సూళ్లూరుపేట (నెల్లూరు): నెల్లూరు జిల్లా ఎక్సైజ్ అధికారులు స్పిరిట్‌ను అక్రమంగా తరలించే అంతర్ రాష్ట్ర దొంగలు ఇద్దరిని అరెస్ట్ చేశారు. గతేడాది అక్టోబర్‌లో 80 కేన్ల రెక్టిఫైడ్ స్పిరిట్‌ను అక్రమంగా తరలిస్తుండగా సూళ్లూరుపేట మండలం దొరవారి సత్రం వద్ద పోలీసులు పట్టుకున్నారు. నాటు సారా తయారీకి వినియోగించే ఈ స్పిరిట్‌ను పోజెలి మండలం పెద్దపల్లి గ్రామంలోని లక్ష్మీ కెమికల్ అండ్ ఫార్మాసూటికల్ కంపెనీ నుంచి కేరళకు తరలిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది.
ఎక్సైజ్ అధికారులు ఫార్మా కంపెనీ మేనేజర్‌ను విచారించగా.. అతను ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు బృందం కేరళలోని తిరువనంతపురం వెళ్లి దొంగలు సన్నాల్ (22), నిథిన్ (22)ను గురువారం అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.