భారీ మెజార్టీతో అశోక్బాబు గెలుపు ఖరారు | ashok babu victory decided | Sakshi
Sakshi News home page

భారీ మెజార్టీతో అశోక్బాబు గెలుపు ఖరారు

Published Sun, Jan 5 2014 8:30 PM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM

అశోక్ బాబు

అశోక్ బాబు

హైదరాబాద్: ఎపిఎన్జీఓ ఎన్నికలలో భారీ మెజార్టీతో అశోక్ బాబు విజయం ఖరారైంది.  ఆరవ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి అశోక్ బాబుకు 480 ఓట్లు రాగా,  ప్రత్యర్ధి అబ్దుల్ బషీర్కు 120 ఓట్లు వచ్చాయి. ఇంకా రెండు రౌండ్లు లెక్కించవలసి ఉంది.

ఏపీఎన్జీవో ఎన్నికలు గన్‌ఫౌండ్రీలోని సంఘం కార్యాలయంలో  ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3  వరకు జరిగాయి. ఏపీఎన్జీవో సంఘానికి 13 సీమాంధ్ర జిల్లాలతో పాటు హైదరాబాద్, నాగార్జునసాగర్ జిల్లా కమిటీలు ఉన్నాయి. 15 జిల్లాల కార్యవర్గాలు, తాలూకా శాఖల అధ్యక్ష, కార్యదర్శులకు ఓటు హక్కు ఉంటుంది. ప్రస్తుతం 847 మంది ఓటర్లు ఉన్నారు. అధ్యక్షుడు, సహాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కార్య నిర్వాహక కార్యదర్శి, కోశాధికారి, ఎనిమిది మంది ఉపాధ్యక్షులు, నలుగురు కార్యదర్శులను ఎన్నుకోనున్నారు. ఈ పోస్టులకు అశోక్‌బాబు, అబ్దుల్ బషీర్ ప్యానెళ్ల పక్షాన మొత్తం 33 మంది పోటీ పడ్డారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement