పదేళ్లుగా డేటింగ్‌.. ఇప్పుడు బ్రేకప్‌ | Actress Pooja Gor Post Confirming Break Up With Raj Singh Arora | Sakshi
Sakshi News home page

విడిపోతున్నట్లు ప్రకటించిన నటి

Published Thu, Dec 17 2020 10:18 AM | Last Updated on Thu, Dec 17 2020 11:36 AM

Actress Pooja Gor Post Confirming Break Up With Raj Singh Arora - Sakshi

టెలివిజన్‌ కపుల్‌ పూజా గోర్‌-రాజ్‌ సింగ్‌ అరోరాకు బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్‌. దాదాపు గత పదేళ్లుగా డెటింగ్‌లో ఉన్న వీరు తాజాగా విడిపోయారు. అయినప్పటికి తామిద్దంరం మంచి స్నేహితులుగా ఉంటామని.. ఒకరినొకరం గౌరవించుకుంటామని వెల్లడించారు. ఈ మేరకు పూజాగోర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటన చేశారు. ‘2020లో ఎన్నో మార్పులు వచ్చాయి. మంచివి ఉన్నాయి.. చెడువి ఉన్నాయి. గత కొద్ది నెలలుగా రాజ్‌తో నా బంధానికి సబంధించి ఎన్నో ఊహాగానాలు వెలువడుతున్నాయి. కష్టమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొద్దిగా సమయం పడుతుంది. దీని గురించి మాట్లాడటానికి నేను కొంచెం సమయం తీసుకున్నాను. రాజ్‌, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇక మీదట మా జీవితాలు వేర్వేరు మార్గాల్లో నడుస్తాయి. కానీ మా మధ్య ప్రేమ, గౌరవం జీవితాంతం అలానే ఉంటాయి. తన జీవితంలో అత్యున్నతంగా ఎదగాలని కోరుకుంటాను. నా జీవితం మీద ప్రభావం చూపిన వ్యక్తుల్లో తాను ఎంతో ముఖ్యమైన వాడు. నేను తనకు ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తాను’ అన్నారు పూజా గోర్‌. (రష్మిక కలలు చాలా పెద్దవి : రక్షిత్)

అంతేకాక ‘ఇక మీదట మేం మంచి స్నేహితులుగా ఉండబోతున్నాం. ఇది ఎన్నటికి మారదు. ఇక ఈ బ్రేకప్‌ గురించి బహిరంగంగా మాట్లాడటానికి నాకు కొంత సమయం, ధైర్యం అవసరం అయ్యాయి. నేను చెప్పాలనుకున్న విషయం ఇదే. మమ్మల్ని అర్థం చేసుకుని.. మా ప్రైవసీకి మర్యాద ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. అలానే రాజ్‌ సింగ్‌ అరోరాతో కలిసి ఉన్న ఫోటోలన్నింటిని డిలీట్‌ చేసింది. ఇక పూజ గోర్‌, రాజ్‌ ఇద్దరు 2004లో వచ్చిన టీవీ షో రిమిక్స్‌ ద్వారా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య పరిచయం.. ప్రేమ మొదలయ్యాయి.

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement