రానాతో కటీఫ్?
రానాతో కటీఫ్?
Published Thu, Jan 16 2014 5:18 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
టాలీవుడ్ యువ నటుడు రానాతో త్రిష ప్రేమాయణం అంటూ ప్రచారం జోరుగా సాగింది. అందుకు తగ్గట్టుగానే ఈ జంట ఏ సినీ కార్యక్రమంలో అయినా కలిసే పాల్గొనేవారు. ఏ కార్యక్రమంలో అయినా వీరున్నారంటే ఫొటోగ్రాఫర్‌లకు చేతినిండా పనే అన్నంతగా ఉండేది. తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాల్లోనే కాదు మలేషియా, సింగపూర్‌లలో జరిగిన కార్యక్రమాలకు ఈ జంట ఎట్రాక్షన్‌గా నిలిచేది. దీంతో వీరి మధ్య ప్రేమ హైస్పీడ్‌లో నడుస్తోందని వదంతులు వచ్చాయి. అయితే ఈ వ్యవహారం గురించి త్రిష వద్ద ఎప్పుడు ప్రస్తావించినా రానా తనకు మంచి మిత్రుడని బదులిచ్చేవారు.
అలాంటిదిప్పుడు వీరి మధ్య ప్రేమ కాదు, స్నేహం కూడా బెడిసికొట్టిందని కోలీవుడ్ టాక్. అంతగా సన్నిహితంగా ఉన్నవారు ఎందుకిలా మారారన్నది అంతుచిక్కని ప్రశ్న. త్రిష, రానాల మధ్య ప్రేమ బ్రేకప్ అయ్యిందని ప్రచారం జరుగుతోంది. త్రిష నటించిన ఎండ్రెండ్రుం పున్నగై మంచి విజయం సాధించింది. ఈ బ్యూటీ నటించిన మరో చిత్రం భూలోకం విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం కన్నడ చిత్రంలో పునిత్ రాజకుమార్ సరసన నటిస్తున్నారు. రానా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న బాహుబలి, రుద్రమ దేవి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలాంటి వీరిద్దరి మధ్య పొరపొచ్చాలకు కారణం ఏమిటో మరి.
Advertisement
Advertisement