CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవ సంకల్పయాత్ర.. భీమలింగానికి రేవంత్‌ ప్రత్యేక పూజలు | Revanth Reddy Musi Punarjeevana Sankalp Yatra Updates | Sakshi

మూసీ పునర్జుజీవ సంకల్పయాత్ర.. భీమలింగానికి రేవంత్‌ ప్రత్యేక పూజలు

Nov 8 2024 3:45 PM | Updated on Nov 8 2024 8:13 PM

Revanth Reddy Musi Punarjeevana Sankalp Yatra Updates

సంగెం నుంచి రేవంత్‌రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర ప్రారంభమైంది.

సాక్షి, వరంగల్‌: సంగెం నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర శుక్రవారం మధ్యాహ్నాం నుంచి ప్రారంభమైంది. భీమలింగం వరకు 2.5 కి.మీ మేర ఈ పాదయాత్ర కొనసాగింది. తొలుత యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చేరుకున్న సీఎం రేవంత్‌ తన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైటీడీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. యాదాద్రి ఆలయంతో పాటు జిల్లా అభివృద్ధి పనులు, పెండింగ్‌ పనులపై చర్చించారు.

అనంతరం వలిగొండ మండలం సంగెం గ్రామానికి చేరుకుని మూసీ పరీవాహక ప్రాంత రైతులతో కలిసి కాల్వల్ని పరిశీలించారు. తర్వాత రైతులు, కుల వృత్తిదారులతో సమావేశమై వారి యోగక్షేమాలు, మూసీ జలాలతో జరిగే నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. సంగెం-భీమలింగం-ధర్మారెడ్డిపల్లి కెనాల్‌ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు పాదయాత్ర కొనసాగింది. మూసీలో నీటి కాలుష్యాన్ని రేవంత్‌రెడ్డి పరిశీలించారు. భీమలింగంకు సీఎం పూజలు చేశారు. నాగిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసే సభలో సీఎం ప్రసంగించారు. అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement