గుంటూరు: ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ విధానాన్ని వెంటనే నిలిపివేయాలని రాజధాని నిర్మాణ పరిధి రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధాని రైతుల రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు అంశాలపై రైతులు తీర్మానం చేశారు. అంతేకాకుండా ఇప్పటివరకు జరిగిన భూసమీకరణపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.
కేంద్రం తీసుకువచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నాహజారే చేపట్టిన దీక్షకు పూర్తి మద్దతు ప్రకటించారు. హజారే దీక్షకు మద్దతుగా ఈ నెల 23, 24 తేదీల్లో రాజధాని గ్రామాల్లో కూడా సామూహిక దీక్షలు చేయాలని రైతులు తీర్మానించారు.