సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగుల చేపట్టిన సమ్మె అంతం కాదని, ఆరంభం మాత్రమేనని సీమాంధ్ర విద్యుత్ ఐకాస ఛైర్మన్ సాయిబాబా శనివారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన 72 గంటల సమ్మె ఈ రోజు అర్థరాత్రితో ముగిస్తుందన్నారు.
రేపటినుంచి విద్యుత్ ఉద్యోగులు విధులకు హాజరువుతారని తెలిపారు. అలాగే సమ్మెలో భాగంగా ప్రభుత్వానికి అప్పగించిన సెల్ ఫోన్ సిమ్ కార్డులను రేపు తిరిగి తీసుకుంటామన్నారు. ఈ నెల 16,17 తేదీల్లో తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని సాయిబాబ ఈ సందర్భంగా వెల్లడించారు.