ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌ వేపై ప్రమాదం.. ఐదుగురు మృతి | Accident Between Bus and Tractor on Mumbai pune Expressway | Sakshi

ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌ వేపై ప్రమాదం.. ఐదుగురు మృతి

Jul 16 2024 8:28 AM | Updated on Jul 16 2024 9:31 AM

Accident Between Bus and Tractor on Mumbai pune Expressway

ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం  చేటుచేసుకుంది. ఈ  ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 45 మంది గాయపడ్దారు. పండరీపూర్‌కు వెళ్తున్న బస్సు మార్గం మధ్యలో ట్రాక్టర్‌ను ఢీకొంది. దీంతో బస్సు, ట్రాక్టర్ రెండూ అదుపు తప్పి కాలువలో పడిపోయాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదం గురించి తెలియగానే స్థానికులు  పరుగుపరుగున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. సోమవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నవీ ముంబై పోలీస్ డీసీపీ వివేక్ పన్సారే కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement