రాంరెడ్డికి బుక్ ఆఫ్ స్టేట్ రికార్డు | Book of State record to ranreddy | Sakshi
Sakshi News home page

రాంరెడ్డికి బుక్ ఆఫ్ స్టేట్ రికార్డు

Published Mon, Jan 6 2014 4:40 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM

Book of State record to  ranreddy

కడెం, న్యూస్‌లైన్ : మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు నల్ల రాంరెడ్డికి బుక్ ఆఫ్ స్టేట్ రికార్డు దక్కింది. 20 సంవత్సరాల కృషి ఫలించి.. ఆదివారం అవార్డు అందుకున్నారు. కడెం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఆయన 16 వ శతాబ్దం నాటి వేమన, సుమతి శతకాల నుంచి 2013లో వెలువడిన మా పల్లెటూరు శతకం వరకు 170 శతకాలు సేకరించారు. వాటిని విద్యార్థులకు పరిచయం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన మ్యాజిక్ హౌజ్‌లోని అబ్రకదబ్ర కళావేదికలో ప్రపం చ ప్రఖ్యాత ఇంద్రజాలికుడు, మనస్తత్వ శాస్త్రవేత్త చింతా శ్యామ్‌కుమార్ పరిశీలించి బుక్ ఆఫ్ స్టేట్ రికార్డులోకి పేరు ఎక్కించారు. రాంరెడ్డిని అవార్డుతోపాటు గురుబ్రహ్మ పురస్కారంతో సత్కరించారు. ప్రతిభ ఉండి రికార్డులకు ఎక్కాలంటే శ్యామ్‌కుమార్(99663 72645)ను సంప్రదించాలని రాంరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement