రణ్‌బీర్, కత్రినాల విషయం మాట్లాడను | I'd never discuss Ranbir Kapoor, Katrina Kaif's matter, says Kareena kapoor | Sakshi
Sakshi News home page

రణ్‌బీర్, కత్రినాల విషయం మాట్లాడను

Published Tue, Feb 23 2016 7:00 PM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM

రణ్‌బీర్, కత్రినాల విషయం మాట్లాడను

రణ్‌బీర్, కత్రినాల విషయం మాట్లాడను

ముంబై: వివాహ బంధం వరకు వెళ్లకనే బాలీవుడ్ యువజంట రణ్బీర్ కపూర్, కత్రినా కైఫ్ విడిపోయారు. కత్రినా తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్కు మళ్లీ చేరువైందని కూడా బాలీవుడ్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రణ్‌బీర్, కత్రినా ఈ విషయం గురించి పెదవి విప్పకపోయినా బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్ కజిన్ కరీనా కపూర్ను ఇదే విషయం ప్రశ్నించగా.. పబ్లిక్లో చర్చించనని స్పష్టం చేసింది.

'రణ్బీర్ ఈ విషయం (కత్రినాతో బంధం) గురించి నాతో మాట్లాడినా, మీడియాలో ఎప్పుడూ చర్చించను. ఇది పూర్తిగా వ్యక్తిగత విషయం. నా తమ్ముడంటే ఇష్టం. అతడికి మంచి జరగాలని కోరుకుంటున్నా. రణ్బీర్-కత్రినాలకు సంబంధించిన ఏ ప్రశ్నకూ బదులివ్వను' అని కరీనా కపూర్ చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement