అలా జరిగితే నన్ను నేను చంపుకుంటా: నటి | Kareena kapoor says I will kill myself on this | Sakshi
Sakshi News home page

అలా జరిగితే నన్ను నేను చంపుకుంటా: నటి

Published Tue, Sep 27 2016 8:14 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

అలా జరిగితే నన్ను నేను చంపుకుంటా: నటి

అలా జరిగితే నన్ను నేను చంపుకుంటా: నటి

ఒకప్పటి ప్రేమికులు రణ్‌బీర్‌ కపూర్‌, కత్రినా కైఫ్‌ బ్రేకప్‌ చేసుకొని దాదాపు పది నెలలు పూర్తవుతున్నది. విడిపోయి ఎవరి మానాన వారు సైలెంట్‌గా బతుకుతున్నారు. కానీ వారి బ్రేకప్‌ కు సంబంధించిన వార్తలు ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

తాజాగా రణ్‌బీర్‌ సోదరి కరీనా కపూర్‌ను ఈ మాజీ ప్రేమికుల గురించి ఓ విచిత్రమైన ప్రశ్నను అడిగారు. ఆమె అంతే విచిత్రంగా సమాధానం చెప్పింది. కరీనా కపూర్‌ ఇటీవల వోగ్‌ మ్యాగజీన్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా విలేకరి.. రణ్‌బీర్‌, కత్రినతో కలిసి మీరు ఒకే లిఫ్ట్‌ (ఎలివేటర్‌)లో వెళ్లాల్సి వస్తే.. ఏం చేస్తారు? అని ప్రశ్నించాడు. 'ఓ గాడ్‌! నన్ను నేను చంపుకుంటా' అని కరీన ఫన్నీగా బదులిచ్చింది. రణ్‌బీర్‌- కత్రిన ప్రేమలో ఉన్నప్పుడు కత్రినతో కరీన పలుసార్లు  సన్నిహితంగా కనిపించింది. 2013లో కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొన్న కరీన.. కత్రిన తన మరదలు అంటూ చిలిపి వ్యాఖ్యలు చేసింది. రణ్‌బీర్‌-కత్రిన టీజ్‌ చేసేలా ఆ షోలో కామెంట్స్‌ కూడా చేసింది.      
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement