'నా జుట్టు చూడండి..ఎంత అందంగా కనిపిస్తుందో' | Here's what Kareena Kapoor has to say about the Ran-Kat break up | Sakshi
Sakshi News home page

'నా జుట్టు చూడండి..ఎంత అందంగా కనిపిస్తుందో'

Published Fri, Aug 26 2016 6:51 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

'నా జుట్టు చూడండి..ఎంత అందంగా కనిపిస్తుందో'

'నా జుట్టు చూడండి..ఎంత అందంగా కనిపిస్తుందో'

బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్బీర్ కపూర్, స్వీట్ హీరోయిన్ కత్రినాల ప్రణయగాధ వార్తల్లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. వీళ్లద్దరికి బ్రేక్ అప్ అయిందని కొందరు, కాదు కాదు.. పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్నారని మరికొందరు చెప్తున్నారు. ఏదేమైనా బీ టౌన్లో వీళ్లిద్దరూ బ్రేకింగ్ న్యూసే.

తాజాగా రణ్ బీర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కత్రినా నా జీవితంలో ఓ ప్రభావవంతమైన పరిధి అంటూ భారీ మాట చెప్పాడుగానీ అసలు విషయంపై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. పోనీ కత్రినా ఏమైనా రివీల్ చేస్తుందా అంటే.. మీడియాని చూస్తేనే కస్సుమంటుంది.

అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో కనిపించిన రణ్బీర్ సోదరి కరీనా కపూర్ ఖాన్ను 'రణ్-కాట్స్' లవ్స్టోరీ గురించి  ప్రశ్నించింది మీడియా. వాళ్లిద్దరికీ బ్రేక్-అప్ అయిన మాట నిజమేనా అంటూ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కరీనా.. 'నేనిక్కడకు వచ్చిన కారణం అది కాదు, కాబట్టి నేను దీని గురించి మాట్లాడలేను. అది సరే.. నా జుట్టు చూడండి.. ఎంత అందంగా కనిపిస్తుందో' అంటూ అవాక్కయ్యే ఆన్సర్ ఇచ్చి చల్లగా జారుకుంది బెబో. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement