‘గుర్తింపు కోసమే.. నా పేరు వాడుకుంటున్నారు’ | Neha Kakkar Warns Her Ex Boyfriend Himansh Kohli | Sakshi
Sakshi News home page

నాకు, నా పేరుకు దూరంగా ఉంటే మంచిది : నేహా

Published Thu, Feb 20 2020 6:04 PM | Last Updated on Thu, Feb 20 2020 7:41 PM

Neha Kakkar Warns Her Ex Boyfriend Himansh Kohli - Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ నేహా కక్కర్‌ తన మాజీ ప్రియుడు, నటుడు హిమాన్ష్‌ కోహ్లిపై విరుచుకుడ్డారు. తన పేరును వాడుకుని వార్తల్లోకెక్కాలని చూస్తే.. ఊరుకునేది లేదంటూ తన మాజీ ప్రియుడికి సోషల్‌ మీడియాలో క్లాస్‌ పీకారు. అది చూసి నేహా అభిమానులంతా ఎప్పుడు కూల్‌గా ఉండే ఆమె ఎందుకీంత కోపంగా ఉందా అని ఆశ్యర్యపోతున్నారు. ప్రస్తుతం నేహా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చేసిన ఘాటు వాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నేహా ఓ చిన్నారితో సరదాగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియోకు ‘హ్యాపీ లైఫ్‌’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేశారు.

ఈ వీడియోకు నేహా ‘నేను చేసిన మంచి, కర్మ వల్లే సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను. అయితే కొంత మంది నన్ను చూసి ఓర్వలేక నాపై చేడు ప్రచారం చేస్తున్నారు. అంతేగాక నాకున్న పలుకుబడిని ఉపయోగించుకుని వార్తల్లో నిలవాలని చూస్తున్నారు. అయితే కేవలం వారి గర్తింపు కోసమే నా పేరును వాడుకుంటున్నారు తప్ప వేరే కారణం లేదు. నా పేరును వాడుకొని ఎదగాలనుకునే వారికి నేను ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఫేమ్‌ అయితే అవ్వండి అయితే అది మీ సొంత పని వల్ల అయ్యిండాలి.. తప్పా నా పేరుతో కాదు’ అంటూ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. 

మేం విడిపోవడానికి కారణం తనే: హీరో

అంతేగాక వారి గుర్తింపు కోసం మళ్ళీ తన పేరును వాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హిమాన్ష్‌ను హెచ్చారించారు. తాను నోరు తేరిస్తే.. తన తల్లిదండ్రులు, సొదరిలు కూడా ఏం చేశారో.. తనతో వారు చెప్పిన మాటలను కూడా బయటపెట్టాల్సి వస్తుందని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారు. ఇకనైనా నా పేరుకు, నాకు దూరంగా ఉంటేనే మంచిది అంటూ గట్టిగా సమాధానం ఇచ్చారు. కాగా ఇటీవల హిమాన్ష్‌ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘మా బ్రేకప్‌కు కారణం నేహానే. తానే విడిపోదామని చెప్పి.. సోషల్‌మీడియాలో నేనే మోసం చేసినట్లు నేహా పోస్టులు పెట్టి నన్ను చెడ్డావాడిగా చిత్రీకరించింది’ అని చెప్పిన సంగతి తెలిసిందే. 

Love You Guddu 😍😇 . Bhagwaan Ki Daya Se, By The Grace of God, I have Everything one wishes from Life 🙏🏼 Really Really Happy that I’m living a Happiest Life and that’s because of Good Deeds, Good Karma! ❤️💪🏼😇 Log Jo Bhi Bura Bolte Hain Mere Baare Mein They’re nothing but FAKE AND JEALOUS and USING MY FAME to appear in News. Pehle bhi Use Kiya, Mere Peeche se bhi Use Kar Rahe Hain. Oye! Get Famous coz of Your Work, Not bcz of Me. Don’t Use My Name to get famous again. If I open My Mouth............. I’ll bring here your Mother, Father and Sister’s deeds too.. What all they did and said to me. Don’t You Dare Use My Name and Dont become Bechaara in front of the world, making me look like a villain, Warning You!!!!! ⚠️ Stay Away from Me and My Name!!!!!! 🙏🏼

A post shared by Neha Kakkar (@nehakakkar) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement