Actress Sanya Malhotra Reveals Reason Behind Her Love Relationship Breakup - Sakshi
Sakshi News home page

Sanya Malhotra Breakup: చివరి బ్రేకప్‌ నా హృదయాన్ని కదిలించింది

Published Fri, Dec 3 2021 5:45 PM | Last Updated on Sat, Dec 4 2021 10:14 AM

Sanya Malhotra About Her Long Distance Relation Break Up - Sakshi

Sanya Malhotra About Her Last Break 4 Years Love: ఆమీర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దంగల్‌’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సన్యా మల్హోత్రా.  ఈ క్రమంలో సన్యాకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో ఆమె సినిమాలు, షోలు చేస్తూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది. సినిమాలే కాకుండా అప్పుడప్పుడ సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్యా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది.

ఈ మేరకు సన్యా మాట్లాడుతూ తన చివరి బ్రేకప్‌కు సంబంధించిన చేదు అనుభవాలను గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయ్యింది. నాలుగేళ్ల రిలేషన్‌ బ్రేకప్‌ అనంతరం తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని, డిప్రెషన్‌ నుంచి బయట పడేందుకు మెంటల్‌ హెల్త్‌పై ఫోకస్‌ పెట్టడం నేర్చుకున్నానని చెప్పింది. 2020 అందరికి చేదు అనుభవం ఇస్తే నాకు మాత్రం మంచి ఏడాదిగా మిగిలిపోయిందంటూ సన్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఢిల్లీలో ఉన్నప్పుడు ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డాను. నాలుగేళ్ల లాంగ్‌ రిలేషన్‌, చివరికి బ్రేకప్‌, ఈ ప్రేమ తాలుకు జ్ఞాపకాలు నా హృదయాన్ని కదిలించాయి. విడిపోవడం అనేది అన్నింటికంటే ఎక్కువగా బాధించే విషయం అది.

కానీ మనల్ని వద్దనుకునే వారి కోసం ఎంత బాధపడిన అది వృధానే. అందుకే నా మీద నేను ఫోకస్‌ పెట్టడం మొదలు పెట్టాను. ఈ 4 సంవత్సరాల సుదీర్ఘమైన, సుదూర బంధం ముగిసిన‌ వెంటనే లాక్‌డౌన్‌ విధించారు. ఆ త‌ర్వాత నేను ముంబైలో ఒంటరిగా ఉన్నా. కానీ కొన్ని విష‌యాలు ఎందుకు వ‌ర్క‌వుట్ కావో తెలుసుకోవడానికి స‌మ‌యం తీసుకున్నా. నా మీద నేను ఫోక‌స్ పెట్టాల‌నుకున్నా.. 2020 నాకు మంచి సంవత్సరం, రిలాక్సేష‌న్ దొరికింది. ప్రేమ అనేది సెల్ఫ్ ల‌వ్ కంటే ముఖ్య‌మైన‌ది కాదనే సత్యాన్ని గ్రహించాను’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే తను ప్రేమించిన వ్యక్తి ఎవరనేది మాత్ర సన్యా వెల్లడించలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement