'కెప్టెన్‌ అయ్యాక కోహ్లి చాలా మారిపోయాడు.. కానీ రోహిత్‌ అలా కాదు' | Virat Kohli changed with fame And captaincy unlike Rohit Sharma: amit mishra | Sakshi

'కెప్టెన్‌ అయ్యాక కోహ్లి చాలా మారిపోయాడు.. కానీ రోహిత్‌ అలా కాదు'

Jul 16 2024 9:20 AM | Updated on Jul 16 2024 11:20 AM

Virat Kohli changed with fame And captaincy unlike Rohit Sharma: amit mishra

టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి భార‌త మాజీ స్పిన్న‌ర్ అమిత్ మిశ్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. కెప్టెన్ అయినా త‌ర్వాత విరాట్ ప్ర‌వ‌ర్తనా విధానంలో తేడా వ‌చ్చింద‌ని మిశ్రా తెలిపాడు.

ప్ర‌స్తుత కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, కోహ్లి మ‌ధ్య ఎంతో తేడా ఉంద‌ని మిశ్రా అభిప్రాయ‌ప‌డ్డాడు. మిశ్రా తాజాగా  శుభాంక‌ర్ మిశ్రా అనే యూట్యూబ‌ర్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. ఈ క్ర‌మంలో కోహ్లి, రోహిత్‌లో ఎవ‌రు బెస్ట్ కెప్టెన్ ? ఎవ‌రికి జ‌ట్టులో స్నేహితులు ఎక్కువ‌? అనే ప్ర‌శ్న‌లు మిశ్రాకు ఎదుర‌య్యాయి.

"నేను అబ‌ద్దం చెప్ప‌ను. ఒక క్రికెటర్‌గా విరాట్‌ని నేను చాలా గౌర‌విస్తాను. కానీ  కోహ్లి కెప్టెన్ అయ్యాక అత‌డిలో చాలా మార్పులు వ‌చ్చాయి. అందుకే గతంలో అతనితో ఉన్నట్లు ఇప్పుడు ఉండటం లేదు. దాదాపుగా మాట్లాడటం మానేశాను.

కోహ్లికి ఒక ఫేమ్ వ‌చ్చాక వ‌చ్చాక పూర్తిగా మారిపోయాడు. అందుకే అత‌డికి జ‌ట్టులో స్నేహితులు త‌క్కువ‌. మనకు కీర్తి, డబ్బు వచ్చింది కాబట్టి, ఎవరైనా ఏదో ప్రయోజనం ఆశించే మన దగ్గరకు వస్తారని కొందరు అనుకుంటారు.

కానీ నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. అయితే రోహిత్ శర్మకు విరాట్‌కు చాలా తేడా ఉంది. విరాట్‌, రోహిత్ స్వభావాలు వేరు. రోహిత్ గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రోహిత్‌ను మొదటి రోజు కలిసినప్పిడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. 

నేను కొన్నేళ్లుగా భారత జట్టులో భాగం కాలేదు. కానీ  ఇప్పటకీ  నేను రోహిత్‌ను ఐపీఎల్‌లో లేదా మరేదైనా ఈవెంట్‌లో కలిసినప్పుడు అతడు చాలా సరదగా మాట్లాడుతుంటాడు. 

భార‌త జట్టు కెప్టెన్ అయినా నాతో స్నేహంగా మెలిగి జోక్‌లు వేసేవాడు. రోహిత్ ఇప్పుడు వరల్డ్‌లోనే నెం1 కెప్టెన్‌. వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌. అంతేకాదు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచాడు’ అని మిశ్రా పేర్కొన్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement