
కోహ్లి ఈ ఫొటోతో చెప్పకనే చెప్పేశాడా?
బాలీవుడ్ మాత్రం అందుకు భిన్నంగా ఈ ఏడాది బ్రేకప్‌లతో సతమతమవుతోంది.
ప్రపంచమంతా ప్రేమోత్సవంలో మునిగిపోయింది. వాలెంటైన్స్ డే కోసం సన్నాహాలు చేసుకుంటోంది. కానీ బాలీవుడ్ మాత్రం అందుకు భిన్నంగా ఈ ఏడాది బ్రేకప్‌లతో సతమతమవుతోంది. తాజాగా అందమైన ప్రేమజంటగా పేరొందిన విరాట్ కోహ్లి, అనుష్క శర్మ కూడా వీడిపోయినట్టు తెలుస్తోంది. తమ బ్రేకప్ గురించి అధికారికంగా కోహ్లి-అనుష్క ఏమీ చెప్పకపోయినా.. తాజాగా కోహ్లి సోషల్ మీడియాలో పెట్టిన ఓ ఫొటో మాత్రం బాగా హల్‌చల్ చేస్తోంది.
కోహ్లి ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో 'హార్ట్ బ్రోకెన్' (గుండె బద్దలైంది) క్యాప్షన్‌తో ఓ ఫొటో షేర్ చేశాడు. కానీ దానిని వెంటనే తొలగించాడు. దీనిపై చాలా గుసగుసలే వినిపించాయి. కానీ కోహ్లి తాజాగా ఆ ఫొటోను మళ్లీ పోస్టు చేశాడు. 'ఈ ఫొటోను డిలీట్ చేయడం నేరంగా అనిపించింది. అందుకే మళ్లీ పెట్టాను. సారీ గాయిస్' అంటూ కామెంట్ చేశాడు. అనుష్కతో దూరమైన తర్వాత కోహ్లి ఈ ఫొటో పెట్టడం ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది.
ఓ వాణిజ్య ప్రకటన షూటింగ్‌లో తొలిసారి కలుసుకున్న భారత క్రికెటర్ కోహ్లి, హీరోయిన్ అనుష్క 2013 నుంచి డేటింగ్ కొనసాగిస్తున్నారు. అనుష్కతో బ్రేకప్ తర్వాత ఒంటరిగానే ఎంతో ఆనందముందంటూ కోహ్లి ఇటీవల ఓ పార్టీలో డ్యాన్స్‌తో హల్‌చల్ చేసినట్టు కథనాలు వస్తున్నాయి.