అతను - ఆమె - ఓ అక్క! | Ranbir-Katrina's love life | Sakshi
Sakshi News home page

అతను - ఆమె - ఓ అక్క!

Published Mon, Jun 6 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM

అతను - ఆమె - ఓ అక్క!

అతను - ఆమె - ఓ అక్క!

గాసిప్
అతను - రణబీర్ కపూర్. హ్యాండ్‌సమ్‌గా ఉండే ఇతగాణ్ణి బాలీవుడ్‌లో చాక్లెట్ బోయ్ అంటారు. ఆమె - కత్రినా కైఫ్. ఈమెను హాట్ గాళ్ అంటారు. అక్క - కరీనా కపూర్. ఈవిడగారు క్రేజీ హీరోయిన్. రణబీర్‌కి అక్క అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ముగ్గురి మధ్య ఓ విషయం గురించి చర్చ జరుగుతోందట. గాడంగా ప్రేమించుకుని, విడిపోయిన రణబీర్, కత్రినాలను మళ్లీ కలపడానికి అక్క హోదాలో కరీనా ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. అయితే రణబీర్, కత్రినా మాత్రం బ్రేకప్‌కి టాటా చెప్పి ‘ప్యాచప్’కి వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా లేరని బోగట్టా.

‘‘రణబీర్, కత్రినా జంట చాలా బాగుంటుంది. కత్రినా నా తమ్ముడికి తగ్గ అమ్మాయి. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది’’ అని ఇటీవల ఓ సందర్భంలో కరీనా బహిరంగంగానే అన్నారు. అనడం మాత్రమే కాదు.. ఆ జంటను కలపడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. మరి.. కజిన్ కరీనా మాటను రణబీర్ వింటారా? కరీనా అంటే గౌరవం ఉన్న కత్రినా ఆమె మాటను అంగీకరిస్తారా?.. కాలమే చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement