిపోయారా? రిలేషన్‌షిప్‌లోని ప్రతీ సమస్యను ఏదో ఒక విధంగా పరిష్కరించవచ్చు. విడిపోవడం వల్ల మాత్రమే సమస్య పరిష్కారమవుతుందా అనే ప్రశ్నను వేసుకొని లోతుగా పరిశీలించుకోవాలి. సెన్సిటివ్ విషయాలను సరిగా డీల్ చేయడం నేర్చుకుంటే చాలా వరకు రిలేషన్‌షిప్‌ను కాపాడుకోవచ్చు. నిజంగా అతడు/ఆమె మీద కోపమేనా? కొన్నిసార్లు ఎవరి మీదనో ఉన్న కోపాన్ని మీ పార్టనర్ మీద చూపించి ఉంటారు. ఉదాహరణకు ఆఫీస్‌లో బాస్ మిమ్మల్ని తిడితే, మీరు అతన్ని ఏమీ అనలేక ఇంటికెళ్లాక మీ పార్టనర్ మీద చూపించి ఉండవచ్చు. లోతుగా పరిశీలించుకుంటే తప్ప ఆ విషయం మీకు తెలియకపోవచ్చు. అతడు/ఆమె మీకు కరెక్టేనా ? కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల ఇద్దరి మధ్య సరైన కమ్యూనికేషన్ లేనపుడు ఇద్దరిలో ఎవరో ఒకరికి తమను పట్టించుకోవడం లేదనిపించడం సహజం. అలాంటి సమయంలో ఒకటికి రెండు సార్లు పరిస్థితిని క్షుణ్ణంగా వివరించడం ఉత్తమం. మీ పార్ట్నర్ను అడగకుండా మీకై మీరే ఓ అభిప్రాయానికి రావడం సరైనది కాదు. ఇద్దరూ ఒకరికి ఒకరు నమ్మకంగా ఉన్నంత కాలం విడిపోవడమనేది సరైన నిర్ణయం అనిపించుకోదు. ఇంకా ప్రేమిస్తున్నారేమో..! ఏదైనా కారణం వల్ల మీరు విడిపోయినప్పటికీ మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తూ ఉండొచ్చు. గతంలో మీరు మెలిగిన తీరును బట్టి మీరు చేసిన తప్పును మన్నించి రెండో అవకాశం ఇవ్వడానికి ఎదురుచూస్తూ ఉండవచ్చు. గొడవ జరిగి విడిపోయినప్పటికీ కొంత కాలానికి తిరిగి మిమ్మల్ని కోరుకుంటూ ఉండవచ్చు. కాబట్టి ఒకసారి మీ పార్ట్నర్తో మాట్లాడటానికి ప్రయత్నించండి. గతం గుర్తొస్తుందా..? మీరు గతంలో సంతోషంగా గడిపిన క్షణాలు మీకు చాలా సార్లు గుర్తొస్తూ ఉండవచ్చు. మీరు విడిపోయిన క్షణం చాలా బలహీనమైనదని, ఆ నిర్ణయం తీసుకున్నందుకు మీరు బాధపడుతున్నట్లయితే మీరు ఇంకా మీ పార్టనర్ పట్ల ప్రేమను కలిగివున్నారనే అర్థం. మరిక ఆలస్యం దేనికి.. వెంటనే మీ పార్టనర్‌కి కాల్ చేసేయండి. కాల్ చేసే ధైర్యం లేకపోతే మెసెజ్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్ లాంటివి ఇందుకే ఉన్నాయి మరి... -
నిన్ను నువ్వు ప్రేమించుకో
‘‘మనకు ఎవ్వరూ లేరనుకున్నప్పుడు, మనల్ని విడిచి ఎవరైనా వెళ్లిపోతున్నారు అని అనుకున్నప్పుడు మనల్ని మనం ప్రేమించుకోగలగాలి. మనతో మనం ఉండగలగాలి’’ అని అర్థం వచ్చే ‘సెల్ఫ్ లవ్’ (మనల్ని మనం ప్రేమించుకోవడం) కొటేషన్లను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఇలియానా. హఠాత్తుగా ఈ ‘సెల్ఫ్ లవ్’ వెనక కారణం ఏంటబ్బా? అంటే బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో బ్రేకప్పే కారణమయ్యుంటుంది అని ఊహిస్తున్నారు కొందరు. ఇటీవలే ఆండ్రూకి, ఇలియానాకు బ్రేకప్ జరిగిందట. ఒకరినొకరు తమ సోషల్ మీడియాలో అన్‌ఫాలో అవ్వడమే కాకుండా ఇద్దరూ కలసి దిగిన ఫొటోలను డిలీట్ చేశారు కూడా. అందుకే సడెన్‌గా సెల్ఫ్ లవ్ గురించిన కొటేషన్లను ఇలియానా షేర్ చేస్తున్నారు అంటున్నారు కొందరు. ‘నీ జీవితం నుంచి ఎవ్వరు బయటకు వెళ్లిపోయినా నిన్ను నువ్వు మాత్రం కోల్పోవద్దు’, ‘కంట్లో నిప్పులు చెలరేగుతున్నా, స్వర్గంలాంటి చిరునవ్వు మాత్రం తనతోనే ఉంది’’ అంటూ పలు కొటేషన్లను షేర్ చేశారు ఇలియానా. ఈ విషయం ఇలా ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా చేయబోయే సినిమాలో హీరోయిన్గా ఇలియానా పేరును పరిశీలిస్తున్నారని టాక్. -
మీ పార్టనర్‌తో బ్రేకప్ అయ్యారా ?
రిలేషన్షిప్లో అన్నీ అనుకున్నట్టే జరగవు. పరిస్థితులు సరిగా లేనవుడు సంయమనం కోల్పోవడం వల్ల రిలేషన్షిప్ కొన్ని సార్లు బ్రేకప్ అవుతుంది. అతడు/ఆమె మీకు సరైన జోడీనే అయినప్పటికీ చిన్న కారణాలకే మీరు బ్రేకప్ అయి ఉంటే కింది విషయాలు మీరు లోతుగా ఆలోచించుకొని బంధాన్ని తిరిగి నిర్మించుకోవడానికి ఉపయోగపడతాయి. మీ సమస్యకు పరిష్కారం లేదా ? మీరు విడిపోవడానికి అసలు బలమైన కారణం ఉందా? లేక భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేక జరిగిన గొడవ వల్ల విడిపోయారా? రిలేషన్‌షిప్‌లోని ప్రతీ సమస్యను ఏదో ఒక విధంగా పరిష్కరించవచ్చు. విడిపోవడం వల్ల మాత్రమే సమస్య పరిష్కారమవుతుందా అనే ప్రశ్నను వేసుకొని లోతుగా పరిశీలించుకోవాలి. సెన్సిటివ్ విషయాలను సరిగా డీల్ చేయడం నేర్చుకుంటే చాలా వరకు రిలేషన్‌షిప్‌ను కాపాడుకోవచ్చు. నిజంగా అతడు/ఆమె మీద కోపమేనా? కొన్నిసార్లు ఎవరి మీదనో ఉన్న కోపాన్ని మీ పార్టనర్ మీద చూపించి ఉంటారు. ఉదాహరణకు ఆఫీస్‌లో బాస్ మిమ్మల్ని తిడితే, మీరు అతన్ని ఏమీ అనలేక ఇంటికెళ్లాక మీ పార్టనర్ మీద చూపించి ఉండవచ్చు. లోతుగా పరిశీలించుకుంటే తప్ప ఆ విషయం మీకు తెలియకపోవచ్చు. అతడు/ఆమె మీకు కరెక్టేనా ? కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల ఇద్దరి మధ్య సరైన కమ్యూనికేషన్ లేనపుడు ఇద్దరిలో ఎవరో ఒకరికి తమను పట్టించుకోవడం లేదనిపించడం సహజం. అలాంటి సమయంలో ఒకటికి రెండు సార్లు పరిస్థితిని క్షుణ్ణంగా వివరించడం ఉత్తమం. మీ పార్ట్నర్ను అడగకుండా మీకై మీరే ఓ అభిప్రాయానికి రావడం సరైనది కాదు. ఇద్దరూ ఒకరికి ఒకరు నమ్మకంగా ఉన్నంత కాలం విడిపోవడమనేది సరైన నిర్ణయం అనిపించుకోదు. ఇంకా ప్రేమిస్తున్నారేమో..! ఏదైనా కారణం వల్ల మీరు విడిపోయినప్పటికీ మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తూ ఉండొచ్చు. గతంలో మీరు మెలిగిన తీరును బట్టి మీరు చేసిన తప్పును మన్నించి రెండో అవకాశం ఇవ్వడానికి ఎదురుచూస్తూ ఉండవచ్చు. గొడవ జరిగి విడిపోయినప్పటికీ కొంత కాలానికి తిరిగి మిమ్మల్ని కోరుకుంటూ ఉండవచ్చు. కాబట్టి ఒకసారి మీ పార్ట్నర్తో మాట్లాడటానికి ప్రయత్నించండి. గతం గుర్తొస్తుందా..? మీరు గతంలో సంతోషంగా గడిపిన క్షణాలు మీకు చాలా సార్లు గుర్తొస్తూ ఉండవచ్చు. మీరు విడిపోయిన క్షణం చాలా బలహీనమైనదని, ఆ నిర్ణయం తీసుకున్నందుకు మీరు బాధపడుతున్నట్లయితే మీరు ఇంకా మీ పార్టనర్ పట్ల ప్రేమను కలిగివున్నారనే అర్థం. మరిక ఆలస్యం దేనికి.. వెంటనే మీ పార్టనర్‌కి కాల్ చేసేయండి. కాల్ చేసే ధైర్యం లేకపోతే మెసెజ్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్ లాంటివి ఇందుకే ఉన్నాయి మరి... -
ఆయనతో తెగదెంపులు చేసుకున్నా.. : నటి
సీరియల్స్ ద్వారా ఇద్దరికీ పరిచయం, ఆపై దాదాపు ఏడేళ్లపాటు వారి మధ్య ఉన్న రిలేషన్‌పై ఏనాడూ నోరు మెదపలేదు. ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా, అనుమానించినా నవ్వుతూనే తప్పుకుంది ఆ జంట. అయితే తమ మధ్య అలాంటిదేం లేదని, కనీసం తాము స్నేహితులం కూడా కాదంటూ కుండబద్దలు కొట్టారు నటి మౌనీ రాయ్. ముంబై : బుల్లితెరపై విజయవంతమై వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు మౌనీ రాయ్. ఆమె తెరంగేట్రం చేయబోతున్న గోల్డ్ మూవీ ఈ నెల 15న విడుదల కానుంది. అయితే ఈ నేపథ్యంలో మరోసారి మౌనీ రాయ్, మోహిత్ రైనాల వ్యవహారం తెరపైకి వచ్చింది. 2018 ప్రారంభంలో మరికొన్ని రోజుల్లో ఈ జంట పెళ్లిపీటలెక్కనుందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ముంబై మిర్రర్‌తో మౌనీ మాట్లాడుతూ.. ‘చాలాకాలం నుంచి నేను ఒంటరిగా ఉంటున్నా. నేను ఎవరితోనూ రిలేషన్లో లేను. మోహిత్, నేను కనీనం స్నేహితులం కాదని’పిడుగులాంటి వార్త పేల్చారు నటి. మరికొన్ని రోజుల్లో ఈ సినీ జంట పెళ్లి చేసుకోబోతుందని భావించిన వీరి అభిమానులకు ఇది నిజంగా చేదువార్త. మౌనీ రాయ్‌తో రిలేషన్ వదంతులపై మోహిత్ రైనా సైతం స్పందించాడు. ‘మేమిద్దరం ఎక్కడ కలుసుకున్నా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాళ్లం. అంతేకానీ మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. ఒకరిపై మరొకరికి చాలా గౌరవం మాత్రం ఉందని’ మోహిత్ చెప్పుకొచ్చాడు. డేటింగ్ చేసిన సమయంలో మాత్రం.. మా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటం అంతా ఇష్టం ఉండదని, లేనిపోని విషయాల్లో జోక్యం చేసుకోవడం తనకు నచ్చదని పలుమార్లు ప్రస్తావించాడు. -
అందుకే ఆమెతో బ్రేకప్ చేసుకున్నా!
ప్రేమలు పుట్టడం. బ్రేకప్ అవడం కొత్తేం కాదు. సెలబ్రెటీల్లో అయితే ఇది సాధారణం. ప్రేమలు పుడుతూనే ఉంటాయి. బ్రేకప్ అవుతూనే ఉంటాయి. ఎంతో మంది జంటలు ప్రేమించుకున్నారు. మళ్లీ బ్రేకప్ చేసుకున్నారు. ఆ జాబితా కూడా చాలా పెద్దదే. అయితే బాలీవుడ్లో మాత్రం ఈ పోకడలు మరీ ఎక్కువ. ప్రస్తుతం బాలీవుడ్లో ఓ ప్రేమకథ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇండియాలో స్టార్ హీరోయిన్గా ఎదిగి.. హాలీవుడ్‌కు ఎగిరిపోయి.. అక్కడ కూడా తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రియాంకచోప్రా. ప్రస్తుతం హాలీవుడ్ సింగర్ కమ్ నటుడు నిక్ జోనస్‌తో ప్రేమలో మునిగి తేలుతున్నారు ఆమె. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని విహారం చేస్తున్నారు. వీరిద్దరి పెళ్లి కూడా త్వరలో జరుగబోతోందంటూ కథనాలు వినిపిస్తున్నాయి. ప్రియాంకకు ఇది తొలిప్రేమ కాదు. గతంలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. 2008లో వచ్చిన ‘లవ్‌స్టోరి 2050’ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన హర్మన్ బెవాజా, ప్రియాంక చోప్రాలు ప్రేమలో పడ్డారు. కొంతకాలంపాటు డేటింగ్ కూడా చేశారు. రెండేళ్లు తిరక్కుండానే బ్రేకప్ చెప్పేసుకున్నారు. అప్పట్లో ఈ బ్రేకప్‌పై రకరకాల పుకార్లు వినిపించాయి. హర్మన్ కెరీర్ సరిగా లేదనే కారణం.. వరుసగా ప్లాఫ్ల్లో ఉండడంతోనే ఇద్దరికీ బ్రేకప్ అయిందని రూమర్స్ వినిపించాయి. అయితే వీటిపై హర్మన్ తాజాగా స్పందించాడు. తన సినిమాలు రెండు, మూడు వరుసగా ప్లాఫ్ కావడంతో.. ఆ తరువాత కెరీర్‌పైనే పూర్తిగా తాను దృష్టి పెట్టానని, దాంతో ఆ సమయంలో ప్రియాంకకు సరిగా టైమ్ కేటాయించలేదని, అందువల్లే ఇద్దరి మధ్య దూరం పెరిగి.. బ్రేకప్ అయిందని వివరించాడు. అయినా.. విజయాలు అపజయాలు అనేవి సంబంధాలను చెడగొడతాయని తాను అనుకోవడం లేదంటూ గతంలో జరిగిన బ్రేకప్‌పై క్లారిటీ ఇచ్చాడు. -
మేము బ్రేకప్ అవ్వలేదు : నటుడు
ప్రముఖ నటుడు, భారత మాజీ సూపర్ మోడల్ మిలింద్ సోమన్, అంకిత కోన్వర్ల ప్రేమ జంట బ్రేకప్ అయిందని పుకార్లు హల్చల్ చేశాయి. ఈ వార్తలపై ఆ ప్రేమజంట స్పందించింది. మేము కలిసే ఉన్నాం విడిపోలేదని తాజాగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వారు ఫొటోలను పోస్ట్ చేశారు. 52 ఏళ్ల మిలింద్ 23 ఏళ్ల అంకితలు ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. తమ ప్రేమను ఈ జంట పెళ్లి వరకూ తీసుకు వచ్చింది. కాగా, వీరు పెళ్లికి రెండు రోజుల ముందు డబ్బు విషయంలో విడిపోయారనే వార్తలు బాలీవుడ్లో చక్కర్లు కొట్టాయి. దీంతో తాము విడిపోలేదని, ఇదంతా పుకార్లేనని తెలుపుతూ మిలింద్ ఇన్‌స్ట్రామ్‌లో అంకితతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేశాడు. అంకిత కూడా ఆ ఫోటోలను షేర్ చేసింది. ‘మంచిపై దృష్టి పెట్టండి. మంచి అలవాట్లతో మంచి జీవితాన్ని గడుపుతారు’ , చుట్టుపక్కల వారిని ప్రేమించండి’ అంటూ మిలిందర్ తమ ఫొటోలను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తమ సంతోషాన్ని తెలుపుతూ.. కామెట్స్ కూడా రాశారు. ‘ నాకు తెలిసి మీరు విడిపోరు. ఈ వార్తలు అన్ని పుకార్లే అనుకున్నా’ , మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది, జీవితాంతం ఇలానే కలిసి ఉండండి’ అంటూ అభిమానులు పోటోలపై కామెంట్స్ చేస్తున్నారు. మిలిందర్ అంకితను పెళ్లి చేసుకుంటే ఆయనకు ఇది రెండో పెళ్లి అవుతుంది. గతంలో ఫ్రెంచ్ నటి మైలీన్ జంపనోయినను మిలింద్ వివాహం చేసుకున్నారు. 2006 నుంచి 2009 వరకు వీరి దాంపత్య జీవితం కొనసాగింది. గతంలో కూడా మిలింద్, సూపర్ మోడల్ మధు సప్రేతో ప్రేమాయణం నడిపాడు. -
‘చిత్తుగా ఓడిపోతారు.. జాగ్రత్త!’
సాక్షి, ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మరోసారి శివ సేన పార్టీ ‘ఒంటరి పోటీ’ వ్యాఖ్యలపై స్పందించారు. శివ సేన గనుక అలా చేస్తే బీజేపీ కంటే దారుణంగా ఓడిపోతుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫడ్నవిస్ మాట్లాడుతూ... ‘‘2019 లోక్ సభ ఎన్నికల్లో ఒంటరి పోరు తప్పదని శివ సేన మమల్ని (బీజేపీ) బెదిరిస్తున్నారు. కానీ, వాళ్లు అలా చెయ్యరనే భావిస్తున్నాం. మేం ఓడిపోతే ఓడిపోవచ్చు. కానీ, బీజేపీతో పోలిస్తే చిత్తుగా ఓడేది మాత్రం శివ సేననే. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లే. అయినా రాజకీయాలంటేనే.. చెప్పేది ఒకటి-చేసేది ఒకటి కదా!. శివ సేన తొందరపాటు నిర్ణయాలు తీసుకోదనే భావిస్తున్నా’’అని తెలిపారు. కాగా, 2019లో జరగనున్న లోక్‌సభ, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా ఒంటరిగానే తాజాగా జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో శివసేన నిర్ణయించింది. బీజేపీ ప్రభుత్వం కేవలం పథకాల ప్రచారాలకు, ప్రకటనలకే డబ్బు ఖర్చు పెడుతోంది తప్ప చిత్తశుద్ధితో వాటిని అమలు చేయడం లేదనీ, ఇలాంటి పార్టీని అధికారం నుంచి దింపేయాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సమావేశంలో పిలుపునిచ్చారు కూడా. అయితే మిత్రపక్షం బీజేపీ మాత్రం ఈ కటీఫ్‌ను చాలా తేలికగా తీసుకుంది. -
బ్రేకప్ చెప్పిందని పగతో రగిలిపోతూ..
బెంగళూరు: ప్రియురాలు తనకు బ్రేకప్ చెప్పిందన్న కారణంగా ఆమెపై పగ పెంచుకున్నాడు ఓ వ్యాపారి. చివరికి ఆమెను అంతమొందించాలన్న ప్లాన్ బెడిసికొట్టడంతో కటకటాల పాలయ్యాడు. ప్రియుడితో పాటు మరో ఇద్దరిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆ వివరాలిలా ఉన్నాయి... బొమ్మనహళ్లికి చెందిన ప్రమోద్(32) బెంగళూరులో వ్యాపారం చేస్తున్నాడు. అతడికి కొన్నేళ్ల కిందట ఓ యువతి పరిచయమైంది. ఆపై వీరి పరిచయం ప్రేమగా మారింది. ఎనిమిదేళ్లు ప్రేమించుకున్న అనంతరం ఇటీవల భేదాభిప్రాయాలు రావడంతో ప్రమోద్‌కు ప్రేయసి బ్రేకప్ చెప్పేసింది. తనతో రిలేషన్‌ను తెగదెంపులు చేసుకుందన్న కారణంగా ప్రియురాలిపై వ్యాపారి ప్రమోద్ ఆగ్రహంతో ఉన్నాడు. ఈ క్రమంలో ఆమెను అసభ్యంగా వేధించాలని కుమార్ అనే యువకుడిని పురమాయించాడు. కుమార్ తరచుగా ప్రమోద్ ప్రేయసికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధింపులకు పాల్పడేవాడు. తన ప్రేయసిని గాయపరచాలని అవసరమైతే ఏం చేసేందుకైనా వెనుకాడవద్దని కుమార్‌కు చెప్పి, రూ.1.10 లక్షలు ఇచ్చాడు. ప్రమోద్ ప్రేయసిపై దాడి చేయాలని మరో ఇద్దరితో కలిసి కుమార్ ప్లాన్ చేశాడు. బన్సావాడిలో ఆఫీసు పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు యువతి సిద్ధమైంది. యువతి స్కూటీ వద్దకు రాగానే ముగ్గురు ఆమెను సమీపించారు. ఇద్దరు యువతిని గట్టిగా పట్టుకోగా కుమార్ కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఓ వైపు యువతి సాయం కోసం కేకలు వేస్తుండగా, మరోవైపు కుమార్ మూడుసార్లు కత్తితో పొడిచాడు. స్థానికులను చూసి భయంతో నిందితులు పరారయ్యారు. బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువతి చెప్పిన వివరాల ఆధారంగా ఆమె ప్రియుడు ప్రమోద్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదు చేశారు. తనకు బ్రేకప్ చెప్పినందుకే ప్రేయసిపై ఈ అఘాయిత్యానికి సుపారీ ఇచ్చినట్లు వ్యాపారి అంగీకరించాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న నాలుగో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. -
సల్మాన్‌కు ఆమె ఎందుకు కటీఫ్ చెప్పింది?
దేశంలో అత్యంత ముదురు బ్రహ్మచారి ఎవరంటే.. మొట్టమొదటి వినిపించే పేరు సల్మాన్ ఖాన్. ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రియురాళ్ల పేర్లు మార్చేస్తూ ఉండే సల్లూభాయ్.. గత కొంత కాలంగా మాత్రం ఒకే పేరు వినిపిస్తోంది. ఆమే రొమేనియా మోడల్ లులియా వాంటూర్. పార్టీలు, సినిమా ఫంక్షన్లు, చివరకు ఇంట్లో జరిగిన కార్యక్రమాల సమయంలోనూ వీళ్లిద్దరూ కలిసి కనిపించడంతో ఇక సల్లూభాయ్ బ్రహ్మచర్య వ్రతం ముగిసిపోయినట్లేనని, లులియాతో కలిసి జీవితాంతం సుఖంగా గడుపుతాడని అంతా అనుకున్నారు. అంతలోనే.. వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఇద్దరికీ చెడిపోయిందని, వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం లేదని సల్మాన్ సన్నిహిత వర్గాలు చెప్పాయి. అందుకు కారణాలేంటో కూడా ఎవరికీ తెలియలేదు. ఇటీవలే లులియా తన సొంత దేశానికి వెళ్లిపోయింది కూడా. అంతేకాదు, రొమేనియాలో అత్యంత విజయవంతమైన మహిళగా ఓ అవార్డు కూడా తీసుకుంది. సల్మాన్ గురించి ఆ అవార్డు తీసుకునే సమయంలో పెదవి విప్పని లులియా.. ఆ తర్వాత ఒక రొమేనియా పత్రికకు మాత్రం అన్నీ చెప్పిందట. ''సల్మాన్‌కు, నాకు ప్రేమ ఏమీ లేదు. ఇప్పుడంతా బాగానే ఉంది. సల్మాన్‌కు చాలామంది బాడీగార్డులు ఉన్నారు గానీ, నాకు రొమేనియాలోనే సురక్షితంగా ఉంది. నాకు ఇక్కడ బాడీగార్డులు అక్కర్లేదు'' అని ఆమె చెప్పారు. ఇంకా.. ''నాకు ఇంతకుముందే పెళ్లయింది. గతంలోనే నా భర్తను వదిలేశాను. కానీ, భారతదేశంలో మాత్రం నేను ఎవరినీ పెళ్లి చేసుకోలేదు, ఎవ్వరినీ వదిలేయలేదు'' అని కూడా ఆమె కుండ బద్దలు కొట్టింది. అయితే సల్మాన్‌తో ప్రేమ వ్యవహారం గురించి మాత్రం ఏమీ చెప్పలేదు. భారతీయ సంస్కృతికి అలవాటు పడటం ఎంత కష్టమో కూడా ఆమె తెలిపింది. తాను అక్కడ చాలా కాలం కష్టపడి పనిచేసినా, ఎక్కువగా తన వ్యక్తిగత జీవితం గురించే చర్చలు సాగాయన్నారు. గతంలో తాను ఆరునెలల పాటు భారతదేశంలో ఉన్నప్పుడు తాను చర్చించదలచుకోని చాలా అంశాలు జరిగాయని తెలిపారు. భారతీయ సంస్కృతి, ప్రజలు, వాళ్ల ఆలోచనా తీరు అన్నీ భిన్నంగా ఉంటాయన్నారు. అక్కడ మనకు ఎక్కువ వ్యక్తిగతం అంటూ ఉండదని, ఒకే ఇంట్లో ఎక్కువ మందితో కలిసి ఉండాలని చెప్పారు. వీధుల్లో వెళ్లేటప్పుడు ఫలానా పద్ధతిలోనే దుస్తులు వేసుకోవాలన్న విషయం కూడా తనకు అర్థం కాలేదని తెలిపారు. తన దుస్తులు చాలా కురచగా ఉన్నాయన్న విషయం ఆ తర్వాత అర్థమైందన్నారు. -
'నా జుట్టు చూడండి..ఎంత అందంగా కనిపిస్తుందో'
బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్, స్వీట్ హీరోయిన్ కత్రినాల ప్రణయగాధ వార్తల్లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. వీళ్లద్దరికి బ్రేక్ అప్ అయిందని కొందరు, కాదు కాదు.. పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్నారని మరికొందరు చెప్తున్నారు. ఏదేమైనా బీ టౌన్లో వీళ్లిద్దరూ బ్రేకింగ్ న్యూసే. తాజాగా రణ్ బీర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కత్రినా నా జీవితంలో ఓ ప్రభావవంతమైన పరిధి అంటూ భారీ మాట చెప్పాడుగానీ అసలు విషయంపై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. పోనీ కత్రినా ఏమైనా రివీల్ చేస్తుందా అంటే.. మీడియాని చూస్తేనే కస్సుమంటుంది. అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో కనిపించిన రణ్‌బీర్ సోదరి కరీనా కపూర్ ఖాన్‌ను 'రణ్-కాట్స్' లవ్‌స్టోరీ గురించి ప్రశ్నించింది మీడియా. వాళ్లిద్దరికీ బ్రేక్-అప్ అయిన మాట నిజమేనా అంటూ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కరీనా.. 'నేనిక్కడకు వచ్చిన కారణం అది కాదు, కాబట్టి నేను దీని గురించి మాట్లాడలేను. అది సరే.. నా జుట్టు చూడండి.. ఎంత అందంగా కనిపిస్తుందో' అంటూ అవాక్కయ్యే ఆన్సర్ ఇచ్చి చల్లగా జారుకుంది బెబో. -
'బ్రేకప్ నుంచి బయటపడలేదు'
లాస్ ఎంజెల్స్: తన భార్యతో విడిపోయిన బాధలో నుంచి తాను ఇంకా తేరుకోలేదని ప్రముఖ నటుడు, కమెడీయన్ నిక్ కెనాన్ అన్నాడు. అది నిజంగా తన గుండెను తొలిచివేసిన ఘటన అని ఆయన చెప్పారు. ఇప్పటికి ఇప్పట్లో తాను మరో కొత్త సంబంధాన్ని ఏర్పరుచుకునేందుకు సిద్ధంగా లేనని చెప్పాడు. కెనాన్ మనసుపడి ప్రముఖ గాయని మారియా క్యారీతో చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు. వారిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. వారికి ట్విన్స్ కూడా. అయితే, ఇటీవలె ఆమె కెనాన్ తో బ్రేకప్ చేసుకొని ఆస్ట్రేలియాకు చెందిన బిలియనీర్ జేమ్స్ పార్కర్ తో ఉంటోంది. అతడితో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఓ ఎంటర్ టైన్ మెంట్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ 'నేను ఇప్పుడు కొత్త రిలేషన్ పెట్టుకునేందుకు సిద్ధంగా లేను. ప్రతి రోజు నేను క్యారీతో తెగ మాట్లాడేవాడిని. కానీ ఈ రోజు ఒంటరిగా ఉండిపోయాను' అని ఆయన చెప్పుకొచ్చాడు. -
బ్రేకప్ తర్వాతే చాలా బాగున్నాడట!
లాస్ ఏంజిల్స్: ప్రేమ విఫలమైతే ఎవరైనా విషాదంలో మునిగిపోతారు. విరహంతో రగిలిపోతారు. కానీ హాలీవుడ్ ర్యాపర్ టైగా (26) మాత్రం తన గర్ల్‌ఫ్రెండ్ కిలీ జెన్నర్‌తో బ్రేకప్ అయ్యాకే చాలా బాగున్నాడట. రియాల్టీ టీవీ షో నటి అయిన కిలీ (18)తో రెండేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు టైగా. ఈ ఇద్దరూ మీడియా ముందు తెగ ప్రేమించేసుకున్నారు. సోషల్ మీడియాలో ప్రేమబాష్యాలు రాసుకున్నారు. అప్పుడప్పుడు దూరంగా ఉన్నా నిన్నమొన్నటి వరకు చాలా ప్రణయ సల్లాపాలు సాగించారు. ఈ ఇద్దరికీ ఈ మధ్య బ్రేకప్ అయింది. మరీ బ్రేకప్ అయిన తర్వాత 'మీరెలా ఉన్నారు' అని మీడియా ప్రశ్నించగా.. 'నాకేం చాలా బాగా ఉన్నాను. ఎప్పటిలాగే మరింత కష్టపడేందుకు ప్రయత్నిస్తున్నాను. మరింత ఉన్నత స్థానానికి ఎదగడానికి, గొప్ప వాటిని సాధించడానికి కృషి చేస్తున్నాను' అని చెప్పాడు. అటు కిలీ మాత్రం తమ బ్రేకప్ గురించి ఇంతవరకు పబ్లిగ్గా స్పందించలేదు. ప్రస్తుతం తల్లి క్రిస్ జెన్నర్ ఇంట్లో ఉన్నానని, మరికొన్ని రోజులూ ఇక్కడే ఉంటానని ఈ భామ 'స్నాప్‌చాట్' వీడియోస్‌లో తెలిపింది. బ్రేకప్‌తో ఈమె తిరిగి సొంతింటికి వెళ్లిపోయినట్టు చెప్తున్నారు. గతంలో ఇతర అమ్మాయిలతో సాగించిన ప్రేమ సల్లాపాలపై అబద్ధాలు చెప్పడం, విశ్వసనీయంగా ఉండకపోవడంతో టైగాతో కిలీ తెగదెంపులు చేసుకుందట. గతంలో వీరు ఒకసారి బ్రేకప్ చేసుకున్నప్పిటికీ మళ్లీ కలిసిపోయారు. ఈసారి మాత్రం అలా కలిసే చాన్సే లేదంటున్నారు సన్నిహితులు. -
భార్య కళ్లుగప్పి.. ప్రియురాలితో హీరో చెట్టాపట్టాల్!
హాలీవుడ్ జంట బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ బ్రేకప్ కథనాలు మళ్లీ జోరందుకున్నాయి. భార్య జోలీ కళ్లుగప్పి.. పిట్ తన ప్రియురాలు మరియన్ కాటిల్లార్డ్తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడని తాజాగా హాలీవుడ్ కోడై కూస్తున్నది. జోలీతో తెగదెంపులు చేసుకోవాలనే ఉద్దేశంతోనే కాటిల్లార్డ్తో పిట్ ప్రణయ సల్లాపాలు నెరుపుతున్నట్టు హాలీవుడ్ వర్గాల భోగట్టా. ప్రస్తుతం పిట్, కాటిల్లార్డ్ ప్రస్తుతం 'ఫైవ్ సెకండ్స్ ఆఫ్ సైలెన్స్ ఇన్ ఇంగ్లండ్' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. 'ఈ ఇద్దరి మధ్య ఏదో గూడుపుఠాణి నడుస్తోంది. వారి మధ్య రహస్యంగా జరగకూడనిది జరుగుతోంది. తమ మధ్య ఉన్నదానిని రహస్యంగా ఉంచి పబ్లిగ్గా చూడటానికి మాత్రం తమ మధ్య ఏమీ లేనట్టు వారు నటిస్తున్నారు' అని ఈ సినిమాకు సంబంధించిన ఇన్సైడర్లు చెప్పినట్టు 'హాలీవుడ్లైఫ్.కామ్' తెలిపింది. (చదవండి: ఔను! వాళ్లు కూడా విడిపోతున్నారట!) 'గతంలో బ్రాడ్-జోలీ జంట ఎవరికివారుగా చాటుమాటుగా చిన్నపాటి సరస సల్లాపాలు నెరిపినా.. అవి పెద్ద దూరం వెళ్లకపోవడంతో వీరి బంధంపై ఆ ప్రభావం పడలేదు. కానీ బ్రాడ్ ఇటీవలికాలంలో మరియన్‌కు ఎమోషనల్‌గా దగ్గరవుతున్నాడు. ఇది ఈ జంట దాంపత్య జీవితంపై ప్రభావం చూపే అవకాశముంది. ఇది వీరి పెళ్లి పెటాకులవ్వడానికి దారితీయవచ్చు' అని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. చైన్ స్మోకింగ్, మద్యం వంటి అలవాట్ల కారణంగా భారీగా బరువు తగ్గిన ఏంజెలినా జోలీ ప్రస్తుతం 35 కిలోల బరువుకు పడిపోయి.. బలహీనంగా మారిపోయిందని, దాంతో ఆమెను బ్రాడ్ పట్టించుకోవడం మానేశాడని గతంలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పదకొండు ఏళ్ల తమ వైవాహిక జీవితానికి తెరదించాలని ఈ జంట భావించినట్టు, త్వరలోనే వీరు విడాకులు తీసుకోబోతున్నట్టు గతంలోనూ కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. -
కోహ్లి ఈ ఫొటోతో చెప్పకనే చెప్పేశాడా?
ప్రపంచమంతా ప్రేమోత్సవంలో మునిగిపోయింది. వాలెంటైన్స్ డే కోసం సన్నాహాలు చేసుకుంటోంది. కానీ బాలీవుడ్ మాత్రం అందుకు భిన్నంగా ఈ ఏడాది బ్రేకప్‌లతో సతమతమవుతోంది. తాజాగా అందమైన ప్రేమజంటగా పేరొందిన విరాట్ కోహ్లి, అనుష్క శర్మ కూడా వీడిపోయినట్టు తెలుస్తోంది. తమ బ్రేకప్ గురించి అధికారికంగా కోహ్లి-అనుష్క ఏమీ చెప్పకపోయినా.. తాజాగా కోహ్లి సోషల్ మీడియాలో పెట్టిన ఓ ఫొటో మాత్రం బాగా హల్చల్ చేస్తోంది. కోహ్లి ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 'హార్ట్ బ్రోకెన్' (గుండె బద్దలైంది) క్యాప్షన్‌తో ఓ ఫొటో షేర్ చేశాడు. కానీ దానిని వెంటనే తొలగించాడు. దీనిపై చాలా గుసగుసలే వినిపించాయి. కానీ కోహ్లి తాజాగా ఆ ఫొటోను మళ్లీ పోస్టు చేశాడు. 'ఈ ఫొటోను డిలీట్ చేయడం నేరంగా అనిపించింది. అందుకే మళ్లీ పెట్టాను. సారీ గాయిస్' అంటూ కామెంట్ చేశాడు. అనుష్కతో దూరమైన తర్వాత కోహ్లి ఈ ఫొటో పెట్టడం ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఓ వాణిజ్య ప్రకటన షూటింగ్లో తొలిసారి కలుసుకున్న భారత క్రికెటర్ కోహ్లి, హీరోయిన్ అనుష్క 2013 నుంచి డేటింగ్ కొనసాగిస్తున్నారు. అనుష్కతో బ్రేకప్ తర్వాత ఒంటరిగానే ఎంతో ఆనందముందంటూ కోహ్లి ఇటీవల ఓ పార్టీలో డ్యాన్స్‌తో హల్చల్ చేసినట్టు కథనాలు వస్తున్నాయి. -
సోలోగానే హ్యాపీగా ఉందంటున్న కోహ్లి!
ప్రేమపక్షులు విరాట్ కోహ్లి, అనుష్క శర్మ మధ్య బ్రేకప్ వ్యవహారం నిత్యం వార్తల్లో చక్కర్లు కొడుతూనే ఉంది. అధికారికంగా ఇటు కోహ్లి గానీ, అటు అనుష్క శర్మగానీ ఈ విషయంలో ఏమీ చెప్పనప్పటికీ వారు విడిపోయారన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదని తెలుస్తోంది. దీనికితోడు ఒంటరిగా ఉండటంలోనే సుఖమున్నదని ఇప్పుడు కోహ్లి పాటలు పాడుకుంటున్నాడట. ప్రేమ విఫలమైనందుకు దేవదాసులా బాధపడటానికి బదులు పార్టీలు, డ్యాన్సులతో అతడు ఉత్సాహంగానే కనిపిస్తున్నాడని సన్నిహితులు చెప్తున్నారు. ఇటీవల నటుడు అంగద్ బేడి పుట్టినరోజు పార్టీ ముంబైలోని ఓ నైట్ క్లబ్లో జరిగింది. ఈ విందుకు హాజరైన కోహ్లి ఉత్సాహంగా అందరినీ పలుకరించడమే కాదు.. 'నేను ఒంటరిని.. చలో డ్యాన్స్ చేద్దాం' అంటూ స్టెప్పులు కూడా వేశాడని ముంబై మిర్రర్ పత్రిక తెలిపింది. అనుష్క ఒక 'కంట్రోలింగ్ గర్ల్‌ఫ్రెండ్' అని, తాను ఎప్పుడూ ఆమె చుట్టూ జపం చేయాల్సి వచ్చేదని అతడు సన్నిహితులతో అంటుండగా విన్నామని ఈ పార్టీకి హాజరైన విశ్వసనీయవర్గాలు తెలిపాయి. నిజానికి భారత క్రికెటర్ కోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క తమ వృత్తిలో బిజీబిజీ షెడ్యూళ్లతో ఇటీవల కాలంలో గడిపారు. ఈ మధ్యకాలంలోనే వారి మధ్య విభేదాలు వచ్చినట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రేమికుల రోజున అనుష్కతో గడుపడానికి భారత్-శ్రీలంక టీ-20 సిరీస్ నుంచి కోహ్లి విశ్రాంతి తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే, అనుష్క మాత్రం సల్మాన్‌ఖాన్‌తో 'సుల్తాన్' సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. వీరు విడిపోయారన్న వార్తల నేపథ్యంలో గతంలో అనుకున్నట్టు ఈ జంట పెళ్లి చేసుకునేది అనుమానాస్పదంగా కనిపిస్తోంది. -
నో డౌట్.. వాళ్లు విడిపోయారు!
చూడబోతే 2016 'బ్రేక్ అప్ ఇయర్'గా రికార్డులకెక్కేలా ఉంది. ఈ ఏడాది ఆరంభం నుంచి బాలీవుడ్ ప్రముఖ జంటలంతా 'బ్రేక్ అప్' బాట పట్టారు. తాజాగా క్రేజీ జంట విరాట్ కోహ్లి-అనుష్క శర్మలు కూడా అదే దారిలో నడిచినట్లు రుజువులతో సహా నిరూపిస్తున్నారు సినీ డిటెక్టివ్లు. ఎప్పుడూ తమ విహారయాత్రలతో వార్తల్లో నిలిచే ఈ ప్రేమ పక్షులు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. నెలరోజుల క్రితమే వీరు విడిపోయారని చెప్పడానికి పలు అంశాలు కూడా అనుకూలిస్తున్నాయి. ఇన్ స్టాగ్రామ్‌లో 'హార్ట్ బ్రేక్'.. కొన్ని రోజుల క్రితం విరాట్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ పేజీలో సెల్ఫీ పోస్ట్ చేసి 'హార్ట్ బ్రేక్' అంటూ దానికో క్యాప్షన్ జోడించాడు. ఆ 'హార్ట్ బ్రేక్' క్యాప్షన్ బ్రేకింగ్ న్యూస్ అవుతుందని భావించాడో ఏమో వెంటనే దాన్ని తొలగించాడు. కానీ ఆ కాస్త వ్యవధిలోనే ఫ్యాన్స్ అసలు విషయాన్ని పసిగట్టేశారు. విరాట్ అంతటితో ఊరుకున్నాడా.. 'హార్ట్ బ్రేక్' క్యాప్షన్ తొలగించిన వెంటనే అనుష్కను 'అన్ ఫాలో' చేసేశాడు. దాంతో అభిమానులు ఓ నిర్ధారణకు వచ్చేశారు. గడ్డం కూడా తీసేశాడు.. సాధారణంగా పంజాబీల వివాహ సమయంలో జరిగే కొన్ని వేడుకల్లో వరుడు గడ్డంతో ఉండటం వారి సంప్రదాయం. వివాహం కోసమే విరాట్ గడ్డం పెంచుతున్నాడని ఓ భారీ రూమర్. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ విరాట్ గడ్డం తీసేసి కనబడుతున్నాడు. అనుష్క పెళ్లికి నిరాకరించడంతోనే విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఇక వారి సన్నిహితుల కథనం ప్రకారం.. విరాట్-అనుష్కలు నెల క్రితం విడిపోయిన మాట నిజమేనని, అయితే వారిద్దరూ ఇష్టపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వారిద్దరూ కెరీర్ మీద సీరియస్‌గా దృష్టి పెట్టాలనుకుంటున్నారని, అయినా ఆ నిర్ణయం విరాట్‌ది కాదని చెబుతున్నారు. కాగా విరాట్ టీ ట్వంటీ ప్రిపరేషన్ లో బిజీగా ఉండగా.. అనుష్క సుల్తాన్ షూటింగ్ లో బిజీ. మొత్తానికి గడసరి క్రికెటర్, సొగసరి హీరోయిన్ల ప్రేమకథ ఇలా ఊహించని మలుపు తిరిగింది. -
ఔను! వాళ్లు కూడా విడిపోతున్నారట!
-
ఔను! వాళ్లు కూడా విడిపోతున్నారట!
ఈ ఏడాది సెలబ్రిటీ దంపతులకు ఏమాత్రం కలిసివచ్చినట్టు కనిపించడం లేదు. అన్యోన్యంగా తిరిగిన వాళ్లు, చెట్టాపట్టాలేసుకొని మీడియా ముందు కనిపించిన వారూ.. చిలుకా గోరింకలు అంటే ఉదాహరణ అనిపించిన జంటలు సైతం ఈ ఏడాది మొదలైంది మొదలు తలోబాట పడుతున్నారు. ఇన్నాళ్ల బంధానికి విడాకులు ఇస్తూ వేరవుతున్నారు. ఇప్పటికే రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్‌ల మధ్య బ్రేకప్ ఖాయమైపోయింది. 16 ఏళ్ల పెళ్లి బంధాన్ని తెగదెంపులు చేసుకుంటూ ఫర్హాన్ అఖ్తర్, అధునా అఖ్తర్ వేరవుతున్నట్టు ప్రకటించారు. ఇక జాబితాలో చేరేదిశగా హాలీవుడ్‌లోనే అన్యోన్యమైన జంటగా పేరొందిన ఏంజిలీనా జోలీ, బ్రాడ్ పిట్ సాగుతున్నారు. నిజమే ఈ దంపతుల అభిమానులకు ఇది షాకింగ్ వార్తనే. అయినా వ్యక్తిగత కారణాల వల్ల ఈ జంట తమ అందమైన వైవాహిక అనుబంధానికి తెరదించేదిశగా సాగుతున్నదని హాలీవుడ్లైఫ్.కామ్ వెల్లడించింది. తనకున్న సమయాన్ని ఏంజెలీనా పిల్లలు, సామాజిక కార్యక్రమాలకు వెచ్చించడంతోనే సరిపోతున్నదని, దీంతో బ్రాడ్‌తో గడుపడానికి ఆమె వద్ద పెద్దగా సమయం ఉండటం లేదని ఆ వెబ్సైట్ వెల్లడించింది. అంతేకాకుండా ఏంజిలీనాకు కొన్ని వ్యక్తిగత సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయని, దీంతో ఆమె తరచూ అజ్ఞాతంలో గడుపుతుండటం బ్రాడ్ భరించలేకపోతున్నాడని, ఈ నేపథ్యంలో తమ అనుబంధాన్ని తెంచుకోవాలని ఈ జంట నిర్ణయించిందని ఆ వెబ్సైట్ తన కథనంలో తెలిపింది -
ప్రేమించినోడికి బైబై చెప్పింది
వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒక్కటవుదామని పోలీసులను ఆశ్రయించారు. యువతి తల్లిదండ్రులు వచ్చి కన్నీటిపర్యంతమయ్యారు. తమ పేగు బంధాన్ని కుమార్తెకు గుర్తు చేశారు. కరిగిన యువతి తల్లిదండ్రుల వెంట నడిచింది. ప్రేమించినోడికి బైబై చెప్పింది. సదరు యువకుడు వాహనం వెంట పడినా ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ సంఘటనకు ఆదివారం గిద్దలూరు పోలీసుస్టేషన్ వేదికగా నిలిచింది. గిద్దలూరు రూరల్ : మండలంలోని సూరేపల్లె గ్రామానికి చెందిన బాషా విశాఖపట్నంలో బీటెక్ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఎంటెక్ చదువుతున్న యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఇంతలో ఆ యువతికి వేరే వ్యక్తితో పెద్దలు వివాహం కుదిర్చారు. పెళ్లి ఇష్టం లేక ఆమె బాషాతో కలిసి గిద్దలూరు వచ్చింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. ఇంతలో యువతి తల్లిదండ్రులు గిద్దలూరు వచ్చారు. తమ కుమార్తెకు నచ్చజెప్పారు. మధ్యలో చదువు ఆగిపోతుందన్నారు. పేగు బంధాన్నీ సదరు గుర్తు చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె తల్లిదండ్రుల వెంట నడి చేందుకు సిద్ధమైంది. స్నేహితుడు బాషా ఎంత బతిమాలినా ఆమె పట్టించుకోలేదు. యువతి వెళ్తున్న వాహనం వెంట బాషా పరుగులు తీశాడు. ఒకసారి ఆలోచించాలని వేడుకున్నాడు. ఇద్దరి మధ్య ప్రేమనూ గుర్తు చేశాడు. చివరకు పేగు బంధం ముందు ప్రేమ ఓడిపోయింది. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేదాని కన్నా ఆ సన్నివేశం పలువురిని ఆలోచింపజేసింది. -
రాణా.. త్రిషల మధ్య ఆ రాగిణి ఎవరు?
ఎన్నాళ్ల నుంచో స్నేహంగా ఉంటున్న రాణా.. త్రిషలు ఎందుకు విడిపోయారు? వాళ్లిద్దరి మధ్య విభేదాలకు కారణం ఎవరు? అనధికారికంగా వస్తున్న కథనాల ప్రకారం, కన్నడ సుందరి రాగిణీ ద్వివేది కారణంగానే ఇలా జరిగిందని వినిపిస్తోంది. బాహుబలిలో నటిస్తున్న రాణా గతంలో రాగిణితో కలిసి ఉన్నట్లుగా ఉన్న ఫొటోలు సైతం కొన్ని వెబ్సైట్లలో దర్శనమిచ్చాయి. అయితే, రాగిణి మాత్రం.. ఇవన్నీ ఒట్టి వదంతులేనని రాగిణి చెబుతోంది. ఏదో అవార్డు కార్యక్రమానికి జరిగిన రిహార్సల్స్‌లో తాము పాల్గొన్న ఫొటోను తీసుకుని ఇలా అంటగట్టేస్తున్నారని రాగిణి వాపోయింది. అసలు రాణాతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసింది. ఈ వ్యవహారాలపై రాణా కూడా తీవ్రంగానే స్పందించాడు. ఏదో ఒక ఫొటో తీసేసుకుని.. దాన్నుంచి వార్తలు వండటం చాలా దారుణమైన విషయమని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. త్రిష, రాణా కలిసి ఇటీవల సైమా అవార్డుల కార్యక్రమంలో కనిపించారు. -
రిసెప్షన్ పార్టీలో 'ఆ జంట' స్పెషల్ ఎట్రాక్షన్
ఇటీవల కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉన్న హీరో, హీరోయిన్లు త్రిష, రానా దగ్గుబాటి మరోసారి హైలెట్ అయ్యారు. శనివారం కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో ఈ జంట హల్చల్ చేసింది. వీరిద్దరూ చేతిలో చేయి వేసుకుని ఈ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. ఇక గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నా త్రిష మాత్రం ఎప్పటికప్పుడు మీడియాలో నానుతూనే ఉంది. తాజాగా దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డుల ఫంక్షన్లోనూ వీరిద్దరూ కలిసే కనిపించారు. ఈ వేడుక తర్వాత బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇచ్చిన లేట్‌నైట్ పార్టీలో రానా, త్రిష బాగా ఎంజాయ్ చేశారనీ గుసగుసలు వినిపించాయి. అంతకు ముందు అమెరికాలో తెలుగు సంఘాల కార్యక్రమానికి అతిథిగా వెళ్లిన రానా అక్కడ త్రిషతో ఊరంతా చక్కర్లు కొట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. చాలా ప్రయివేటు కార్యక్రమాల్లోనూ ఈ జంట ఎక్కువగా కనిపించింది. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లోనూ రానా, త్రిషల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అని పుకార్లు షికార్లు చేసినా వారిద్దరు మాత్రం అబ్బే అదేమీ లేదు... మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని చిలకపలుకులు చెప్పటం విశేషం. అలాగే వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు వెలువడినా అవన్ని రూమర్స్ అని కొట్టిపారేశారు. గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ బ్రేకప్ అయ్యిందనే వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా త్రిష, రానా జంట మరోసారి వార్తల్లో నిలిచారనటంలో సందేహం లేదు. -
శింబుకు కటీఫ్ చెప్పిన హన్సిక
-
మళ్లీ ఒక్కటవుతున్న శింబూ,నయన్
-
రానాతో కటీఫ్?
టాలీవుడ్ యువ నటుడు రానాతో త్రిష ప్రేమాయణం అంటూ ప్రచారం జోరుగా సాగింది. అందుకు తగ్గట్టుగానే ఈ జంట ఏ సినీ కార్యక్రమంలో అయినా కలిసే పాల్గొనేవారు. ఏ కార్యక్రమంలో అయినా వీరున్నారంటే ఫొటోగ్రాఫర్లకు చేతినిండా పనే అన్నంతగా ఉండేది. తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాల్లోనే కాదు మలేషియా, సింగపూర్లలో జరిగిన కార్యక్రమాలకు ఈ జంట ఎట్రాక్షన్‌గా నిలిచేది. దీంతో వీరి మధ్య ప్రేమ హైస్పీడ్‌లో నడుస్తోందని వదంతులు వచ్చాయి. అయితే ఈ వ్యవహారం గురించి త్రిష వద్ద ఎప్పుడు ప్రస్తావించినా రానా తనకు మంచి మిత్రుడని బదులిచ్చేవారు. అలాంటిదిప్పుడు వీరి మధ్య ప్రేమ కాదు, స్నేహం కూడా బెడిసికొట్టిందని కోలీవుడ్ టాక్. అంతగా సన్నిహితంగా ఉన్నవారు ఎందుకిలా మారారన్నది అంతుచిక్కని ప్రశ్న. త్రిష, రానాల మధ్య ప్రేమ బ్రేకప్ అయ్యిందని ప్రచారం జరుగుతోంది. త్రిష నటించిన ఎండ్రెండ్రుం పున్నగై మంచి విజయం సాధించింది. ఈ బ్యూటీ నటించిన మరో చిత్రం భూలోకం విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం కన్నడ చిత్రంలో పునిత్ రాజకుమార్ సరసన నటిస్తున్నారు. రానా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న బాహుబలి, రుద్రమ దేవి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలాంటి వీరిద్దరి మధ్య పొరపొచ్చాలకు కారణం ఏమిటో మరి. -
బ్రేక్ అప్ మూవీ
-
'బ్రేక్ అప్' సినిమా యూనిట్‌తో సాక్షి వేదిక
-
ప్రేమలో మలుపులు...
రణధీర్, స్వాతీదీక్షిత్ జంటగా అమర్ కామేపల్లి దర్శకత్వంలో ఒయాసిస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన చిత్రం ‘బ్రేక్అప్’. వచ్చే నెల మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రకథను కొంతమంది నిర్మాతలకు చెబితే, నిర్మించడానికి ముందుకు రాలేదు. దాంతో యూఎస్‌లో ఉన్న నా మిత్రులతో కలిసి, నిర్మించాను. ఇది రొమాంటిక్ సైంటిఫిక్ థ్రిల్లర్. ప్రేమలోని పలు మలుపులను చూపించే చిత్రం. స్క్రీన్‌ప్లే చాలా ఫ్రెష్‌గా ఉంటుం ది. మంచి పాటలు కుదిరాయి. ఆడియో విజయం సాధించింది. అలాగే టీజర్‌ను యూట్యూబ్‌లో లక్షమందికి పైగా వీక్షించారు. సినిమా కూడా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. రణధీర్, స్వాతీదీక్షిత్, ప్రశాంత్ సాగర్, సుమలత తదితర యూనిట్ సభ్యులు సినిమా విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారు.